బెంట్లీ కారుతో బాలయ్యను ఆశ్చర్యపరిచిన కుమార్తెలు

Written By:

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పైసా వసూల్ అనే చిత్రంలో సంగతి తెలిసిందే. షూటింగ్ నిమిత్తం పోర్చుగల్ వెళ్లిన బాలయ్యకు తన 57 వ జన్మదిన వేడుకలను తన కుమార్తెలు లిస్బన్ నగరంలో ఘనంగా సెలబ్రేట్ చేశారు.

నటసింహానికి అదిరిపోయే కానుకిచ్చిన కూతుళ్లు

పోర్చుగల్‌లో పైసా వసూల్ షూటింగ్‌లో ఉన్న బాలకృష్ణకు కుటుంబ సభ్యులంతా షాక్‍‌ ఇచ్చారు. బాలకృష్ణ కుమార్తెలు బాహ్మణి మరియు తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ, అల్లుడు నారా లోకేష్ అందరూ కలిసి బాలకృష్ణ పుట్టిరోజును సెలబ్రేట్ చేసారు.

నటసింహానికి అదిరిపోయే కానుకిచ్చిన కూతుళ్లు

అయితే బ్రాహ్మిణి మరియు తేజస్వినిలు బాలకృష్ణను షాక్‌కు గురిచేస్తూ, తనకెంతో ఇష్టమైన బెంట్లీ కారును బహుమానంగా ఇచ్చారు. సుమారుగా 4.5 కోట్ల రుపాయల విలువైన బెంట్లీ కాంటినెంటల్ తాళాలను గిఫ్ట్ బాక్స్‌లో ఉంచి అందజేశారు.

నటసింహానికి అదిరిపోయే కానుకిచ్చిన కూతుళ్లు

అభిమానులతో బాలయ్య అని ముద్దుగా పిలిపించుకునే నందమూరి బాలకృష్ణ సినిమాలలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించాడు. 100 సినిమాలు పూర్తి చేసుకుని ఇప్పుడు 101 వ చిత్రంలో నటిస్తున్నాడు.

నటసింహానికి అదిరిపోయే కానుకిచ్చిన కూతుళ్లు

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న బాలకృష్ట ఇప్పుడు పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న పైసా వసూల్ చిత్రం ద్వారా సెప్టెంబర్ 29, 2017 న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

నటసింహానికి అదిరిపోయే కానుకిచ్చిన కూతుళ్లు

బాలయ్య ఎంత పవర్ ఫుల్‌గా ఉంటాడో ఆయన వినిగించే కార్లు కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ప్రస్తుతం గిఫ్ట్‌గా పొందిన బెంట్లీ కాంటినెంటల్ కారు మాత్రమే కాకుండా బాలకృష్ట వద్ద ఆడి క్యూ7, బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్, మరియు పోర్షే పానమెరా కార్లు ఉన్నాయి.

నటసింహానికి అదిరిపోయే కానుకిచ్చిన కూతుళ్లు

బెంట్లీ కాంటినెంటల్ జిటి కారులో 6.0-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు, గరిష్టంగా ఐదు మంది ప్రయాణించే వీలున్న ఇది లీటర్‌కు 6 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

నెంబర్ ప్లేట్

నెంబర్ ప్లేట్

పోర్చుగల్ నుండి వచ్చిన తరువాత హైదరాబాద్‌లోని ఓ ఆర్‌టిఓ కార్యాలయంలో జరిగిన ఫ్యాన్సీ నెంబర్‌ ప్లేట్ వేలంపాటలో బాలకృష్ణ పాల్గొని ఈ బెంట్లీ కాంటినెంటల్ జిటి కారుకు రూ. 7.77 లక్షలు చెల్లించి TS09 EU 0001 అనే నెంబర్‌ను సొంతం చేసుకున్నాడు.

తాత్కాలిక రిజిస్ట్రేషన్

తాత్కాలిక రిజిస్ట్రేషన్

ఢిల్లీలోని బెంట్లీ షోరూమ్‌లో కొనుగోలు చేసిన కాంటినెంటల్ కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించారు. ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు తరలించిన అనంతరం తాత్కాలిక నెంబర్‌ ప్లేట్ స్థానంలో శాస్వత రిజిస్ట్రేషన్ వస్తుంది.

Picture Credit: Shreyas Group

English summary
Read In Telugu Balakrishna Gets Bentley Car Birthday Gift From His Daughters

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark