బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్: ఇలాంటి వెహికల్ మీకెప్పుడైనా కనిపించిందా..

ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో భారతదేశంలో కూడా అభివృద్ధివైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి, అయితే ఇటీవల అలంటి వాటికి భిన్నంగా ఉండే ఒక కొత్త రకమైన వాహనం కనిపించింది.

నివేదికల ప్రకారం, ఈ కొత్త రకం వాహనం బెంగళూరులో కనిపించింది. నిజానికి ఇలాంటి వాహనం భారతదేశంలో కనిపించడం చాలా అరుదు అనే చెప్పాలి. ఎందుకంటే మూడు చక్రాలు కలిగిన ఈ వాహనం ఒక బాక్స్ మాదిరిగా ఉంటుంది. ఇందులో వెహికల్ డ్రైవ్ చేసే వ్యక్తి లోపల కూర్చివాలి. ఇది బెంగళూరులోని జెపి నగర్ ప్రాంతంలో కనిపించింది. ఇది చూడటానికి కొత్తగా మాత్రమే కాదు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది.

బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్

ఈ వాహనానికి ముందు వైవు రెండు చక్రాలు, వెనుక వైపు ఒక చక్రం ఉండటం ఇక్కడ ఉండే ఫోటోల ద్వారా గమనించవచ్చు. అంతే కాకుండా ఈ వాహనం యొక్క లోపలి భాగంలో కొన్ని బటన్స్ వంటి వాటిని చూడవచ్చు. కానీ ఈ వాహనం లోపల ఉండే అన్ని ఫీచర్స్ మనకు స్పష్టంగా కనిపించవు. ఈ కొత్త రకమైన వాహనానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో వంటివి రేవంత్ అనే ట్విట్టర్ యూజర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

వెలోమొబైల్ వాహనంగా పిలువబడే ఈ రకమైన వాహనాలు భారతదేశంలో వినియోగంలో లేదు, అయితే ఇలాంటి వాహనాలు నెదర్లాండ్ ప్రాంతంలో వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో కనిపించిన ఈ వాహనాన్ని కూడా వినియోగదారుడు నెదర్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది. ఈ కొత్త రకమైన వాహనంలో ఒకే సీటు మాత్రమే ఉంది. అంటే ఈ వాహనంలో కేవలం ఒకే వ్యక్తి మాత్రమే ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్

టెక్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలువబడే బెంగళూరు నగరంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు కనిపించడం సర్వసాధారణం. అయితే ఇటీవల కనిపించినట్లువంటి కొత్త వెహికల్ బహుశా గతంలో కనిపించలేదని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో వంటివి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతోమంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికీ ఈ వీడియోని లక్షల మంది వీక్షించారు. అతి తక్కువ సమయంలో ఇది వైరల్ అయిపోయింది.

ఒకే సీటు కలిగిన ఈ వాహనాన్ని హ్యూమన్ పవర్ వెహికల్ అని ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వాహనంలో పవర్ అసిస్టెన్స్ మరియు కన్వర్టర్ వంటివి లేదని కూడా చెబుతున్నారు. ఇది ఒక సాధారణ సైకిల్ మాదిరిగా ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇలాంటి వాహనాలు ఎత్తు పల్లాలు లేకుండా ఉండే రహదారుల్లో నడపడానికి సులభంగా ఉంటాయి, అలా కాకుండా ఎత్తులు పల్లాలు వున్న రోడ్ల మీద డ్రైవ్ చేయడం చాలా కష్టం.

బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్

భారతదేశంలో ఇలాంటి వాహనాలు వినియోగించడానికి అనుకూలంగా ఉండే చదునుగా ఉండే రోడ్లు లేదు, ఈ కారణంగానే ఇలాంటి వాహనాల వినియోగం మన దేశంలో చాలా తక్కువగా ఉంటుంది. అయితే నెదర్లాండ్ ప్రాంతంలో ఇలాంటి వాహనాలు విరివిగా ఉపయోగంలో ఉంటాయని చెబుతున్నారు. ఈ వీడియోలో ఈ కొత్త రకం వాహనాన్ని చూసిన నెటిజన్లు కొంతమంది తాము కూడా తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి వాహనం డ్రైవ్ చేస్తామని చెప్పుకొచ్చారు.

ట్విట్టర్ లో షేర్ చేయబడిన ఈ వీడియోని చాలామంది ఒకటికంటే ఎక్కువ సార్లు, పడే పడే చూస్తున్నారని కూడా చెబుతున్నారు. ఎందుకంటే చూడటానికి కొత్తగా ఉండే ఈ వెహికల్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పాటు, మార్కెట్లో విడుదలయ్యే ఆధునిక కార్లు మరియు ఆధునిక బైకుల గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Bengaluru man spots human powered vehicle details in telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X