అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మా ఆప్సన్ 'మహీంద్రా': దీనిపై 'ఆనంద్ మహీంద్రా' రెస్పాన్స్ ఇలా..

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పారిశ్రామికవేత్త 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల ఒక పోస్ట్ కి ట్విట్టర్ వేదికగా రీప్లే ఇచ్చాడు. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.

ఒక ట్విట్టర్ యూజర్ రెండు మహీంద్రా బ్రాండ్ కార్ల ఫోటోలను షేర్ చేసాడు. ఇందులో పాత మహీంద్రా జీప్, కొత్త మహీంద్రా XUV700 ఉండటం చూడవచ్చు. దీనిపైన ఆనంద్ మహీంద్రా ఎలాంటి రీప్లే ఇచ్చాడో ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ఫోటోపై ఆనంద్ మహీంద్రా రెస్పాన్స్ ఇలా..

ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఫోటొపైన స్పందిస్తూ.. 'ఇలాంటి మెసేజ్‌లు నిజంగానీ చాలా గొప్ప అనుభూతిని తీసుకువస్తాయి. తరతరాలుగా ప్రజలు తమ బ్రాండ్ మీద అపారమైన నమ్మకం చూపిస్తున్నందుకు మేము మరింత బాధ్యతను కలిగి ఉంటాము' అన్నారు.

ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఫొటోలో 39 సంవత్సరాల క్రితం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న మహీంద్రా జీప్ ఉంది. నిజానికి మహీంద్రా జీప్ అనేది 1945 నుంచి దాదాపు యాభై సంవత్సరాలకు పైగా భారదేశంలో ఎంతో మంది ప్రజలను ఆకర్శించగలిగింది. అయితే మహీంద్రా కంపెనీ మొదటిసారిగా అమెరికన్ SUV తయారుదారు నుంచి 'విల్లీస్ జీప్' లను అసెంబుల్ చేయడం ప్రారంభించింది.

ఫోటోపై ఆనంద్ మహీంద్రా రెస్పాన్స్ ఇలా..

ఆ సమయంలో సాధారణ ప్రజల దగ్గర నుంచి సైనిక మరియు పారామిలిటరీ దళాల వరకు చాలామంది ఈ వాహనాలను వినియోగించేవారు. ఈ వాహనాలు కఠినమైన రహదారుల్లో సైతం అవలీలగా ముందువెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ కారణంగా అప్పటి నుంచి కూడా భారతదేశంలో ఎనలేని ప్రజాదరణ పొందుతోంది. ఇప్పటికి కూడా జీప్ ప్రేముకులు విరివిగానే ఉన్నారు.

ప్రస్తుతం మహీంద్రా టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందింది. కావున స్వదేశంలోనే కార్లను డిజైన్ చేయడం మరియు మాన్యుఫాక్చరింగ్ చేయడం వంటివి చేస్తోంది. ఇందులో భాగంగానే మహీంద్రా కంపెనీ XUV700 విడుదల చేసింది. ఈ SUV ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతూ ముందుకు సాగుతోంది. ఇప్పటికి కూడా ఈ SUV యొక్క వెయిటింగ్ పీరియడ్ సుమారు 2 సంవత్సరాల వరకు ఉంది.

ఎక్స్‌యూవీ700 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 197 బిహెచ్‌పి శక్తిని మరియు 380 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, దీని 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ రెండు ట్యూన్లలో లభిస్తుంది. మొదటిది 182 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 450 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, 'MX' వేరియంట్‌లో ఉపయోగించిన ఇదే డీజిల్ ఇంజన్ 153 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 360 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా కంపెనీ యొక్క ఈ XUV700 లో అధునాతన ADAS ఫీచర్ కూడా ఉంది. అంతే కాకుండా ఇది సేఫ్టీ పరంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుని అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. ఇందులో మంచి లేటెస్ట్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

ఇక మహీంద్రా కంపెనీ చరిత్ర విషయానికి వస్తే, ఇది భారతదేశంలో 1945 నుంచి ఉంది. అంటే భారతదేశానికి స్వాతంత్య్రం రాకముంచు నుంచి ఈ సంస్థ దేశీయ విఫణిలో ఉంది. ఈ కంపెనీ మొదట్లో 'మహమ్మద్ అండ్ మహీంద్రా' అనే పేరుతో స్థాపించడం జరిగింది. అయితే ఇందులో ఉన్న భాగస్వాములలో ఒకరు పాకిస్తాన్ వెళ్ళిపోయిన కారణంగా కంపెనీ పేరు 'మహీంద్రా అండ్ మహీంద్రా' గా స్థిరపడింది. అదే ఇప్పటికి కూడా కొనసాగుతోంది.

కంపెనీ ప్రారంభమైన మొదటి రోజుల్లోనే కంపెనీ 'మహీంద్రా విల్లీస్ జీప్' లను దిగుమతి చేసుకొని అసెంబుల్ చేసేది. ఆ తరువాత కాలక్రంలో టెక్నాలజీ మరియు ఇతరత్రా సౌకర్యాలు పెరగటంతో కొత్త వాహనాలు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాల్లో 2,50,000 కి పైగా ఉద్యోగులు మహీంద్రా గ్రూప్ కంపెనీలు పనిచేస్తున్నారు. ఆదాయం కూడా ప్రస్తుతం బిలియన్ డాలర్లలో ఉంది.

Most Read Articles

English summary
Anand mahindra replies to twitter photo details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X