సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇష్టంగా కొంటున్న కారు.. అందరి ఫేవరెట్‌! భారీగా పెరిగిన సేల్స్

కియా సెల్టోస్ (Kia Seltos) భారత మార్కెట్లో మిడ్-సైజ్ SUV విభాగంలో పెద్ద మార్పులకు కారణమైన ప్రముఖ మోడళ్లలో ఒకటి. ఈ SUV మొదటిసారి మార్కెట్లోకి వచ్చినప్పుడే తన ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అప్పటివరకు ఈ సెగ్మెంట్‌లో ఆధిపత్యం చెలాయించిన Hyundai Cretaకి గట్టి పోటీగా నిలిచి, కొన్ని సందర్భాల్లో అమ్మకాల పరంగా దానిని కూడా అధిగమించింది. అందుకే కొంతకాలం పాటు ఈ కారు మిడ్-సైజ్ SUV మార్కెట్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న మోడల్‌గా గుర్తింపు పొందింది.

అయితే కాలక్రమేణా పోటీ పెరగడంతో కొంతకాలం పాటు ఈ మోడల్ తన పూర్వ వైభవాన్ని కొంత కోల్పోయింది. కానీ కంపెనీ కొత్త తరం మోడల్‌ను ప్రవేశపెట్టిన తరువాత పరిస్థితి మళ్లీ మారింది. కొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, అప్‌డేటెడ్ టెక్నాలజీతో వచ్చిన ఈ కొత్త వెర్షన్ వినియోగదారులను మళ్లీ ఆకట్టుకుంది. ఫలితంగా ప్రజలు కొత్త తరం కియా సెల్టోస్ను మళ్లీ పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయడం ప్రారంభించారు.

Kia Seltos Sales Growth 60 Percent In February 2026 Crosses 10000 Units

ఫిబ్రవరి 2026 అమ్మకాల గణాంకాలు దీనికి స్పష్టమైన ఉదాహరణగా నిలిచాయి. గత నెలలో ఈ SUV మొత్తం 10,308 యూనిట్లు భారత మార్కెట్లో విక్రయించబడింది. ఇదే మోడల్ ఫిబ్రవరి 2025లో కేవలం 6,446 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సంఖ్యలను పోల్చితే వార్షికంగా దాదాపు 60 శాతం అమ్మకాల వృద్ధిని సాధించినట్లు తెలుస్తోంది. ఈ ఫలితంతో Kia Seltos మిడ్-సైజ్ SUV విభాగంలో మళ్లీ బలమైన స్థానాన్ని సంపాదించింది.

ఫిబ్రవరి 2026లో అమ్మకాల పరంగా ఇది హ్యూందాయ్ క్రెటా, మారుతి సుజకి గ్రాంగ్ విటారా తర్వాత మూడవ స్థానాన్ని దక్కించుకుంది. కొత్త తరం మోడల్ రాకతో కియా బ్రాండ్ మళ్లీ ఉత్సాహంగా మార్కెట్లో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఈ SUV మరోసారి నెలకు 10,000 యూనిట్ల అమ్మకాల మార్క్‌ను దాటడం కంపెనీకి పెద్ద విజయంగా భావిస్తున్నారు. ధర రూ.10.99 లక్షల నుండి ఎక్స్-షోరూమ్ ధర రూ.19.99 లక్షల వరకు ఉంటుంది.

Kia Seltos Sales Growth 60 Percent In February 2026 Crosses 10000 Units

ఈ మిడ్-సైజ్ SUV మూడు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. వాటిలో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ట్రాన్స్మిషన్ ఎంపికల విషయానికి వస్తే, 6-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్, iMT, 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఫీచర్ల పరంగా కూడా ఈ SUV చాలా అధునాతనంగా ఉంటుంది.

ఇందులో 12.3-అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లేలు, కొత్త త్రీ-స్పోక్ కియా స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. అదనంగా లెవల్-2 ADAS భద్రతా టెక్నాలజీ, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్, LED లైట్ ప్యాకేజీ, వెనుక సీట్లకు రిక్లైన్ ఫంక్షన్ వంటి ఆధునిక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Kia Seltos Sales Growth 60 Percent In February 2026 Crosses 10000 Units

కియా సెల్టోస్ భద్రతా పరంగా కూడా మంచి స్థాయిలో ఫీచర్లను అందిస్తోంది. ఈ SUVలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అదనంగా హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు, రివర్స్ కెమెరా వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Sunday, March 15, 2026, 7:25 [IST]
English summary
Kia seltos sales growth 60 percent in february 2026 crosses 10000 units
Read more on: #kia motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+