అధికారుల కాన్వాయ్‌కి ఎదురెళితే ఇలాగే ఉంటది.. మీరూ చూడండి

'1948 సెప్టెంబర్ 17' ఈ రోజు తెలంగాణ చరిత్రలోనే మరచిపోలేని రోజు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా రాచరికపు కోరల్లో నలిగిపోయిన ప్రజలకు విముక్తి ఏర్పడిన ఆ రోజు ఈ రోజే కాబట్టి. ఆ రోజు హైదరాబాద్ నగరం ఇండియన్ యూనియన్‌లో భాగమైపోయింది.

Recommended Video

Maruti Grand Vitara బుకింగ్స్ | వివరాలు

దీనిని దృష్టిలో ఉచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 'హైదరాబాద్ విమోచన దినోత్సవ' అమృత మహోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిధిగా కేంద్ర హోంమంత్రి 'అమిత్ షా' పాల్గొనబోతున్నారు. అయితే ఆ సమయంలో అమిత్ షా కాన్వాయ్ ముందు టిఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) నేత కారు ఆగిపోయింది. ఇది 'అమిత్ షా' భద్రతకు భంగం కలిగించింది.

అమిత్ షా కాన్వాయ్‌కి ఎదురెళ్ళిన కారు ఇలా అయిపోయిందో.. కారణం ఇదే

అమిత్ షా కాన్వాయ్ కి ఆ కారు హరిత ప్లాజా ఎంట్రీ పాయింట్ వద్ద అడ్డు రావడంతో భద్రతా సిబ్బంది దానిని వెనుకకు తీయమని చెప్పారు. అయితే ఆ సమయంలోనే భద్రతా సిబ్బంది ఆ వ్యక్తి కారు యొక్క వెనక అద్దం పగలగొట్టారు. ఈ ఘటన వల్ల అమిత్ షా కారు దాదాపు అక్కడే 5 నిముషాలు ఆగిపోయింది.

అమిత్ షా కాన్వాయ్‌కి ఎదురెళ్ళిన కారు ఇలా అయిపోయిందో.. కారణం ఇదే

కారు కేద్ర మంత్రి కాన్వాయ్ ముందు ఎందుకు ఆగిపోయింది అని డ్రైవర్ ని ప్రశించినప్పుడు, ఎక్కువ టెన్షన్‌లో అలా జరిగిపోయిందని చెప్పాడు. దీనికే భద్రతా సిబ్బంది కారు వెనుక అద్దం పగులగొట్టేసారు అని చెప్పాడు.

అమిత్ షా కాన్వాయ్‌కి ఎదురెళ్ళిన కారు ఇలా అయిపోయిందో.. కారణం ఇదే

ఈ సంఘటన జరిగిన సమయంలో వెంటనే స్పెషల్ బ్రాంచ్ అధికారులు స్పాట్‌కు చేరుకున్నారు. కాన్వాయ్‌కి అడ్డుగా వచ్చిన కారు వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర హోమంత్రి పర్యటనలో అతని కాన్వాయ్‌కి కారు అడ్డుగా రావడం వల్ల స్థానిక ట్రాఫిక్ పోలీసులపై స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమిత్ షా కాన్వాయ్‌కి ఎదురెళ్ళిన కారు ఇలా అయిపోయిందో.. కారణం ఇదే

కేంద్ర హోంమంత్రి కాన్వాయ్ కి ఆ కారు ఎందుకు అడ్డుగా వచ్చింది, ఆ కారులో ఉన్న వ్యక్తి ఎవరు, అతడు కావాలని ఏమైనా కారుని ఆపాడా, అనే ప్రశ్నలకు సమాధానాలను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి పోలీసులు అధీనంలో ఉన్నట్లు కూడా తెలిసింది.

అమిత్ షా కాన్వాయ్‌కి ఎదురెళ్ళిన కారు ఇలా అయిపోయిందో.. కారణం ఇదే

మొత్తానికి ఆ కారు ఆపిన వ్యక్తి పేరు గోసుల శ్రీనివాస్ యాదవ్‌ అని, అతడు టీఆర్‌ఎస్ నేత అని తెలిసింది. ఇతనిని పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అమిత్ షా కాన్వాయ్‌కి ఎదురెళ్ళిన కారు ఇలా అయిపోయిందో.. కారణం ఇదే

ఈ సంఘటలో దెబ్బతిన్న కారు 'మారుతి సుజుకి' (Maruti Suzuki) యొక్క 'బ్రెజ్జా' (Brezza) అని తెలుస్తుంది. అంతే కాకూండా ఇది ఈ మధ్య కాలంలోనే కొనుగోలు చేసినట్లు కూడా స్పష్టంగా తెలుస్తోంది. కావున దీనికి ఇంకా నెంబర్ ప్లేట్ కూడా వేయలేదు.

అమిత్ షా కాన్వాయ్‌కి ఎదురెళ్ళిన కారు ఇలా అయిపోయిందో.. కారణం ఇదే

సాధారణంగా కేంద్ర మంత్రులు మొదలైన ఉన్నతాధికారులకు ఎక్కువ భద్రత కల్పించబడుతుంది. ఇందులో భాగంగానే వారి పర్యటన ప్రారంభమయ్యేటప్పటి నుంచి ముగిసేదాకా కూడా సాధారణ ప్రజలను వారి కాన్వాయ్ కి అడ్డు రాకుండా పోలీసులు పటిష్టమైన భద్రతలను ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో ప్రజలు వారి పర్యటను ఏ మాత్రం ఆటంకం కలిగించకూడదు.

అమిత్ షా కాన్వాయ్‌కి ఎదురెళ్ళిన కారు ఇలా అయిపోయిందో.. కారణం ఇదే

సెప్టెంబర్ 17 న మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలు కూడా అధికారికంగా మరాఠావాడా ముక్తి సంగ్రామ్ దివస్ మరియు కర్ణాటక విమోచన దినోత్సవం జరుపుకుంటాయి. అయితే ప్రస్తుతం ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు చాలా వేడుకగా జరుగుతున్నాయి.

Most Read Articles

English summary
Amit shah security destroyed the windows of the trs leader s car details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X