యూరప్‌ కంపెనీలో పెట్టుబడి సిద్దమైన Amara Raja.. ఎందుకో తెలుసా..?

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం చెందిన బ్యాటరీ కంపెనీలలో 'అమర రాజా' కంపెనీ ఒకటి. ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా పనిచేస్తున్న అమర రాజా బ్యాటరీస్‌ సంస్థ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన టెక్నాలజీపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఈ-మొబిలిటీ బ్యాటరీల తయారీ, అభివృద్ధి చేయడం కోసం 'ఇనోబాట్‌ ఆటో' సంస్థలో పెట్టుబడి పెట్టడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ పెట్టుబడి అమర రాజా బ్యాటరీస్‌కు యూరోపియన్ బ్యాటరీ మార్కెట్‌లోకి విస్తరించే అవకాశాన్ని కల్పిస్తోంది.

యూరప్‌ కంపెనీలో పెట్టుబడి సిద్దమైన Amara Raja.. ఎందుకో తెలుసా..?

అమర రాజా కంపెనీ ఈ పెట్టుబడితో త్వరలో యూరప్‌లో బ్యాటరీ ఉత్పత్తి కోసం గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. యూరప్‌లోని అనేక దేశాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రకటించిన తర్వాత, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు యొక్క పెరుగుదల గణనీయంగా పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలు పనిచేయడానికి బ్యాటరీలు చాలా అవసరం, కావున ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన బ్యాటరీలను తయారు చేసే కంపెనీల ఇప్పుడు డిమాండ్ భారీగా పెరిగింది.

యూరప్‌ కంపెనీలో పెట్టుబడి సిద్దమైన Amara Raja.. ఎందుకో తెలుసా..?

అమర రాజా కంపెనీ 'ఎనర్జీ అండ్ మొబిలిటీ' వ్యూహంలో భాగంగా ఈ సంవత్సరం ప్రారంభంలో తన గ్రీన్ టెక్నాలజీ ఆశయాలను రూపొందించిన ఈ వ్యూహాత్మక చర్య చాలా సహాయపడుతుంది. ఇనోబాట్‌ యొక్క అత్యంత వినూత్నమైన బ్యాటరీ టెక్నాలజీని అమర రాజా ఇప్పటికే అందుబాటులో ఉన్న మార్కెట్‌లకు అనుగుణంగా మార్చేందుకు కూడా సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

యూరప్‌ కంపెనీలో పెట్టుబడి సిద్దమైన Amara Raja.. ఎందుకో తెలుసా..?

ఆటోమోటివ్, కమర్షియల్ వెహికల్, మోటార్‌స్పోర్ట్ మరియు ఏరోస్పేస్ రంగాల్లోని కస్టమర్‌ల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి కస్టమ్-డిజైన్ చేయబడిన ప్రీమియం ఎలక్ట్రిక్ బ్యాటరీల మార్గదర్శక పరిశోధన, అభివృద్ధి, తయారీ మరియు అందించడంలో ఇన్నోబాట్ ప్రత్యేకత కలిగి ఉంది. ప్రస్తుతం బాధ్యతాయుతమైన ESG ఫ్రేమ్‌వర్క్‌లో "క్రెడిల్-టు-క్రెడిల్" వ్యూహాన్ని అనుసరించడం ద్వారా, ఇనోబాట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్‌ల అమలును ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

యూరప్‌ కంపెనీలో పెట్టుబడి సిద్దమైన Amara Raja.. ఎందుకో తెలుసా..?

ఇనోబాట్ ప్రస్తుతం స్లోవేకియాలోని వోడెరాడిలో బ్యాటరీ రీసర్చ్ మరియు అభివృద్ధి కేంద్రం మరియు ఉత్పత్తి శ్రేణిని అభివృద్ధి చేస్తోంది. ప్రాజెక్ట్ యొక్క తదుపరి దశ యూరప్ అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా ప్లాన్ చేయబడిన బహుళ గిగాఫ్యాక్టరీల ద్వారా తయారీ స్థాయిపై దృష్టి పెడుతుంది. ప్రధాన యూరోపియన్ యుటిలిటీలలో ఒకటైన CEZ మరియు కంపెనీలో పెట్టుబడి పెట్టిన గ్లోబల్ మైనింగ్ దిగ్గజం రియో ​​టింటోతో సహా బలమైన భాగస్వాముల కన్సార్టియం దీనికి మద్దతు ఇస్తుంది.

యూరప్‌ కంపెనీలో పెట్టుబడి సిద్దమైన Amara Raja.. ఎందుకో తెలుసా..?

2021 ప్రారంభంలో అమర రాజా గ్రీన్‌ టెక్నాలజీపై భవిష్యత్తు వ్యూహాన్ని వెల్లడించింది. దీనిలో భాగంగానే తాజాగా ఇనోబాట్‌లో పెట్టుబడుల విషయం ప్రకటించింది. ఈ పెట్టుబడుల తర్వాత ఈ మొబిలిటీ బ్యాటరీల తయారీకి అవసరమైన టెక్నాలజీ, నైపుణ్యాలపై కంపెనీకి పట్టు లభిస్తుంది.

యూరప్‌ కంపెనీలో పెట్టుబడి సిద్దమైన Amara Raja.. ఎందుకో తెలుసా..?

అమర రాజా కంపెనీ ఇప్పటికే మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్, ఫోర్డ్ ఇండియా లిమిటెడ్, టాటా మోటార్స్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, రెనాల్ట్ నిస్సాన్, హోండా మోటార్ సైకిల్స్ & స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ ఆటో లిమిటెడ్ వంటి వాటికీ బ్యాటరీలను అందిస్తుంది.

యూరప్‌ కంపెనీలో పెట్టుబడి సిద్దమైన Amara Raja.. ఎందుకో తెలుసా..?

కేవలం ఇది మాత్రమే కాకూండా కంపెనీ పారిశ్రామిక, ఆటోమోటివ్ బ్యాటరీలు ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. ఎన్నో దేశాలలోని చాలా కంపెనీలకు మన నుంచి బ్యాటరీలు ఎగుమతవుతుండటం నిజంగా గర్వకారణం.

యూరప్‌ కంపెనీలో పెట్టుబడి సిద్దమైన Amara Raja.. ఎందుకో తెలుసా..?

అమర రాజా కంపెనీ యొక్క బ్యాటరీ బ్రాండ్‌లలో పవర్‌స్టాక్, అమరాన్ వోల్ట్ మరియు క్వాంటా వంటివి ఉన్నాయి. కంపెనీ అమరాన్ మరియు పవర్ జోన్ టిఎమ్ బ్రాండ్‌ల క్రింద ఆటోమోటివ్ బ్యాటరీల తయారీలో అగ్రగామిగా ఉంది. ఇది పెద్ద పాన్-ఇండియా సేల్స్ మరియు సర్వీస్ రిటైల్ నెట్‌వర్క్ ద్వారా పంపిణీ చేయబడుతుంది. అమర రాజా కంపెనీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రపంచ దేశాలకు తన వ్యాప్తిని రోజు రోజుకి దశ దిశల్లో విస్తరిస్తూనే ఉంది.

యూరప్‌ కంపెనీలో పెట్టుబడి సిద్దమైన Amara Raja.. ఎందుకో తెలుసా..?

ఈ బ్యాటరీ తయారీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కరకంబాడి మరియు నూనెకుండపల్లిలో రెండు ప్లాంట్స్ కలిగి ఉంది. ఈ కంపెనీ ఎంతోమంది ప్రజలకు ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. అమర రాజా కంపెనీలో దాదాపు 16,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.ప్రస్తుతం అమర రాజా కంపెనీ పెడుతున్న పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ కీర్తి ఇప్పుడు నలుదిశలా వ్యాపిస్తుంది. కంపెనీ యొక్క బ్యాటరీలు ఇప్పుడు యూరోపియన్ దేశాలలో సైతం ఉపయోగించడతాయి.

Most Read Articles

English summary
Amara raja to invest in europe based inobat auto details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X