చంద్రబాబునాయుడు బుల్లెట్ ఫ్రూఫ్ బస్సు, కాన్వాయ్ మరియు రాజకీయ నేపథ్యం

Written By:

ఆంధ్ర ప్రదేశ్ అచ్చమైన తెలుగు తనానికి పుట్టినిల్లు మూడేళ్ల క్రితం 23 జిల్లాతో అలరాడిన తెలుగు దేశం, అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అప్పటి తెలుగు రాష్ట్రం నేడు రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయింది. అయితే రెండు రాష్ట్రాలు కూడా శక్తివంతమైన ముఖ్యమంత్రులను కలిగి ఉన్నాయి.

సుమారుగా ఆరు కోట్లు పైచిలుకు ప్రజలున్న ఆంధ్రప్రదేశ్‌ మొదటి ముఖ్య మంత్రిగా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఎన్నికయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ సిఎం పుట్టిన రోజు (ఏప్రిల్ 20 ) సందర్భంగా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రత్యేక కథనం: చంద్రన్న రాజకీయ నేపథ్యం, అధునాతన బుల్లెట్ ఫ్రూఫ్ బస్సు మరియు ప్రత్యేక కాన్వాయ్ గురించి క్రింది కథనంలో తెలుసుకోగలరు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
కుటుంబ నేపథ్యం

కుటుంబ నేపథ్యం

నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని నారి వారిపల్లిలో సాధారణ మధ్య తరగతి వ్యవసాయాధారిత కుటుంబంలో 1950 ఏప్రిల్ 20 న నారా ఖర్జూర నాయుడు మరియు అమ్మనమ్మ దంపతులకు జన్మించాడు.

విద్యాభ్యాసం

విద్యాభ్యాసం

బాల్యం చదవులు చంద్రగిరిలో మరియు తిరుపతిలోని శ్రీ వెంటటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుండి అర్థ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.

రాజకీయ నేపథ్యం

రాజకీయ నేపథ్యం

ప్రారంభంలో చంద్రగిరి నుండి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విధ్యార్థి నాయకుడి ఎంపికయ్యారు. 20 శాతం స్టూడెంట్ కోటా ద్వారా 1978 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టి తరపున ఎమ్‌ఎల్ఎ గా ఎన్నికయ్యారు.

 ఎమ్‍‌‌ఎల్‌ఎ నుండి మంత్రిగా

ఎమ్‍‌‌ఎల్‌ఎ నుండి మంత్రిగా

అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి టి.అంజయ్య మంత్రి వర్గంలో కేవలం 28 సంవత్సరాల వయస్సులో విద్యా మరియు సినిమాటోగ్రఫి మంత్రిగా చోటు సాధించాడు. కాంగ్రెస్ పార్టి చరిత్రలో అతి తక్కువ వయస్సులో మంత్రి పదవి పొందిన నాయకుడు కూడా ఇతనే.

తెలుగు దేశం పార్టిలోకి చేరిక

తెలుగు దేశం పార్టిలోకి చేరిక

అప్పట్లో సినిమాటోగ్రఫి మంత్రిగా ఉన్న తరుణంలో తెలుగు ఇండస్ట్రీస్‌లో గొప్ప నటుడిగా ఉన్న నందమూరి తారక రామారావు పరిచయంతో ఎన్‌టిఆర్ గారి మూడవ కుమార్తె భూవనేశ్వరిని వివాహమాడారు. ఆ తరువాత ఎన్‌టిఆర్‌ గారు 1982 లో తెలుగు దేశం పార్టీని స్థాపించారు. 1989 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు టిడిపి పార్టి తీర్థం పుచ్చుకుని కుప్పం నియోజక వర్గం నుండి 5,000 ఓట్ల ఆధిక్యంతో ఎమ్‌ఎల్‌ఎగా ఎన్నికయ్యారు.

ముఖ్యమంత్రిగా

ముఖ్యమంత్రిగా

1995 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్య మంత్రిగా సేవలందించారు. తరువాత పది సంవత్సరాల వరకు ప్రతి పక్షంలో కొనసాగారు.

నూతన రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా

నూతన రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా

2014లో తెలంగాణ ప్రాంత వియోగంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 స్థానాలలో 102 స్థానాల నుండి గెలుపొంది, నూతన రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

కాన్వాయ్

కాన్వాయ్

నూతన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రభుత్వం అందించిన కాన్వాయ్‌ని బ్రాండ్‌కు మారు పేరు అయిన ప్రాడో మరియు టయెటా ఫార్చ్యూనర్ వాహనాలతో మార్చుకున్నాడు.

భద్రత పరీక్షలు

భద్రత పరీక్షలు

అప్పట్లో వీటిని భద్రత పరీక్షల కోసం పూనేలోని సెక్యురిటీ ఎంజెన్సీల ద్వారా పరీక్షించారు.

ఎనిమిది వాహనాలలో

ఎనిమిది వాహనాలలో

ఆరు ఫార్చ్యూనర్ మరియు రెండు ప్రాడో వాహనాలను చంద్రబాబునాయుడు కాన్వాయ్‌గా ఉన్నాయి.

విలువ

విలువ

వీటి మొత్తం విలువ సుమారుగా రూ. 5.7 కోట్లుగా ఉంది.

తరుచూ రిపేరీలు

తరుచూ రిపేరీలు

ముందున్న సఫారీ వాహనాలు తరచూ రిపేరీకి గురయ్యేవని తద్వారా వాటిని ఈ వాహనాలతో మార్పిడి చేశారు.

ఏపి సిఎం కు పుట్టిన రోజు శుభాకాంక్షలతో: చంద్రబాబు నాయుడు వాహన ప్రపంచం

తరచూ తిరుపతి మరియు విజయవాడలలో సందర్శిస్తుండటం వలన ఇలాంటి వాహనాలను తిరుపతి మరియు విజయవాడలలో కూడా అందుబాటులో ఉంచారు.

బుల్లెట్ ఫ్రూఫ్ బస్సు

బుల్లెట్ ఫ్రూఫ్ బస్సు

నూతన రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా ఎంపికైన తరువాత జిల్లాలో పర్యటించడానికి బుల్లెట్ ఫ్రూప్ బస్సును కొనుగోలు చేశారు.

 మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్

ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ నుండి ఈ బస్సుకు చెందిన ఛాసిస్ మరియు ఇంజన్‌లను కోనుగోలు చేశారు. తరువాత దీనిని ఛండీఘర్ ఆధారిత బస్సు బాడీ తయారీ సంస్థ జెసిబిఎల్ దీనిని పూర్తిగా తయారు చేసింది.

ప్రత్యేక సొగసులు

ప్రత్యేక సొగసులు

మెటాలిక్ గ్రే రంగుల్లో ఉన్న ఈ బస్సు బాడీని వివిధ రకాల టిడిపి పార్టి లోగోలతో మరియు ప్రభుత్వం అందిస్తున్న ప్రగతి పథకాలను దీని మీద పొందుపరిచారు

ఫీచర్లు

ఫీచర్లు

ఇందులో శాటింలైట్ ఫోన్, సోఫా- బెడ్, అధికారులతో భేటి కోసం ప్రత్యేక గది, టాయిలెట్, పైనున్న రూఫ్ టాప్ ద్వారా స్పీచ్ ఇవ్వగలిగే సదుపాయం,

ఇంజన్

ఇంజన్

ఇందులో మెర్సిడెస్ బెంజ్ వారు గరిష్టంగా 390 బిహెచ్‌పి పవర్ ఇవ్వగల ఇంజన్‌ను అందించారు.

బుల్లెట్ ఫ్రూఫ్

బుల్లెట్ ఫ్రూఫ్

బుల్లెట్ మరియు ఇతర దాడులను తట్టుకునే విధంగా ఈ బస్సు బాడీని బుల్లెట్ ఫ్రూఫ్ పదార్థాలతో రూపొందించారు.

కెమెరా కనుసన్నల్లో

కెమెరా కనుసన్నల్లో

ఇందులో నలువైపుల కూడా కెమెరాలను ఏర్పాటు చేశారు, భద్రత సిబ్బంది బస్సులోని ఒక భాగం నుండి పర్యవేక్షిస్తుంటారు.

ధర

ధర

ఈ బుల్లెట్ ఫ్రూఫ్ బస్సు ధర సుమారుగా రూ. 5.60 కోట్లుగా ఉంది.

English summary
Ap Cm Chandra Babu Naidu Convoy And Bullet Proof Bus
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark