ఆటోమొబైల్ రంగం వైపు దూసుకొస్తున్న ఆపిల్

By Anil

అమెరికా సాంకేతిక దిగ్గజం ఆపిల్ ఇప్పుడు ఆటోమొబైల్ రంగం మీదకు తన దారిని మళ్లిస్తోంది. సాంకేతిక రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థల కంటే ముందున్న ఆపిల్, ఇప్పుడు తమ పరిజ్ఞానాన్ని ఎలక్ట్రిక్ కార్లను రూపొందించడం మీద వినియోగిస్తోంది. అయితే ఆపిల్ ఓ ప్రకటనలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నట్లు తెలిపింది. దీనికి ప్రాజెక్ట్ టైటాన్ అనే పేరును కూడా ఖరారు చేసింది. ప్రాజెక్ట్ టైటాన్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే...

ఆపిల్ ఎలక్ట్రిక్ కార్

దక్షిణ కొరియాకు చెందిన కొన్ని బ్యాటరీ ఆభివృద్ది సంస్థలతో చేతులు కలిపి హ్యాలో బ్యాటరీలను అభివృద్ది చేయడానికి రహస్యంగా ఒప్పందాలు చేసుకున్నట్లు నివేదికలు చెపుతున్నాయి.

ఆపిల్ ఎలక్ట్రిక్ కార్

సుమారుగా 20 వరకు సంస్థలతో తమ భవిష్యత్ ఎలక్ట్రిక్ కారుకు సంభందించిన అభివృద్ది కోసం రహస్య ఒప్పందాలను చేసుకుంది.

ఆపిల్ ఎలక్ట్రిక్ కార్

ఎలక్ట్రిక్ కార్లలో హ్యాలో బ్యాటరీలను వినియోగించడం ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు. ఇలాంటి దానికి ఆపిల్ సంస్థ శ్రీకారం చుట్టింది.

ఆపిల్ ఎలక్ట్రిక్ కార్

ఎలక్ట్రిక్ కార్లలో వినియోగించే సాధారణ బ్యాటరీలలో ఎక్కువ రసాయనిక చర్యలు జరిగి అధిక వేడి వెలువడుతుంది.

ఆపిల్ ఎలక్ట్రిక్ కార్

ఇటిఆటోన్యూస్ వారి కథనం ప్రకారం అచ్చం ఇలాంటి సాంకేతికతకు చెందిన హ్యాలో బ్యాటరీల మీద దక్షిణ కొరియాకు చెందిన సంస్థ ఒకటి పేటెంట్ హక్కులను పొందినట్లు తెలిపింది.

ఆపిల్ ఎలక్ట్రిక్ కార్

హ్యాలో బ్యాటరీల బాహ్య భాగంలో చల్లటి గాలిని ప్రసరింపజేసి. బ్యాటరీలలో ఉత్పత్తి అవుతున్న అధిక వేడిని తగ్గించచ్చు. అంతే కాకుండా హ్యాలో బ్యాటరీల ద్వారా డిజైన్ చేయడానికి ఇంజనీరింగ్ నిపుణులకు ఎంతో సులభంగా ఉంటుంది.

ఆపిల్ ఎలక్ట్రిక్ కార్

అయితే ఆపిల్ మాత్రం తమ ప్రాజెక్ట్ టైటాన్ గురించి ఏ విధమైన సమాచారాన్ని కూడా విడుదల చేయడానికి సుముఖత చూపలేదు.

ఆపిల్ ఎలక్ట్రిక్ కార్

అయితే ఆధారం లేని వార్తలు (పుకార్లు) ప్రకారం ఆపిల్ తమ ఎలక్ట్రిక్ కారును 2019 మరియు 2021 మద్యలో విడుదల అవుతుందని తెలిసింది.

ఆపిల్ ఎలక్ట్రిక్ కార్
  • పాపం స్టీవ్ జాబ్స్ కోరిన కోరిక తీరకుండానే.....
  • ఆపిల్ ఎలక్ట్రిక్ కార్
    • ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ మరియు సూపర్ మోడల్
Most Read Articles

English summary
Is Apple Set To Change The Electric Car Game — Hollowness The Key?
Story first published: Saturday, August 27, 2016, 12:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X