ఇండియాలో ఉన్న పది అతి పెద్ద టైర్ల కంపెనీలు

Written By:

వాహన కొనుగోళ్లు పెరిగేకొద్దీ, వాటి అనుభంద సంస్థలకు సంభందించిన ఉత్పత్తులకు అదే డిమాండ్ ఉంటుంది. అందులో ఒకటి టైర్ల రంగం. సైకిల్ నుండి పెద్ద పెద్ద లగ్జరీ కార్ల వరకు అన్ని వాహనాలలో టైర్లు కీలకం. అరిగిపోయే ప్రతిసారీ కొత్త టైర్లను తొడగాల్సిందే. కాబట్టి దేశీయంగా టైర్ల పరిశ్రమ విపరీతంగా పుంజుకుంది.

పాఠకుల కోసం ఇండియాలో ఉన్న పది అతి పెద్ద టైర్ల కంపెనీల గురించిన సమాచారం ఇవాళ్టి కథనంలో అందిస్తోంది.

భాతదేశపు అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీలు

10. గోవింద్ రబ్బర్

ప్రపంచ స్థాయి సైకిల్ టైర్ల తయారీ సంస్థగా గోవింద్ రబ్బర్ పేరుగాంచింది. ఇది 1964లో స్థాపించబడింది. ఎక్కువ కాలం మన్నిక మరియు నాణ్యత కలిగిన టైర్లను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఉన్న గోవింద్ రబ్బర్ సంస్థ విలువ సుమారుగా 130 కోట్ల రుపాయలు.

Recommended Video - Watch Now!
Why Doesn't A Plane's Tyre Burst While Landing - DriveSpark
భాతదేశపు అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీలు

09. టీవీఎస్

టూ వీలర్లు మరియు త్రీ వీలర్ల టైర్ల తయారీ పరంగా టీవీఎస్ శ్రీచక్ర సంస్థ ఇప్పుడు ఆధిక్యంలో ఉంది. టీవీఎస్ శ్రీచక్ర ఏడాదికి సుమారుగా 110 లక్షల టైర్లను ఉత్పత్తి చేస్తోంది. మల్టీపర్పస్ టైర్లు, స్కిడ్ స్టీర్ టైర్లు. వింటేజ్ టైర్లు మరియు ఇతరత్రా టైర్లకు టీవీఎస్ టైర్ల కంపెనీ ప్రసిద్దిగాంచింది.

భాతదేశపు అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీలు

08. పీటీఎల్ ఇండస్ట్రీస్

పీటీఎల్ ఇండస్ట్రీస్ సంస్థ 1959లో నెలకొల్పబడింది. తరువాత కొన్నేళ్లకు అపోలో టైర్స్‌లో సహచర సంస్థగా మారింది. అన్ని రకాల టైర్ల ఉత్పత్తిని అపోలో టైర్స్ చేస్తోంది. దీని మొత్తం విలువ 300 కోట్ల రుపాయలు.

భాతదేశపు అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీలు

07. క్రిప్టన్

భారత్‌లోని అతి టైర్ల కంపెనీల్లో ఒకటిగా నిలిచిన క్రిప్టన్ ఇండిస్ట్రీస్ పూర్తి స్థాయి భారత్ ఆధారిత కంపెనీ. క్రిప్టన్ ఇండస్ట్రీస్ ట్యూబ్ లెస్ టైర్లు, పియు శాండల్స్ మరియు కమ్మోడ్ చైర్లను ఉత్పత్తి చేస్తోంది. భారత్ స్టాక్ ఎక్సేంజీలో నమోదైన క్రిస్టన్ ఇండస్ట్రీస్ మొత్తం అసెట్ వ్యాల్యూ 45 కోట్ల రుపాయలు.

భాతదేశపు అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీలు

06. గుడ్ఇయర్

గుడ్ఇయర్ టైర్ కంపెనీ అమెరికాకు చెందింది. ఇది 1898లో స్థాపించబడింది. గుడ్ఇయర్ టైర్ల సంస్థ చిన్న ట్రక్కులకు, కమర్షియల్ ట్రక్కులకు, అన్ని రకాల ఆటోమొబైల్స్, ఎర్త్ మూవింగ్ వెహికల్స్ మరియు విమానాల టైర్లను ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ మొత్తం విలువ 2,000 కోట్ల రుపాయలుగా ఉంది.

Trending On DriveSpark Telugu:

టైర్లను ఎప్పుడు మార్చాలో ఇవి వీటిని అడగండి

టైర్ల పేలుడును అరికట్టేందుకు సులువైన చిట్కాలు

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బైకులో రివర్స్ గేర్!!

యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏమిటి ? ఎలా పనిచేస్తోంది?

భాతదేశపు అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీలు

05. సియట్ టైర్లు

భారతదేశపు అతి పెద్ద టైర్ల కంపెనీల జాబితాలో నిలిచిన సియట్ టైర్ల కంపెనీ 1958లో స్థాపించబడింది. సియట్ ప్రస్తుతం రోజుకు 95,000 టైర్లను ఉత్పత్తి చేస్తోంది. లైట్ కమర్షియల్ వెహికల్స్, హెవీ డ్యూటీ వెహికల్స్, ట్రాక్టర్లు, కార్లు, ట్రాలీలు మరియు ఇతర వాహనాలకు పలు రకాల రేడియల్ టైర్లను ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ మొత్తం విలువ రూ. 6,700 కోట్లుగా ఉంది

భాతదేశపు అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీలు

04. అపోలో టైర్లు

అపోలో టైర్స్ ఒక బహుళజాతి దిగ్గజం. అపోలో టైర్స్ సంస్థకు భారత్‌లో నాలుగు, నెదర్లాండ్స్‌లో ఒకటి మొత్తం ఐదు టైర్ల తయారీ ప్లాంట్లు ఉన్నాయి. భారత్‌లో అపోలో టైర్స్‌కు 2500 ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్స్ మరియు 500 కు పైబడి విక్రయ కేంద్రాలు ఉన్నాయి. అపోలో టైర్స్ కంపెనీ మార్కెట్ విలువ మొత్తం 4,582 కోట్ల రుపాయలుగా ఉంది.

భాతదేశపు అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీలు

03. బాలక్రిష్ణ

బాలక్రిష్ణ ఇండస్ట్రీస్ ముంబైయ్‌కి చెందిన టైర్ల తయారీ సంస్థ. ఇది అగ్రికల్చర్ మరియు మైనింగ్ ‌లో వినియోగించే వాహనాలకు కావాల్సిన టైర్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ సంస్థ యొక్క ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 13,000 కోట్ల రుపాయలుగా ఉంది.

భాతదేశపు అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీలు

02. జెకె టైర్

జెకె టైర్ మరియు ఇండస్ట్రీస్ ఢిల్లీ ఆధారిత టైర్ల తయారీ సంస్థ. ఇది ట్యూబులు, ఆటోమోటివ్ టైర్లు మరియు ఫ్లాప్స్‌ను తయారు చేస్తోంది. బస్సు మరియు ట్రక్కుల రేడియల్ టైర్ల తయారీ సంస్థ జెకె టైర్ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. జెకె టైర్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 3,700 కోట్లు.

భాతదేశపు అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీలు

01. ఎమ్‌ఆర్ఎఫ్

ఎమ్‌ఆర్ఎఎఫ్ అంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ, ఇది భారతదేశపు బహుళజాతి టైర్ల తయారీ దిగ్గజం మరియు భారత్‌‌లో అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీ. ఎమ్‌ఆర్ఎఫ్ అన్ని రకాల టైర్లు, ట్రెడ్, కన్వేయర్ బెల్టులు, ట్యూబులు మరియు పెయింట్లు తయారు చేస్తోంది. ఎమ్ఆర్ఎఫ్ ప్రస్తుత మార్కెట్ విలువ 28,767 కోట్ల రుపాయలుగా ఉంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Top 10 Biggest Tyre Companies In India 2017 – Most Valuable Tyre Manufacturing Companies

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark