స్నేహితుడి పెళ్లికి వెళ్లి ఏడుగురు దుర్మరణం: ఘటనా స్థలిలోనే అసువులు బాసిన మిత్రులు

Written By:

ఏడు మంది ఓ మిత్రుల బృందం తమ స్నేహితుడు వివాహానికి హాజరయ్యేందుకు బుధవారం రాత్రి శివమొగ్గ నుండి బయలు దేరారు. మార్గం మధ్యలో భోజనం చేసి మళ్లీ ప్రయాణం ప్రారంభించారు. అయితే ఎదురుగా వెళుతున్న లారీ ప్రమాదం రూపంలో ఏడు మంది ప్రాణాలను హరించి వేసింది.

ఇన్నోవా ప్రమాదాల్లో అత్యంత ఘోరమైనది

శివమొగ్గ జిల్లాలోని కిరాతికోప్పకు చెందిన వెంకటేష్ అనే యువకుడి పెళ్లికి ఇతని మిత్ర బృందం శివమొగ్గ నుండి టయోటా ఇన్నోవా వాహనంలో బయలు దేరింది.

ఇన్నోవా ప్రమాదాల్లో అత్యంత ఘోరమైనది

తెల్లారితే మిత్రుడి పెళ్లిలో ఆనందంతో గడపాల్సిన వీరిని రాత్రికి రాత్రే మృత్యువు ప్రమాదం రూపంలో కబళించింది. భారీ వేగంతో ప్రయాణిస్తున్న ఇన్నోవా ఎదురుగా వెళుతున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అందరూ అక్కడిక్కడే మృతి చెందారు.

ఇన్నోవా ప్రమాదాల్లో అత్యంత ఘోరమైనది

గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన శ్రీధర్, మగదికి చెందిన ప్రవీణ్, మధు సోదరులు, శివమొగ్గకు చెందిన రాజశేఖర్, శికారీపురకు చెందిన రాఘవేంద్ర, చోరడికి చెందిన మంజునాథ్ మరియు మండ్యకు చెందిన మల్లేష్ మొత్తం ఏడు మంది ప్రమాద స్థలిలో అసువులు బాసారు.

ప్రమాదానికి ప్రధాన కారణం...

ప్రమాదానికి ప్రధాన కారణం...

ఇప్పటి వరకు జరిగిన ఇన్నోవా ప్రమాదాల్లో దీనిని ఘోరమైన ప్రమాదం అని చెప్పవచ్చు. ఎదురుగా పొడవాటి పెద్ద పెద్ద చెక్క మొద్దుల లోడుతో వెళుతున్న లారీని నిద్ర మత్తులో ఉన్న వ్యక్తి భారీ వేగంతో ఢీకొట్టినట్లు స్పష్టమవుతోంది.

ఇన్నోవా ప్రమాదాల్లో అత్యంత ఘోరమైనది

వేగంగా దూసుకెళ్లిన ఇన్నోవాలోకి కొయ్య దుంగలు దూసుకెళ్లడంతో ప్రమాదంలో అందరూ మరణించారు. సాగర జాతీయ రహదారి మీద ఆయనూరు వద్ద జరిగిన ప్రమాదంలో కొయ్యదుంగలను క్రేన్‌ల సాయంతో తొలగించి మృతదేహాలను వెలికి తీశారు.

ఇన్నోవా ప్రమాదాల్లో అత్యంత ఘోరమైనది

తన పెళ్లికి వస్తున్న మిత్రులంతా మరణించడంతో వరుడు వెంకటేషన్ ఈ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. అయితే పెద్దలు నచ్చజెప్పడాయనికి ప్రయత్నిస్తున్నారు.

ఇన్నోవా ప్రమాదాల్లో అత్యంత ఘోరమైనది

మరణించిన వారు ఎలాగో తిరిగిరారు, అయితే ఇలాంటి ప్రమాదం మన జీవితంలో జరగకూడదంటే వీలైనంత వరకు రహదారి నియమాలను పాటించండి. అతి వేగాన్ని నియంత్రిస్తే ప్రమాదాలు దాదాపు తగ్గిపోతాయి.

3ఇన్నోవా ప్రమాదాల్లో అత్యంత ఘోరమైనది

కాబట్టి పాఠకులకు చిన్న విన్నపం... పరిమిత వేగంతో ప్రయాణించి క్షేమంగా గమ్యాన్ని చేరుకోండి.

 

English summary
Read In Telugu Car and Lorry accident in shimoga near pasale village

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark