కార్ల కలెక్షన్ లో షారుఖ్ ఖాన్ అసలైన బాద్‌షా

Written By:

షారుఖ్ ఖాన్. కృషి, పరిపూర్ణమైన అంకిత భావం మరియు ఆచరణాత్మక జీవణానికి ఓ చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్ సామ్రాజ్యానికి బాద్ షా గా నిలిచిన షారుఖ్ ఖాన్ ఫోర్బ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ పారితోషకం తీసుకున్న నటులలో టాప్ 10 జాబితాలో నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా బాలీవుడ్ అంటే ప్రతిబింబిస్తున్న ఏకైక వ్యక్తి షారుఖ్ ఖాన్.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి కొద్ది విలక్షణ నటులలో ఒకరైన షారుఖ్ ఖాన్ కార్ కలెక్షన్.....

మిత్సుబిషి పజేరో స్పోర్ట్

మిత్సుబిషి పజేరో స్పోర్ట్

ఎక్కువ మంది సెలబ్రిటీలు ఎస్‌యూవీల మీద పెద్దగా ఆసక్తి కనబరచరు. అయితే బాలీవుడ్ బాద్‌షా కు ఎస్‌యూవీలంటే అమితమైన ఇష్టం. షారుఖ్ చాలా అరుదుగా తన పజేరో స్పోర్ట్ ను వినియోగిస్తుంటాడు. మిత్సుబిషి పజేరో స్పోర్ట్ ధర రూ. 27.61 లక్షలుగా ఉంది.

షారుఖ్ ఖాన్ కార్ కలెక్షన్

ప్రస్తుతం షారుఖ్ వద్ద ఉన్న మిత్సిబిషి పజేరో స్పోర్ట్ ఎస్‌యూవీలో 2.5-లీటర్ సామర్థ్యం ఉన్న 16వి డిఐ డీజల్ ఇంజన్ కలదు, లీటర్‌కు 13.5కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల ఈ ఎస్‌యూవీ గరిష్టంగా 178బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఆడి ఏ6

ఆడి ఏ6

షారుఖ్ కార్ల జాబితాలో ఉన్న మరో లగ్జరీ కారు ఆడి ఏ6. సాధారణంగా దీనిని తన పిల్లలు సుహానా మరియు అర్యన్ ఖాన్ లను తీసుకెళ్లడం మరియు తీసుకురావడానికి వినియోగిస్తాడు. ఈ ఆడి ఏ6 కారు ధర రూ. 50 లక్షలుగా ఉంది.

షారుఖ్ ఖాన్ కార్ కలెక్షన్

ఆడి ఏ6 లో 2.0-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 187.7బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీని మైలేజ్ అంశాన్ని ప్రక్కన పెడితే, దీని గరిష్ట వేగం గంటకు 232 కిలోమీటర్లుగా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ కన్వర్టిబుల్

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ కన్వర్టిబుల్

షారుఖ్ ఖాన్ కార్లను ఎంచుకునే తీరును చూస్తే, విభిన్నమైన ఎంపిక స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఒకటి బవేరియన్ మోటార్ వర్క్స్‌ (BMW)కు చెందిన కన్వర్టిబుల్. షారుఖ్ అమితంగా ఇష్టపడే వాటిలో ఇది ఒకటి మరియు దీనిని తరచూ నడపడానికి ఇష్టపడతాడు. దీని ధర రూ. 1.21 కోట్లు

షారుఖ్ ఖాన్ కార్ కలెక్షన్

బిఎమ్‌డబ్ల్యూ ఈ 6-సిరీస్ కన్వర్టిబుల్ కారులో 4.4-లీటర్ సామర్థ్యం గల వి8 ట్విన్ టుర్బో పెట్రోల్ ఇంజన్ అందించింది. కేవలం 5 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే దీని గరిష్ట వేగం గంటకు 250కిమీలుగా ఉంది.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో

లగ్జరీ ఎస్‌యూవీ సెగ్మెంట్లో టయోటా పరిచయం వాహనం ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో. షారుఖ్ ఖాన్ తన గ్యారేజీలో దీనికి కూడా స్థానం కల్పించాడు. అద్బుతమైన పనితీరు మరియు ధృడత్వం కారణంగానే ఈ క్లాసిక్ ఎస్‌యూవీని ఎంచుకున్నాడని చెప్పవచ్చు. దీని ధర సుమారుగా కోటి రుపాయలుగా ఉంది.

షారుఖ్ ఖాన్ కార్ కలెక్షన్

టయోటా ఈ ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ఎస్‌యూవీలో 5.7-లీటర్ల సామర్థ్యం ఉన్న వి8 ఇంజన్ అందించింది, ఈ శక్తివంతమైన డీజల్ ఇంజన్ గరిష్టంగా 310బిహెచ్‌పి పవర్ మరియు 443ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్

షారుఖ్ అత్యంత ఇష్టపడే వాటిలో మరో కారు 7-సిరీస్. ఈ 760ఎల్ఐ ను పూర్తిగా లిమోసిన్ తరహాలో అభివృద్ది చేసింది బిఎమ్‌డబ్ల్యూ. దీని ధర సుమారుగా రూ. 1.95 కోట్లుగా ఉంది.

షారుఖ్ ఖాన్ కార్ కలెక్షన్

బిఎమ్‌డబ్ల్యూ ఇందులో 6.0-లీటర్ సామర్థ్యం గల వి12 పెట్రోల్ ఇంజన్‌ను అందించింది. దీనికి అనుసంధానం చేసిన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ నుండి గరిష్టంగా 544బిహెచ్‌పి పవర్ మరియు 750ఎన్ఎమ్ గరిష్ట టార్క్ చక్రాలకు సరఫరా అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 254కిలోమీటర్లుగా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8

బిఎమ్‌డబ్ల్యూ ఐ8

షారుఖ్ ఖాన్ కార్ల జాబితాలోకి తాజాగా ప్రవేశించిన అత్యంత లగ్జరీ కారు ఐ8. షారుక్ ఈ హైబ్రిడ్ కారును 2016 లో కొనుగోలు చేసాడు. అదే ఏడాది దిగ్గజ క్రికెటర్ సచిన్ కూడా కొనుగోలు చేసాడు. ఈ హైబ్రిడ్ ఐ8 కారు ధర రూ. 2.3 కోట్లుగా ఉంది. ఈ హైబ్రిడ్ కారు సగటున లీటర్ పెట్రోల్ కు 47.5 కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

షారుఖ్ ఖాన్ కార్ కలెక్షన్

ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం గల 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న ట్విన్ టుర్బో పెట్రోల్ ఇంజన్ కలదు. ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ సంయుక్తంగా 357బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. కేవలం 4.4 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిమీల వేగాన్ని అందుకునే దీని గరిష్టం వేగం 250కిలోమీటర్లుగా ఉంది.

బెంట్లీ కాంటినెన్షియల్ జిటి

బెంట్లీ కాంటినెన్షియల్ జిటి

షారుఖ్ తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఈ కారును వినియోగించడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. ఈ లగ్జరీ కారు ధర సుమారుగా రూ. 4.04 కోట్లుగా ఉంది.

షారుఖ్ ఖాన్ కార్ కలెక్షన్

బెంట్లీ సాంకేతికంగా ఈ కాంటినెన్షియల్ జిటిలో 6.0-లీటర్ సామర్థ్యం గల ట్విన్ టుర్బో ఇంజన్‌ను అందించింది. ఇది గరిష్టంగా 587బిహెచ్‌పి పవర్ మరియు 720ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. 4.4 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిమీల వేగాన్ని అందుకునే దీని గరిష్ట వేగం 319కిలోమీటర్లుగా ఉంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూపే

రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూపే

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటి రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూపే. దీని గరిష్టం వేగం గంటకు 300కిలోమీటర్లుగా ఉంది. అందుకో కాబోలు బాలీవుడ్ బాద్‌‌షా సుమారుగా రూ. 4.4 కోట్ల రుపాయలు వెచ్చించి ఈ ఫాంటమ్ కూపే ను ఎంచుకున్నాడని చెప్పవచ్చు.

షారుఖ్ ఖాన్ కార్ కలెక్షన్

రోల్స్ రాయిస్ ఈ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూపే కారులో 6.8-లీటర్ సామర్థ్యం ఉన్న న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 పెట్రోల్ ఇంజన్ అందించింది. ఇది గరిష్టంగా 460బిహెచ్‌పి పవర్ మరియు 750ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బుగట్టి వేరాన్

బుగట్టి వేరాన్

వేగం అంటే అమితమైన పిచ్చి ఉన్నవాళ్లు అసలు మరిచిపోని కారు బుగట్టి వేరాన్. దీని వేగం ఎక్కువగా ఉన్నట్లే ధర కూడా ఎక్కుగానే ఉంది. బుగట్టి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ ధర రూ. 12 కోట్లుగా ఉంది.

షారుఖ్ ఖాన్ కార్ కలెక్షన్

ఇందులో 8.0-లీటర్ల సామర్థ్యం గల బ్ల్యూ16 క్వాడ్ టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ కలదు, లీటర్‌కు 6.8 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల ఇది 1200బిహెచ్‌పి పవర్ మరియు 1500ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

 
English summary
Bollywood Actor Sharukhan Car Collection
Story first published: Thursday, February 2, 2017, 18:36 [IST]
Please Wait while comments are loading...

Latest Photos