దూడను ఢీ కొట్టిన చెన్నై - మైసూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ప్రారంభమై 10 రోజులు కాకముందే

2022 నవంబర్ 11 న దేశ ప్రధాని దక్షిణ భారతదేశంలో మొట్ట మొదటి 'వందే భారత్' ట్రైన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైన్ ప్రారంభమైన ఇప్పటికి ఎనిమిది రోజులు కావొస్తుంది.

మైసూర్ మరియు చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు అప్పుడే ప్రమాదానికి కారణమయ్యింది. ఇంతకీ ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది, ప్రమాదంలో జరిగిన నేతలు ఏమి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆవు దూడను ఢీ కొట్టిన చెన్నై & మైసూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

నివేదికల ప్రకారం, ఇటీవల ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తమిళనాడులోని అరక్కోణంలో ఒక దూడను ఢీ కొట్టినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ఆ దూడ అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం, అయితే కొంత సేపటి తరువాత ఈ ట్రైన్ ముందు వెళ్ళిపోతుంది.

వందే భారత్ ట్రైన్లు అత్యంత వేగవంతమైన ఆధునిక ట్రైన్లు. కాబట్టి ఇది చాలా వేగంగా ప్రయాణిస్తుంది. అయితే ప్రమాదానికి కారణమైన మైసూర్ & చెన్నై వందే భారత్ ఆ సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. ఈ ట్రైన్ కేవలం చెన్నై నుంచి బయలుదేరి బెంగళూరులో మాత్రమే నిలుస్తుంది, ఆ తరువాత బెంగళూరులో ప్రారంభమై మైసూర్ చేరుకుంటుంది.

ఇప్పటి వరకు భారతదేశంలో మొత్తమ్ 5 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు ఉన్నాయి. అయితే చెన్నై మరియు మైసూర్ ట్రైన్ యొక్క వేగాన్ని అధికారులు గంటకు 75 నుంచి 77 కిమీ వరకు నిర్ణయించారు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లలో ఇది తక్కువ వేగంతో ప్రయాణించే ట్రైన్ అవుతుంది.

నిజానికి వందే భారత్ ట్రైన్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం పశువులు విచ్చలవిడిగా రైల్వే ట్రాకుల మీది రావడమే. ఇలాంటి సంఘటనలు తగ్గించడానికి రానున్న మరో ఆరు నెలల్లో 1,000 కిలోమీటర్ల మేర సరిహద్దు గోడను నిర్మిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన దూడ యజమానిని గుర్తించి రేల్వే చట్టం 1989 నిబంధన ప్రకారం సెక్షన్ 154 కింద కేసు నమోదు చేయనున్నట్లు కూడా సమాచారం. అయితే ఈ దూడ యజమాని మీద కేసు నమోదు చేస్తారా.. లేదా అనేది తెలియాల్సిన విషయం. కాగా ప్రజలు కూడా తప్పకుండా తమ పశువులను తమ పరిధిలోనే ఉంచుకోవాలి, లేకుంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి.

ఇక ఇటీవల ప్రారంభమైన వందే భారత్ ట్రైన్ విషయానికి వస్తే, ఇది ప్రస్తుతం 16 కోచ్‌లతో అందుబాటులో ఉంది. ఇందులో ఆటోమేటిక్ డోర్స్‌తో పాటు జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువ‌ల్ ప్యాసింజ‌ర్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ప్రయాణీకులకు వినోదం కోసం ఆన్‌బోర్డ్ హాట్‌స్పాట్, వైఫై కనెక్షన్, సౌకర్యవంతంగా ఉండే సీట్లు ఉన్నాయి. ఈ రైలు 497 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 6 గంటల 40 నిముషాల్లో చేరుకోగలదని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా రానున్న మరో మూడు సంవత్సరాల్లో భారతదేశం మొత్తం మీద 400 వందే భారత్ ట్రైన్లు వినియోగంలోకి రానున్నట్లు సమాచారం, దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే 2022 బడ్జెట్ లో వెల్లడించింది. కావున ఇలాంటి వేగవతమైన ట్రైన్లను తీసుకురావడానికి రైల్వే శాఖ తగిన ఏర్పాట్లను చేస్తోంది.

Most Read Articles

English summary
Mysore chennai vande bharat express collides with calf details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X