YouTube

వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా కొత్త పోస్ట్.. 'మదర్ ఆఫ్ ఇన్వెన్షన్' అంటూ పొగడ్తలు

మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు అనే సంగతి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను పోస్ట్ చేస్తూ ఉంటారు, ఇటీవల ఇలాంటి మరో పోస్ట్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్‌లో ఒకేసారి ఆరు మంది వ్యక్తులు వెళ్ళడానికి అనుకూలంగా ఉండే ఒక టూ వీలర్ చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులోనూ ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ వాహన తయారీకి రూ.12,000 ఖర్చు అయినట్లు సమాచారం. అంతే కాకుండా ఇది ఒక ఛార్జ్ తో ఏకంగా 150కిమీ ప్రయాణిస్తుందని తెలిసింది.

మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటూ పొగిడేసిన ఆనంద్ మహీంద్రా..

ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ ఛార్జ్ చేసుకోవడానికి కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఇది ఒక సారి ఛార్జ్ చేసుకోవడానికి కేవలం 10 రూపాయలు ఖర్చు మాత్రమే అవుతుంది. ఇది చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తుంది. కానీ ఈ ఆధునిక ప్రపంచంలో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. పల్లెల్లో మాత్రమే ఇలాంటి కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. అవి నన్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని ఆనంద్ మహీంద్రా అన్నారు.

ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ గ్రామీణ ప్రాంతంలో పుట్టినందుకు గ్రామాలను 'మదర్ ఆఫ్ ఇన్వెన్షన్' ఆనంద్ మహీంద్రా అని అన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది. సైకిల్ మాదిరిగా కనిపించే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఆరు సీట్లను కలిగి ఉంది. కావున ఒకేసారి ఈ వెహికల్ సాయంతో ఆరు మంది ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పారిశ్రామిక, జూ, రద్దీ ప్రదేశాలలో డ్రైవింగ్ చేయడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

పట్టణ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా గ్రామీణా ప్రాంతాల్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ కాబట్టి డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పాఠశాల విద్యార్థులు దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లేందుకు ఈ వెహికల్ చాలా ఉపయోగపడుతుంది. మొత్తం మీద ఇది అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పురుడుపోసుకునే ఇలాంటి ఆవిష్కరణలకు అందరూ తప్పకుండా మరింత ప్రోత్సాహం అందించాలి.

ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ కి ఇప్పటి వరకు 30 వేలకు పైగా లైకులు, కొన్ని వేల రీ ట్వీట్లు వచ్చాయి. నిజానికి దేశీయ మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా డిమాండ్ భారీగా పెరుగుతోంది. అయితే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్స్ కావాల్సిన సంఖ్యలో అందుబాటులో లేదు, ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనా వినియోగానికి కొంత అంతరాయం కలిగిస్తున్నాయి. కావున ఛార్జింగ్ స్టేషన్లు విరివిగా ఏర్పాటు చేయాలి.

ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి అనుకూలంగా ఉండటమే కాకుండా, కొనుగోలుదారులకు డబ్బును కూడా ఆదా చేస్తాయి. పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చు తక్కువగానే ఉంటుంది. అయితే ఎక్కువ సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నప్పుడే మరిన్ని ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గానీ, వినియోగం గానీ జరుగుతుంది. రానున్న రోజుల్లో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే వినియోగంలో ఉంటాయని చాలా నివేదికలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా ఇటీవల ఆనంద్ మహీంద్రా కొత్త స్కార్పియో-ఎన్ కారు కొనుగోలు చేసాడు. దీనికి మంచి పేరు పెట్టాలని నెటిజన్లను కోరాడు. దీనికి చాలామంది చెప్పిన పేర్లలో 'భీమ్ మరియు బిచ్చు' అనే పేర్లను సెలక్ట్ చేశారు. అయితే చివరికి ఈ రెండు పేర్లలో 'భీమ్' పేరు బాగుంటుందని భీమ్ అనే పేరునే చివరికి తన కారుకి పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Anand mahindra shares six seater electric bike details
Story first published: Saturday, December 3, 2022, 11:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X