Just In
- 29 min ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 1 hr ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
- 16 hrs ago
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- 16 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు
Don't Miss
- News
చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో .. ఒక 420 వ్యవహారం : సజ్జల ఫైర్
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Movies
Naandhi 8 Days Collections: ఒక్కసారిగా పుంజుకున్న నాంది.. నరేష్ మూవీకి ఎంత లాభం వచ్చిందంటే!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Sports
India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆనంద్ మహీంద్రా లైఫ్ లో ఉన్న ఎస్‌యూవీ కార్లు ఇవే
ఆటోమొబైల్, పారిశ్రామికవేత్తల ప్రపంచంలో బాగా పేరున్న ఆనంద్ మహీంద్రా. మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత, సోషల్ మీడియా లపై, ముఖ్యంగా ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటూ వివిధ ఈవెంట్స్, వైరల్ వీడియోలపై కామెంట్ చేస్తూ ఉంటాడు.

భారతదేశంలో అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు, అయితే కార్ల విషయానికి వస్తే, అతను ఎక్కువగా లగ్జరీ ఇష్టపడరేమో అయితే ఇక్కడ ఆయన స్వంతం చేసుకున్న కార్లన్నీ ఆశ్చర్యకరంగా మహీంద్రా తయారు చేసినవే, మరి వాటి గురించి వివరంగా తెలుసుకొందాం రండి..

మహీంద్రా బొలేరో ఇన్వాడెర్
బొలేరో ఇన్వాడెర్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన బొలేరో ఆధారంగా ఉన్న ఒక ఎస్‌యూవీ. ఇది షార్ట్-వీల్ బేస్, 3-డోరు వెర్షన్, ఇది ఎంయూవి యొక్క స్పోర్టివ్ ఆధారంగా ప్రారంభించబడింది.

ఆనంద్ మహీంద్రా తన చిన్న వయస్సు లోనే ఒక బొలేరో ఇన్వాడెర్ స్వంతం చేసుకున్నాడు మరియు ఈ కారు లైఫ్ స్టైల్ ఎస్‌యూవీ కొనుగోలుదారులను ఉద్దేశించబడింది కనుక, ఇది సాఫ్ట్ రూఫ్ తో వచ్చింది.

అలాగే, వాహనం వెనుక సీట్లు కూడా సైడ్ ఫేసింగ్, ట్రెండ్ లో ఉన్నాయి. బొలేరో ఇన్వాడెర్ సుమారు 63 బిహెచ్పి ఉత్పత్తి చేసే 2.5-లీటర్ డీజల్ ఇంజన్ కలిగి ఉంది. ఈ కారు ఇప్పుడు రోడ్లపై అరుదైన కనిపిస్తుంది.

మహీంద్రా టియూవి300
ఆనంద్ మహీంద్రా తన వ్యక్తిగత ఉపయోగానికి 2015 లో తన గ్యారేజీకి కస్టమైజ్ చేయబడ్డ టియూవి300 ను సొంతం చేసుకొన్నాడు. ఇందులో ఉన్న బాక్సీ డిజైన్ కారణంగా టియూవి300 చాలా సాలిడ్ గా కనిపిస్తుంది.

ఆనంద్ మహీంద్రా సొంతం చేసుకున్న ఈ వెర్షన్ లో వీల్ ఆర్చర్ వంటి భాగాలను జోడించే అధికారిక ' ఆర్మీ ' యాక్సెసరీ ప్యాక్, బోనెట్ పై ఉండే హుల్, రూఫ్ మౌంటెడ్ యాక్సిలరీ ల్యాంప్ లు, బ్లాక్ కలర్ లో చుట్టూ మరియు సైడ్ స్టెప్స్ తో ప్లాస్టిక్ క్లాడింగ్ జోడించబడింది. దీనిపై ఉన్న వార్ గ్రీన్ కలర్ వలన వాహనం ఒక యుద్ధ వాహనం వలె కనిపించేలా చేస్తుంది.
Most Read: హ్యాపీ బర్త్ డే సైరా! చిరంజీవి కార్లు, కొన్ని ఆసక్తికరమైన నిజాలు!

మహీంద్రా టియూవి300 ప్లస్
ఆనంద్ మహీంద్రా కూడా ఓ కొత్త టియూవి300 తెచ్చుకుని ట్విట్టర్ లో ప్రకటించారు. అతను ఆ వాహనానికి "గ్రే ఘోస్ట్" అని పేరు పెట్టాడు మరియు అతను ఆ కారును సొంతం చేసుకోవడానికి చాలా కాలం వేచి ఉన్నట్లు చెప్పాడు. ఆనంద్ మహీంద్రాకు చెందిన టియూవి300 ప్లస్ ప్రత్యేక స్టీల్-గ్రే కలర్ ను కలిగి ఉంది.
Most Read: ' డ్రైవర్ లెస్ ' కారు లో క్రికెట్ గాడ్

మహీంద్రా స్కార్పియో
ఆనంద్ మహీంద్రా కూడా చాలా కాలం పాటు ఇండియన్ స్కార్పియోను ఉపయోగించారు. మహీంద్రా స్కార్పియో దాని దృఢమైన శరీరం మరియు సామర్థ్యంగల 4X4 వ్యవస్థకు పెట్టింది పేరు.
Most Read: హైదరాబాద్ రోడ్లపై వర్మ ట్రాఫిక్ సినిమా

ఇది సరసమైన ధర ట్యాగ్ మరియు అద్భుతమైన సామర్ధ్యాల కారణంగా ఆఫ్-రోడ్ వినియోగదారులకు అత్యంత ప్రాధాన్య వాహనాల్లో ఒకటిగా ఉంది. ఆనంద్ మహీంద్రా పాత వెర్షన్ స్కార్పియో ను కలిగి ఉన్నాడు.

మహీంద్రా ఆల్టురాస్ జి4
మహీంద్రా ఇటీవల ఆల్టురాస్ జి4 డెలివరీ వచ్చింది. ఈ ప్రీమియమ్ ఆల్టురాస్ జి4 అనేది మహీంద్రా బ్రాండ్ నుండి అత్యంత ఖరీదైన వాహనం.

ఆల్టురాస్ జి4 డెలివరీ పొందిన తర్వాత ఆనంద్ మహీంద్రా తన కొత్త కారుకు పేరు పెట్టడానికి సహాయం కోసం ట్విట్టర్ ను కోరాడు. పేరు సూచన పోటీలో విజేత కోసం ఒక నమూనాను కూడా ప్రకటించాడు. అతను తరువాత ఆల్టురాస్ జి4 ను ' బాజ్ ' గా పేరు పెట్టాడు, అంటే డేగ అని అర్థం.
Source: Cartoq