భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

By N Kumar

మన భారతదేశంలో రహదారులకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో కెల్లా అత్యధిక దూరం రోడ్ నెట్‌వర్క్ కలిగిన దేశాల్లో మన దేశం ద్వితీయ స్థానంలో ఉంది. మనదేశంలో దాదాపు 43.20 లక్షల కిలోమీటర్లకు పైగా రోడ్ నెట్‌వర్క్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

భారతదేశ రోడ్ నెట్‌వర్క్‌లో 1000 కిలోమీటర్లకు పైగా ఎక్స్‌ప్రెస్‌వేలు, 79,243 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు, 13.19 లక్షల కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు మరియు ఇతర ప్రధాన జిల్లా, గ్రామీణ రహదారులు ఉన్నాయి. కాగా.. ఈ రోడ్ నెట్‌వర్క్ విస్తరణ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది.

ఇదంతా అటుంచితే మన భారత రహదారుల గురించి మనం ఇంత వరకు కనీ వినీ ఎరుగని విషయాల గురించి తెలుసుకుందాం రండి.

భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

ప్రస్తుతం భారతీయ రహదారుల్లో ఉన్న జాతీయ, రాష్ట, ప్రాంతీయ రహదారుల మొత్తం పొడవు సుమారుగా 33 లక్షల కిలోమీటర్లుగా ఉంది.

భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

దేశవ్యాప్తంగా ఉన్న 200 జాతీయ రహదారుల మొత్తం పొడవు 92,851.07 కిలోమీటర్లు మరియు రాష్ట్రీయ రహదారుల మొత్తం పొడవు 1,31,899 కిలోమీటర్లుగా ఉంది.

భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

మొత్తం జాతీయ రహదారులు డబుల్ లైన్లతో నిర్మించబడ్డాయి. మరియు సుమారుగా 22,900 కిలోమీటర్ల రహదారిలో 4 మరియు 6 లేన్ల రహదారిని నిర్మించారు.

భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

భారత దేశపు జాతీయ రహదారుల నెట్‌వర్క్‌లో జాతీయ రహదారుల నిర్మాణం మరియు నిర్వహణ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఉంటాయి.

భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

దేశవ్యాప్తంగా ఉన్న రహదారుల్లో జాతీయ రహదారుల భాగస్వామ్యం కేవలం 1.7 శాతం మాత్రమే ఉంది. అయితే 40 శాతం ట్రాఫిక్ ఆ రహదారుల నియంత్రణలో ఉంది.

భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

భారత దేశంలో ఉన్న అత్యంత చిన్న జాతీయ రహదారి ఎన్‌హెచ్47ఎ. దీని పొడవు కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే. ఇది కేరళలోని ఎర్నాకులం నుండి కొచ్చి ఎయిర్ పోర్ట్ వరకు నిర్మించబడి ఉంది.

భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

దేశవ్యాప్తంగా అత్యంత పొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్7. కన్యాకుమారి నుండి వారణాసి మధ్య ఉన్న ఈ జాతీయ రహదారి పొడవు 2,369 కిలోమీటర్లుగా ఉంది.

భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

జాతీయ రహదారుల అభివృద్ది ప్రాజెక్టులో భాగంగా ఉన్న ఉత్తర-దక్షిమ-తూర్పు-పడమర కారిడార్ ద్వారా ఏకంగా 7,300 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని నిర్మించ తలపెట్టారు. అయితే మార్చి 31, 2015 నాటికి 6,375 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తి చేసారు.

భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

జాతీయ రహదారుల అభివృద్ది ప్రాజెక్ట్‌లో భాగంగా భారతదేశపు అతి పెద్ద నాలుగు మెట్రో నగరాల(ఢిల్లీ, ముంబాయ్, కలకత్తా మరియు చెన్నై)ను కలుపుతూ స్వర్ణ చతుర్భుజి అనే పేరుతో 5,846 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించారు. మరియు జాతీయ రహదారుల అభివృద్ది ప్రాజెక్ట్‌ క్రింద మార్చి 2015 నాటికి సుమారుగా 127 ప్రాజెక్టులను పూర్తి చేశారు.

భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

జాతీయ రహదారుల్లో మైలు రాయి అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. వివిధ రకాల రంగుల్లో ఉన్న మైలు రాయి రహదారి జాతీయ, రాష్ట్రీయ మరియు నగరానికి చెందిన రోడ్డుగా సూచిస్తుంది. తెలుపు మరియు పసుపు రంగుల్లో ఉన్న మైలురాయి జాతీయ రహదారులకు ప్రతీక.

భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

ఆకుపచ్చ మరియు తెలుపు మైలు రాయి మీద నల్లటి అక్షరాలు ఉంటే అది రాష్ట్ర రహదారికి చెందినది.

భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

తెల్లటి మైలు రాయి మీద నల్లటి అక్షరాలు ఉంటే అది నగర రహదారి అని సూచిస్తుంది.

భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

2010 లో భారత ప్రభుత్వం రహదారుల వ్యవస్థను నెంబరింగ్ పరంగా హేతుబద్దం చేయబడింది. దీని ప్రకారం ఉత్తరం నుండి దక్షిణ వైపుకు ఉన్న జాతీయ రహదారులను సరి సంఖ్యలతో గుర్తించడం మరియు తూర్పు నుండి పడమర వైపు ఉన్న జాతీయ రహదారులను బేసి సంఖ్యలతో గుర్తించాలని నిర్ణయం తీసుకుంది.

భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

జాతీయ రహదారులను సాంకేతిక పరంగా మూడు సంఖ్యా విధానాలతో విభజించారు. ఉదాహరణకు, 144 అనగా 44 వ జాతీయ రహదారిలో 144 అనునది సబ్ బ్రాంచ్ అన్నమాట.

అదే విధంగా వాటిని మళ్లీ సబ్-డివిజన్‌లుగా విభజిస్తూ 144ఎ, 244ఎ వంటి వాటిని కూడా ప్రవేశపెట్టారు.

భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

ఇప్పుడు దేశవ్యాప్తంగా సుమారుగా 30,000 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణ దశలో ఉంది.

భారత రహదారుల గురించి మీరెన్నడూ వినని విషయాలు

  • సముద్ర గర్భంలో కదిలే రహదారి సొరంగం
  • ఇండియాలో దాగున్న 25 సుందరమైన రోడ్లు
  • ఈ రోడ్ల మీద వెళితే నరకానికి లేదా స్వర్గానికి గ్యారంటీ

Most Read Articles

English summary
Read In Telugu: Interesting Facts Everyone Should Know About Indian Highways
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X