షిప్పింగ్ ఇండస్ట్రీ గురించి మీకు తెలియాల్సిన ఆసక్తికరమైన విషయాలు

By N Kumar

మానవ జీవితంలో మానవులు వినియోగించుకునే ప్రతి ఒక్క వస్తువు కూడా ఇండస్ట్రీతో ముడిపడి ఉంటాయి. ఇండస్ట్రీలు ఉత్పత్తి చేసే వస్తువులను ప్రపంచ దేశాలలోని ప్రజానీకానికి చేరువ చేయడానికి రవాణా ఎంతో కీలకం. ఖండాంతరాలను దాటి వస్తువులను చేరవేయడంలో వాయు మరియు నీటి రవాణాలు ఎంతో ముఖ్యమైనవి, వాయు రవాణా ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో సముద్రం మార్గం ద్వారా జరిగే జలరవాణా ఎంతో సరసమైనది.

జలరవాణాకు మూలం షిప్పింగ్ ఇండస్ట్రీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో ఇండస్ట్రీలకు మూలమైన షిప్పింగ్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

25. నెట్‌వర్క్‌‌కు దూరంగా

25. నెట్‌వర్క్‌‌కు దూరంగా

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షిప్ నౌకరులకు సముద్రం మధ్యలో ఉన్నపుడు ఎటువంటి సమాచారాన్ని అయినా తెలియజేయడానికి మంది వద్ద ఎటువంటి సాంకేతిక బంధాలు లేవు. మరియు ప్రతి 10 మందిలో ఒక్కరికి మాత్రమే ఇంటర్నెంట్ సదుపాయం కలదు.

24.సముద్ర దొంగలు

24.సముద్ర దొంగలు

2010 లో సోమాలిలో సముద్ర దొంగలు సుమారుగా 544 మంది నావికులను బంధీలుగా చేశారు. ప్రతి ఏడాది కూడా సుమారుగా 2,000 మంది నావికులు సముద్ర తలంలోనే మరణిస్తున్నారు. ప్రతి రోజు కనీసం రెండు నౌకలు వీరి వలన ప్రమాదానికి గురవుతున్నాయి. ప్రపంచ సముద్ర తలంలో సౌతాఫ్రికాలోనే ఎక్కువ దాడులు జరుగుతున్నాయి.

23. ఒక సుధీర్ఘమైన ప్రయాణం

23. ఒక సుధీర్ఘమైన ప్రయాణం

కంటైనర్లతో ప్రయాణించే నౌకలు సుమారుగా చంద్రుడు భూమికి మధ్య ఉన్న దూరంలో మూడవ వంతు సముద్రంలో ప్రయాణిస్తాయి. అన్ని సముద్రాలను చుట్టేసుకుని తిరిగి వాటి ప్రదేశాన్ని చేరుకోవడానికి ఏడాది సమయం పడుతుంది.

22. అత్యంత ఖరీదైన నౌకలు

22. అత్యంత ఖరీదైన నౌకలు

అత్యంత పొడవైన మరియు పెద్ద నౌకల నిర్మానికి సుమారుగా 200 మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ ఖర్చవుతుంది.

21. నావికుల వివరాల సంఖ్య

21. నావికుల వివరాల సంఖ్య

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నావికుల సంఖ్యలో మహిళా నావికులు కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నారు. ఫిలిప్పీన్స్‌‌కు చెందిన నావికులు ఈ షిప్పింగ్ విభాగంలో ఎక్కువగా ఉన్నారు. సుమారుగా మూడున్నర లక్షల వరకు నావికులు సముద్రంలో సేవలందిస్తున్నారు.

20. నౌక సామర్థ్యానికి సరిపోయే అరటి పండ్లు

20. నౌక సామర్థ్యానికి సరిపోయే అరటి పండ్లు

అతి పెద్ద నౌకలో సుమారుగా 745 మిలియన్ అరటి పండ్లను రవాణా చేయవచ్చు. వీటి కోసం సుమారుగా 15,000 కంటైనర్లు అవసరం ఉంటుంది. వీటినికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున ఇస్తే యూరప్ మరియు ఉత్తర అమెరికాలోని ప్రజలందరికీ పంచవచ్చు.

19. అతి పురాతణమైన పరిశ్రమ

19. అతి పురాతణమైన పరిశ్రమ

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో షిప్పింగ్ పరిశ్రమ ఎంతో పురాతణమైనది. అయితే ప్రస్తుత రోజుల్లో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

18. కొన్ని వేల సంస్థలు

18. కొన్ని వేల సంస్థలు

ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 55,000 షిప్పింగ్ సంస్థలు ప్రపంచం నలుమూలలకు కార్గో రవాణాను విస్తరిస్తున్నాయి.

17. నావికులు

17. నావికులు

షిప్పింగ్ ఇండస్ట్రీలో నావికులు ఎంతో ముఖ్యమైన వారు, నేడు ఉన్న షిప్పింగ్ ఇండస్ట్రీలో ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 1.5 మిలియన్ నావికులు ఉద్యోగులుగా ఉన్నారు.

16. ఉద్గార వాయువులు

16. ఉద్గార వాయువులు

2009లో ప్రపంచంలో ఉన్న 15 అతి పెద్ద నౌకలు విడుదల చేసిన ఉద్గారాలు 760 మిలియన్ కార్లు విడుదల చేసే ఉద్గారాలకు సమానం. అంటే అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరికి రెండు కార్లు చొప్పున పంచవచ్చు.

15. ఎకో ఫ్రెండ్లీ రవాణా రంగం

15. ఎకో ఫ్రెండ్లీ రవాణా రంగం

ప్రస్తుత ప్రపంచంలో ఉన్న ప్రయాణ సాధనాలలో విమానాలు మరియు వాహనాలతో పోల్చుకుంటే నౌకలు విడుదల చేసే ఉద్గారాలు కొంచెం తక్కువగానే ఉంటాయి.

14. అధిక ప్రభావమే

14. అధిక ప్రభావమే

ప్రపంచ వ్యాప్తంగా జనాభా పరంగా అధికంగా ఉన్న దేశాలతో పోల్చితే షిప్పింగ్ ఇండస్ట్రీ ఆరవ స్థానంలో ఉంది.

13. నిర్లక్ష్యపు తనిఖీలు

13. నిర్లక్ష్యపు తనిఖీలు

ప్రపంచ వ్యాప్తంగా దేశాలు మారుతున్న కంటైనర్లలో కేవలం రెండు నుండి పది శాతం వంతు కంటైనర్లు మాత్రమే తనిఖీలు నిర్వహించబడుతున్నాయి. అమెరకాలోని పోర్టులలో 17 మిలియన్ కంటైనర్లకు గాను 5 శాతం వరకు మాత్రమే అరకొర తనిఖీలు జరుగుతున్నాయి.

12. అధిక ఓడల సమూహం

12. అధిక ఓడల సమూహం

అత్యధిక బరువులను మోసుకెళ్లే నౌకల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశాలు ప్రపంచ వ్యాప్తంగా మూడు మాత్రమే ఉన్నాయి, అవి జర్మనీ, జపాన్ మరియు గ్రీస్‌లు ఉన్నాయి.

12. అధిక ఓడల సమూహం

12. అధిక ఓడల సమూహం

అత్యధిక బరువులను మోసుకెళ్లే నౌకల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశాలు ప్రపంచ వ్యాప్తంగా మూడు మాత్రమే ఉన్నాయి, అవి జర్మనీ, జపాన్ మరియు గ్రీస్‌లు ఉన్నాయి.

10. రెండు కోట్లు (20 మిలియన్)

10. రెండు కోట్లు (20 మిలియన్)

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 200 లక్షల కంటైనర్లకు పైగా దేశాలను మారుతున్నాయి.

09. అత్యంత శక్తివంతమైనవి

09. అత్యంత శక్తివంతమైనవి

కంటైనర్లను రవాణా చేసే అతి పెద్ద నౌకలోని ఇంజన్ విడుదల చేసే పవర్, సాధారణ కారు విడుదల చేసే పవర్‌ కన్నా 1,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

08. సగటు రవాణా ధర

08. సగటు రవాణా ధర

షిప్పింగ్ ద్వారా రవాణా కోసం అయ్యే ఖర్చు గురించి ఒక ఉదాహరణగా సైకిల్‌ను షిప్పింగ్ చేయాలంటే సుమారుగా 10 డాలర్లు మరియు ఒక కోక్ బాటిలో డాలర్‌ కన్నా తక్కువగా ఉంటుంది.

07.భారీ ఆదాయం

07.భారీ ఆదాయం

ఆర్థిక పరంగా చూస్తే షిప్పింగ్ ఇండస్ట్రీ ఎంతో అత్భుతం, ఇంగ్లాడ్ దేశం గురించి పరిశీలిస్తే దీని జిడిపి రెస్టారెంట్లు, ఆహార పరిశ్రమలు మరియు సివిల్ ఇంజనీరింగ్‌‌ల సంపాదనకు సమానంనంగా ఉంటుంది.

06. 90 శాతం

06. 90 శాతం

షిప్పింగ్ ఇండస్ట్రీలో ఉన్న మరో పెద్ద నిజం, ప్రపంచ ట్రేడింగ్‌లో 90 శాతం షిప్పింగ్ పరిశ్రమదే ఉంది.

05.ఎన్నో కంటైనర్లు

05.ఎన్నో కంటైనర్లు

ఒక్క నౌకలో ఉన్న కంటైనర్లను ఒకదానివెనుక ఒకటి పొడవుగా పెడితే భూమిని సగభాగం చుట్టేయచ్చు. ఒక దాని మీద ఒకటి పెడితే 7,500 ఈఫిల్ టవర్ల ఎత్తుకు సమానం మరియు కంటైనర్లలో ఉన్న లోడు‌ను లారీలకు నింపితే వాటి వలన కలిగే ట్రాఫిక్ 60 మైళ్ల వరకు ఉంటుంది.

04. భద్రత ఆధారంతో ఉన్న పరిశ్రమ

04. భద్రత ఆధారంతో ఉన్న పరిశ్రమ

ప్రపంచ వ్యాప్తంగా భద్రత ప్రమాణాలాను విస్తృతంగా అనుసరించే వాటిలో షిప్పింగ్ ఇండస్ట్రీ మొదటి స్థానంలో ఉంది.

03. ఇది ఎంతో అవసరం

03. ఇది ఎంతో అవసరం

2011 లో అమెరికాలోని సుమారుగా 360 కమర్షియల్ పోర్ట్‌ల ద్వారా దిగుమతైన గూడ్స్‌ ద్వారా 1.73 ట్రిలియన్ డాలర్లను ఆర్జించింది. దీని ద్వారా అధిక ఆదాయం ఉన్నట్లు అప్పుడే అమెరికాకు తెలిసొచ్చింది.

02. వ్యాపార నౌకల రకాలు

02. వ్యాపార నౌకల రకాలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నౌకలలో సుమారు ఆరు రకాలు ఉన్నాయి. అవి జనరల్ కార్గో షిప్స్, బల్క్ క్యారీయర్స్, ఫిషింగ్ వెస్సెల్స్, కంటైనర్ షిప్స్, ప్యాసింజర్ షిప్స్ మరియు ట్యాంకర్లు

01.సరసమైన ఎముకల రహిత చేప మాంసం

01.సరసమైన ఎముకల రహిత చేప మాంసం

ప్రపంచ వ్యాప్తంగా షిప్పింగ్ అనే ఎంతో సరసమైనది, అందులో సముద్ర ఆహారం మరింత సరసమైనది. స్కాంట్లాండ్ వాసులు ఎక్కువగా ఎముకల రహిత చేప మాంసాన్ని సేకరిస్తారు. ఇది ఎంతో చౌకైనది కూడా.

షిప్పింగ్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలు

క్రూయిజ్ నౌకల ప్రయాణం వెనుకున్న 10 చీకటి రహస్యాలు

సముద్రంలో ఉన్న భయంకరమైన దెయ్యం నౌకలు... !!

Most Read Articles

Read more on: #నౌకలు #ships
English summary
Amazing Facts About Shipping Industry
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X