రాంగ్ పార్కింగ్ చేశాడని 3 కోట్లు ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేశారు

Written By:

చాలా మంది రవాణా కోసం కార్లను కొంటారు. కానీ, కొంత మంది స్టేటస్‌కు గుర్తుగా కోట్ల రుపాయలు వెచ్చించి ఖరీదైన కార్లను కొంటారు. ఇలాంటి వారి కార్ల మీద చిన్న గీత పడినా ఎంతో బాధపడతారు. అలాంటి ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన అత్యంత అరుదైన కోట్ల రుపాయలు విలువ చేసే ఖరీదైన కారును ఒకస సింపుల్ రీజన్‌తో నుజ్జు నుజ్జు చేస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుంది.

రాంగ్ పార్కింగ్ చేశాడని ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేసిన పోలీసులు

ఇంగ్లాండులోని పోలీసులు 3 కోట్ల రుపాయల ఖరీదైన ఫెరారి 458 స్పైడర్ సూపర్ కారును ఏ మాత్రం కనికరం లేకుండా బుల్‌డోజర్ సహాయంతో నుజ్జు నుజ్జు చేశారు. కారణమేంటో తెలుసా...? రోడ్డు మీద నో పార్కింగ్ ప్రదేశంలో కారును పార్క్ చేశాడని ఇలా చేశారట.

రాంగ్ పార్కింగ్ చేశాడని ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేసిన పోలీసులు

కారు యజమాని జహీద్ ఖాన్ అదృష్టం ఏ మాత్రం బాగాలేదని చెప్పాలి. తన నివాసంలో అద్దెకు ఉన్న వ్యక్తులను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించాడని, అతని మీద పోలీసులకు ఫిర్యాదు దేశారు.

రాంగ్ పార్కింగ్ చేశాడని ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేసిన పోలీసులు

ఈ కేసు విషయమై జహీద్ ఖాన్ కోర్టులో హాజరయ్యేందుకు తన ఫెరార్ 458 స్పైడర్ సూపర్ కారులో వెళ్లాడు. కోర్టు సమయం మించిపోతుంటంతో కారును రోడ్డు ప్రక్కన పార్క్ చేసి, కోర్టులో వాదన జరిగే సమయానికి హాజరయ్యాడు.

రాంగ్ పార్కింగ్ చేశాడని ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేసిన పోలీసులు

అయితే, ఇంగ్లాండు పోలీసులు జహీద్ ఖాన్‌కు చెందిన ఫెరారి 458 స్పైడర్ కారును గుర్తించారు. ఎవరో దొంగలించడానికి ప్రయత్నించి సాధ్యం కాకపోవడంతో ఇక్కడ పార్క్ చేసి వెళ్లిపోయారని భావించి ఆ కారును స్టేషన్ తరలించారు.

రాంగ్ పార్కింగ్ చేశాడని ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేసిన పోలీసులు

కారు గురించి వివరాలను వెళికి తీసే క్రమంలో, కారు రిజిస్ట్రేషన్ నెంబర్ సహాయంతో కారు గురించిన పూర్తి వివరాలు సేకరించారు. కోట్లు ఖరీదు చేసే కారు అయినప్పటికీ, ఇన్సూరెయిన్స్ చేయించకపోవడం మరియు ఇది వరకే జరిగిన రిపేరీ కారణంగా రోడ్డు మీద తిరగడానికి అన్‌ఫిట్ అని గుర్తించారు.

రాంగ్ పార్కింగ్ చేశాడని ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేసిన పోలీసులు

రోడ్డు మీద తిరగడానికి పనికిరాని మరియు ఇన్సూరెన్స్ లేని కారణంతో పాటు రోడ్డు మీద అడ్డదిడ్డంగా పార్క్ చేసి ఉండటంతో అనుమానస్పదంగా గుర్తించిన ఈ కారును బుల్‌డోజర్ సాయంతో అధికారుల సమక్షంలో నుజ్జు నుజ్జు చేశారు.

రాంగ్ పార్కింగ్ చేశాడని ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేసిన పోలీసులు

పోలీసుల చర్యలకు స్పందించిన కారు యజమాని జహీద్ ఖాన్ మాట్లాడుతూ, "తన కారుకు ఇన్సూరెన్స్ ఉందని, చట్టపరంగా నోటీసులు పంపించకుండానే తన కారును నుజ్జు నుజ్జు చేశారని వెల్లడించారు."

రాంగ్ పార్కింగ్ చేశాడని ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేసిన పోలీసులు

ఇందులో పోలీసులు మరియు కారు యజమాని వాదనలు ఎలా ఉన్నప్పటికీ, మూడు కోట్ల రుపాయలు చేసే బంగారంలాంటి కారును ఎటూ పనికిరాకుంటా చేశారు. ఇంగ్లాండు మాత్రమే కాదు, చాలా దేశాల్లో పోలీసు అధికారులు ఇలానే చేస్తున్నారు. దీంతో కార్ల ఓనర్లు కూడా ఒకింత బయపడి బుద్దిగా రూల్స్ ఫాలో అవుతున్నారు. మరి మన భారతంలో ఇలాంటి రూల్స్ ఎప్పుడొస్తాయో... ఏమో....!!

ఫెరారి 458 స్పైడర్ సూపర్ కారును పోలీసులు నుజ్జునుజ్జు చేయడాన్ని ఇక్కడున్న వీడియో ద్వారా వీక్షించగలరు...

రాంగ్ పార్కింగ్ చేశాడని ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేసిన పోలీసులు

1. తలపాగా మ్యాచింగ్ కోసం 7 రోల్స్ రాయిస్ కార్లు కొనేశాడు

2.20 కోట్ల రుపాయల ఆ కారుకు 25 కోట్లు వెచ్చించి స్పెషల్ పెయింట్

3.రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

4.ఎప్పటికీ మరచిపోలేని టైటానిక్ విషాదం గురించి నగ్న సత్యాలు

English summary
Read In Telugu: British Millionaire's Rs 3 Crore Ferrari 458 Spider Supercar Being Crushed By A Bulldozer

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark