సెలబ్రిటీలు కొనుగోలు చేసే లగ్జరీ కార్ల మీద 60 శాతం వరకు డిస్కౌంట్లు

Written By:

బజారులో ఏ వస్తువు కొనాలన్నా అసలు రేటు మీద ధర దగ్గించమని కోరుతాం. మరి కార్ల విషయంలో కూడా అంతే, సాధారణ ప్రజలు ఏ డీలర్ వద్దకు వెళ్లినా కల్లిబొల్లి కబుర్లతో, ఎటు తిరిగి అదే ధరకు విక్రయిస్తాడు. గట్టి అడిగే వారికైతే కాస్త చిన్న డిస్కౌంట్లు లభించవచ్చు.

కానీ, సెలబ్రిటీల విషయానికి వస్తే మొత్తం రివర్స్. చాలా మంది సెలబ్రిటీలు వినియోగించే లగ్జరీ మరియు సూపర్ కార్లను వాటి అసలు ధర కన్నా చాలా తక్కువకే కొనుగోలు చేసి ఉంటారు. కొన్ని అధ్యయనాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

లగ్జరీ కార్ల కొనుగోళ్ల మీద సెలబ్రిటీలకు 60 శాతం డిస్కౌంట్లు

తాజా రిపోర్ట్స్ మేరకు, సెలబ్రిటీలు తాము ఎంచుకునే లగ్జరీ కార్ల మొత్తం ధరను వెచ్చించి కొనుగోలు చేయడం చాలా అరుదని తేలింది. సెలబ్రిటీల ఉన్నతి మరియు స్థాయిని బట్టి 20 నుండి 60 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయి.

లగ్జరీ కార్ల కొనుగోళ్ల మీద సెలబ్రిటీలకు 60 శాతం డిస్కౌంట్లు

జూనియర్ స్పోర్ట్స్ స్టార్ లేదా టీవీ నటీనటులకు సుమారుగా 20 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. బాలీవుడ్ దిగ్గజ నటులు మరియు సీనియర్ స్పోర్ట్స్ స్టార్లు ఎంచుకునే లగ్జరీ కార్ల మీద గరిష్టంగా 60 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయి.

లగ్జరీ కార్ల కొనుగోళ్ల మీద సెలబ్రిటీలకు 60 శాతం డిస్కౌంట్లు

తమకు నచ్చిన లగ్జరీ కార్లను ఎంచుకున్న తరువాత సెలబ్రిటీలు చేయాల్సిన పని ఆ కారుతో దిగిన ఫోటోలను తమ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మరియు ట్విట్టర్ ఖాతాల ద్వారా సోషల్ మీడియాతో తప్పనిసరిగా పంచుకోవాలి.

లగ్జరీ కార్ల కొనుగోళ్ల మీద సెలబ్రిటీలకు 60 శాతం డిస్కౌంట్లు

సెలబ్రిటీలు ఇలా చేయడం ద్వారా, ఆ కారు తయారీ సంస్థకు అనధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోతాడు. అనగా, తమకు తెలియకుండా తామే బ్రాండ్‌ను ప్రోమోట్ చేయడం. నిజానికి కార్ల తయారీ సంస్థల మార్కెటింగ్ మొత్తం అడ్వర్‌టైజింగ్ మీదే ఆధారపడి ఉంటుంది.

లగ్జరీ కార్ల కొనుగోళ్ల మీద సెలబ్రిటీలకు 60 శాతం డిస్కౌంట్లు

కాబట్టి సెలబ్రిటీలకు తక్కువ ధరతో లగ్జరీ కార్లను విక్రయించడం ద్వారా తమ సంస్థకు పరోక్ష ప్రచారం దక్కుతుంది. సెలబ్రిటీలు తాము కొనుగోలు చేసిన కార్లతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, సెలబ్రిటీల ఫ్యాన్స్ మొత్తానికి అది చేరుతుంది. సెలబ్రిటీల ఫ్యాన్స్‌లో వారి కార్లు గురించి చర్చించుకోవడం మొదలుపెడతారు.

లగ్జరీ కార్ల కొనుగోళ్ల మీద సెలబ్రిటీలకు 60 శాతం డిస్కౌంట్లు

లగ్జరీ కార్ల డీలర్లు సెలబ్రిటీలకు ప్రత్యక్షంగా ఆఫర్లను ఇవ్వరు. సెలబ్రిటీలు డైరక్ట్‌గా తయారీదారులను సంప్రదించి సామాజిక మాధ్యమాలలో తమకు ఉన్న ఫాలోయింగ్ గురించి వివరించి అత్యంత తక్కువ ధరకే లగ్జరీ కార్లను దక్కించుకుంటారు.

లగ్జరీ కార్ల కొనుగోళ్ల మీద సెలబ్రిటీలకు 60 శాతం డిస్కౌంట్లు

కార్ల తయారీ సంస్థలుసెలబ్రిటీలకు కార్లను విక్రయించి అంతటితో వదిలేయవు. కారును ఫలానా సెలబ్రిటీకి అందించేటపుడు మీడియాను పిలిపించి, ప్రెస్ మీట్ నిర్వహించి ఓ పెద్ద ప్రచార వేదికలా మార్చేసి తమ ఉత్పత్తులకు పరోక్షంగా అడ్వర్‌టైజ్ చేస్తారు.

లగ్జరీ కార్ల కొనుగోళ్ల మీద సెలబ్రిటీలకు 60 శాతం డిస్కౌంట్లు

ఒక కార్ల తయారీ సంస్థకు సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నపుడు లభించే ప్రమోషన్ మరియు ఇలా సెలబ్రిటీలకు కార్లను విక్రయించినపుడు మీడియా మరియు ఫ్యాన్స్ ద్వారా లభించే ప్రమోషన్‌కు సమానంగా ఉంటుంది.

లగ్జరీ కార్ల కొనుగోళ్ల మీద సెలబ్రిటీలకు 60 శాతం డిస్కౌంట్లు

ఉదాహరణకు, బాలీవుడ్ నటుడు షారుఖ్ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. తాను సినిమాల్లో వినియోగించే కార్లు హ్యుందాయ్ కార్లే అయినప్పటికీ రియల్ లైఫ్‌లో హ్యుందాయ్ కారును వినియోగించిన దాఖలాలు లేవు.

లగ్జరీ కార్ల కొనుగోళ్ల మీద సెలబ్రిటీలకు 60 శాతం డిస్కౌంట్లు

హ్యందాయ్ కార్లకు బదులుగా బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారును ఎక్కువగా వినియోగిస్తుంటాడు, దీంతో పాటు మరో మూడు బిఎమ్‌డబ్ల్యూ కార్లు, కొన్ని జర్మన్ కార్లు ఉన్నాయి. షారుఖాన్ ప్రత్యక్షంగా హ్యుందాయ్ కార్లను ప్రమోట్ చేస్తున్నాడు, కానీ పరోక్షంగా బిఎమ్‌డబ్ల్యూ కార్లను ప్రమోట్ చేస్తున్నాడు. తనకు బిఎమ్‌డబ్ల్యూ కార్లంటే ఎంత ఇష్టమో అనే విషయాన్ని, తన వద్ద ఉన్న నాలుగు కార్లతో చెబుతున్నాడు.

లగ్జరీ కార్ల కొనుగోళ్ల మీద సెలబ్రిటీలకు 60 శాతం డిస్కౌంట్లు

దీనికి తోడు అనేక పత్రికలు, వార్తా సంస్థలు ఓ సెలబ్రిటీ ఫలానా కారును కొన్నాడు, డ్రైవ్ చేశాడని ప్రత్యేకత కథనలను రాస్తుంటాయి. ఇలాంటివి కూడా కారుకు మరియు కార్ల తయారీ సంస్థకు మంచి ప్రచారాన్ని తెచ్చిపెడుతాయి.

లగ్జరీ కార్ల కొనుగోళ్ల మీద సెలబ్రిటీలకు 60 శాతం డిస్కౌంట్లు

ఏదేమయినప్పటికీ, సెలబ్రిటీలందరూ భారీ డిస్కౌంట్లతో లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తారనే ఖచ్చితత్వం లేదు. కొంత మంది మొత్తం ధరను చెల్లించి కూడా కొనుగోలు చేస్తుంటారు. కాబట్టి ఈసారి ఎప్పుడైనా సెలబ్రిటీలు అత్యంత ఖరీదైన లగ్జరీ కారును డ్రైవ్ చేస్తున్నట్లయితే, దాని కొనుగోలు వెనుక కూడా ఈ స్టోరీ ఉంటుందని గుర్తుంచుకోండి.

English summary
Read In Telugu To Know More About Celebrities avail upto 60 percent discount on luxury cars and supercars
Story first published: Monday, June 12, 2017, 10:55 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark