ఇంజన్ ఆయిల్ మార్చకుండా 80,000 మైళ్లు నడిపాడు...
ఏకమొత్తంలో కారును కొనగానే మన పని అయిపోదు, క్రమం తప్పకుండా మెయింటినెన్స్ రూపంలో ఎంతో కొంత కారు కోసం వెచ్చించాల్సి ఉంటుంది. కారు మెయింటినెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, ఆ తర్వాత తలెత్తే మరమ్మత్తులకు అయ్యే ఖర్చు తలకు మించిన భారంగా మారుతుంది.

అందుకే, చాలా మంది కార్ యూజర్లు తమ కారు మెయింటినెన్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంటారు. కారు ఇంజన్‌లో అత్యంత కీలకమైనది ఇంజన్ ఆయిల్. దీనిని క్రమం తప్పకుండా సర్వీస్ ఇంజనీర్ లేదా యూజర్ మ్యాన్యువల్‌లో తెలిపిన ప్రకారం లేదా అవసరమైనప్పుడల్లా మార్చుకుంటూ ఉండాలి.
Recommended Video


లేకపోతే, ఇదిగో ఈ ఫొటోలో చూపినట్లుగా ఇంజన్ కాలి మాడిపోతుంది. కారు సర్వీస్ విషయంలో నిర్లక్ష్యం వహించిన ఓ ఆడి టిటి స్పోర్ట్స్ కార్ డ్రైవర్ ఏకంగా 80,000 మైళ్లు (1,33,575 కిలోమీటర్లు) ఇంజన్ ఆయిల్ మార్చకుండా తిప్పాడట. అంత తిరిగాక ఇంజన్ పనికొస్తుందా.. ఇదిగో ఈ ఫొటో చూడండి.

ఈ సంఘటన ఎక్కడిన జరిగిన వివరాలు తెలియరాలేదు కానీ, ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంత ఖరీదైన కారు ఇంజన్ విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సదరు కారు యజమాని భారీ మూల్యాన్నే చెల్లించి ఉంటాడమో.

నల్లగా కాలి బొగ్గయినట్లుగా కనిపిస్తున్న ఈ ఇంజన్‌ను చూస్తుంటే, ఇందులో పూర్తిగా ఇంజన్‌ను మార్చడమా లేక ఇంజన్‌ను రీబిల్డ్ చేయటమో చేయాలి. కాబట్టి, మిత్రులారా.. కారు ఇంజన్ ఆయిల్‌పై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచండి.
Trending On DriveSpark Telugu:
Trending DriveSpark Telugu YouTube Videos


Click it and Unblock the Notifications








