బరాక్ ఒబామా తమ స్వంత 'దెయ్యం'లోనే ప్రయాణిస్తారా..?

By Ravi

అమెరికన్ అధ్యక్షుడు బరాక్ ఒబామా మరికొద్ది రోజుల్లో భారత్‌కు రానున్న సంగతి తెలిసినదే. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఒబామా భారత్‌కు రావటం ఇది రెండవ సారి. ఒబామా రాక నేపథ్యంలో, అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఆయన భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒబామాతో పాటుగా ఇండియాకు ఆయన స్వంత అధికారిక కారు (క్యాడిలాక్) కూడా రానుంది.

సాధారణంగా అమెరికా అధ్యక్షులు ఏ దేశానికి వెళ్లినా, అనేక భద్రతా ఫీచర్లతో కూడిన స్వంత అధికారిక కారులోనే ప్రయాణిస్తారు. అయితే, మన దేశంలో రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా వచ్చిన ఇతర దేశాల అధిపతులు రాష్ట్రపతితో కలిసి వారి వాహనంలోనే వేదికను చేరుకోవడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో, ఒబామా ఈ సంప్రదాయాన్ని గౌరవించి రాష్ట్రపతి కారులో ప్రయాణిస్తారా లేక అమెరికా నుంచి వస్తున్న క్యాడిలాక్ కారులోనే ప్రయాణిస్తారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

అమెరికా సైన్యం ముద్దుగా ది బీస్ట్ (దెయ్యం) అని పిలుచుకునే ఈ అత్యంత సురక్షితమైన, సాయుధ మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్యాడిలాక్ లీమోజైన్‌ను అమెరికా అధ్యక్షుడి కోసం జనరల్ మోటార్స్ ప్రత్యేకంగా కస్టమైజ్ చేసింది. మరి ఈ దెయ్యం విశిష్టతలు ఏంటో తెలుసుకుందాం రండి..!

బరాక్ ఒబామా బీస్ట్ కారు గురించి..

భారత్‌లో ఒబామా ఈ కారులోనే తిరగనున్నారు. అంతేకాకుండా.. ఒబామా చూట్టూ అమెరికా నుంచే వచ్చే ఆయన బలగాలే ఉంటాయి.

బరాక్ ఒబామా బీస్ట్ కారు గురించి..

ఈ కారు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్, బాంబ్ ప్రూఫ్, కెమికల్ ప్రూఫ్. రాకెట్ లాంచర్ల ద్వారా ప్రయోగించే శక్తివంతమైన పేలుడు పదార్థాలను సైతం ఇది ఎదుర్కోగలదు. కారు చుట్టపక్కల హ్యాండ్ గ్రనేడ్ విసిరినా కూడా కారులోని ప్రయాణికులకు ఎలాంటి హాని జరగదు.

బరాక్ ఒబామా బీస్ట్ కారు గురించి..

ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక్క బటన్ నొక్కడం ద్వారా అధ్యక్షుడి చుట్టూ 8 అంగుళాల మందం ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ ద్వారాలు, 5 అంగుళాల మందం ఉన్న అద్దాలు తెరచుకొని ఆయన చుట్టూ రక్షణగా నిలుస్తాయి. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ప్రమాదంలో గాయపడిన అధ్యక్షుడికి అత్యవసరంగా రక్తాన్ని అందించాల్సి వచ్చినప్పుడు కారులో అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ రక్తాన్ని కూడా స్టోర్ చేసి ఉంచుతారు.

బరాక్ ఒబామా బీస్ట్ కారు గురించి..

సుమారు 8000 కేజీల బరువు ఉండే ఈ నలుపు రంగు కాడిలాక్ కారు గంటకు 60 మైళ్ల వేగంతో (గంటకు 96.5 కి.మీ.) ప్రయాణిస్తుంది. ప్రమాదంలో కారు టైర్లు పేలిపోయినా వాహనం మాత్రం ఆగకుండా దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

బరాక్ ఒబామా బీస్ట్ కారు గురించి..

ఈ కారులో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. జస్ట్ ఈ కారు వెనుక సీటులో కూర్చునే ఒబామా ప్రపంచంలో ఏ మూల నుంచైనా అమెరికాను పాలించే వెసులుబాటు ఉంటుంది. లాప్‌టాప్, వైర్‌లెస్ ఇంటర్నెట్, శాటిలైట్ ఫోన్ వంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఎల్లప్పుడూ అమెరికాలోని వైట్‌హౌస్‌కు కనెక్ట్ చేయబడి ఉంటాయి.

బరాక్ ఒబామా బీస్ట్ కారు గురించి..

ఈ షెవర్లే క్యాడిలాక్ లీమోజైన్ గరిష్ట మైలేజ్ లీటరుకు 2 కిలోమీటర్లు మాత్రమే. ఇది డీజిల్ ఇంధనంతో నడుస్తుంది. అమెరికా సీక్రెస్ సర్వీస్ వద్ద బీస్ట్ లాంటి కార్లు మొత్తం 12 ఉన్నట్లు సమాచారం. ఒక్కొక్క కారు ఖరీదు సుమారు రూ.9 కోట్లు ఉండొచ్చని అంచనా.

బరాక్ ఒబామా బీస్ట్ కారు గురించి..

ఈ బీస్ట్ కారును ఒక దేశం నుంచి మరొక దేశానికి తరలించేందుకు గాను ఇందు కోసం ఓ ప్రత్యేకమైన విమానం కూడా ఉంది. సి-17 గ్లోబ్‌మాస్టర్ అనే విమానంలో ఈ కారును తరలిస్తారు. బీస్ట్ కారునే కాకుండా భారీగా ఆయుధాలు కలిగిన షెవర్లే సబర్బన్ అనే కమ్యూనికేషన్ వెహికల్‌ను ప్రెసిడెంట్ ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకువెళ్తుంటారు.

బరాక్ ఒబామా బీస్ట్ కారు గురించి..

బీస్ట్ తరలింపు కోసం ఉపయోగించే ప్రత్యేక విమానంలో కేవలం కారునే కాకుండా, ఆ కారులో ఉపయోగించే డీజిల్‌ను కూడా తరలిస్తారు. ఇది డ్యూరామ్యాక్స్ డీజిల్ ఇంజన్‌తో నడుస్తుంది. పెట్రోల్ అంటుకున్నంత వేగంగా డీజిల్ అంటుకోదు కాబట్టే, ఈ కారులో డీజిల్ ఇంజన్‌ను, ఇంధనాన్ని ఉపయోగిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో డీజిల్ అవసరమైనప్పుడు ఆయా దేశాల్లో లభ్యమయ్యే నాణ్యమైన డీజిల్‌ను ఈ కారులో ఉపయోగిస్తారు.

బరాక్ ఒబామా బీస్ట్ కారు గురించి..

సీక్రెట్ సర్వీస్ 'రోడ్‌‌రన్నర్'గా పిలిచే ఈ షెవర్లే సబర్బన్ వాహనం ప్రపంచంలో కెల్లా అత్యంత ధృడమైన కమ్యూనికేషన్ వాహనం. అంతేకాదు, ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత శక్తివంతమైన శాటిలైట్ కమ్యూనికేషన్ వాహనాల్లో ఒకటి. ఇది నేరుగా మిలటరీ శాటిలైట్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

బరాక్ ఒబామా బీస్ట్ కారు గురించి..

బీస్ట్ కారు బూట్ స్పేస్‌లో ఫైర్‌ఫైటింగ్ ఎక్విప్‌మెంట్, ఆక్సిజెన్ ట్యాంక్స్, టియర్ గ్యాస్ క్యానిస్టర్స్, షాట్‌గన్స్, గ్రెనేడ్ లాంచర్స్ వంటి ఆయుధాలు ఉంటాయి. ఇది స్టాక్ కారు కాదు, ప్రసిడెంట్ కోసం మాత్రమే ప్రత్యేకంగా తయారు చేయబడిన కారు.

బరాక్ ఒబామా బీస్ట్ కారు గురించి..

అమెరికా గూఢచార సంస్థ (సీఐఏ)కు చెందిన నిపుణుడైన ఏజెంట్ ఈ కారును డ్రైవ్ చేస్తాడు. ఈ డ్రైవర్ ఎఫ్1 డ్రైవర్ కన్నా తక్కువేం కాదు. అమెరికా అధ్యక్షుడికి వ్యక్తిగత డ్రైవర్ కావటం అంటే అషామాషీ కాదు. హై స్పీడ్ ఎవేషన్ టెక్నిక్‌లో నిపుణుడై ఉండాలి, జే-టర్న్ వంటి టైట్ కర్వ్స్‌లో సైతం చురుకుగా వాహనాన్ని నడపగలగాలి. ఈ డ్రైవరుకు కారు గురించి, అందులోని ఫీచర్ల గురించి జనరల్ మోటార్స్ ఇంజనీర్లు ఓ సీక్రెట్ ప్లేస్‌లో ట్రైనింగ్ ఇస్తారు.

బరాక్ ఒబామా బీస్ట్ కారు గురించి..

బీస్ట్ కారులో భారీ ఇంజన్ ఉన్నప్పటికీ, దీని అధిక భారంగా కారణంగా ఇది ఎక్కువ వేగంతో ప్రయాణించలేదు. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవటానికి 15 సెకండ్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు.

బరాక్ ఒబామా బీస్ట్ కారు గురించి..

బీస్ట్ కారులో సాధారణంగా, డ్రైవర్ మరియు ఓ సీనియర్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ మరియు ప్రెసిడెంట్‌ మొత్తం ముగ్గురు ప్రయాణిస్తారు. కానీ, వాస్తవానికి ఈ కారులో ప్రెసిడెంట్‌తో పాటుగా మరో ఐదుగురు (మొత్తం ఏడుగురు) ప్రయాణీకులు ప్రయాణించవచ్చు.

బరాక్ ఒబామా బీస్ట్ కారు గురించి..

అమెరికా సీక్రెట్ సర్వీస్ వద్ద రెండు బీస్ట్ కార్లు ఉన్నాయి. ఈ రెండు కార్ల పనితీరు ఒకేలా ఉంటుంది. ఆగంతుకులను కన్ఫ్యూజ్ చేసేందుకు ఈ రెండు కార్లను మార్చి మార్చి నడుపుతుంటారు. అంతేకాకుండా.. బీస్ట్ మాదిరిగానే కనిపించే మరికొన్ని కార్లను ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, అతిథుల కోసం ఉపయోగిస్తారు. కాబట్టి ప్రెసిడెంట్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఆయన ఏ కారులో ఉన్నడో కనుక్కోవటం కష్టం.

Most Read Articles

English summary
U.S. President Barack Obama has a Cadillac limousine car, the world's most secure car will not be an exaggeration if asked. The U.S. Secret staff called this car "The Beast". Here we are giving full detail about Barak Obama's Cadillac Limousine. 
Story first published: Tuesday, January 20, 2015, 11:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X