తొలి సోలార్ పవర్ జాతీయ రహదారిని ప్రారంభించిన చైనా

Posted By:

డ్రాగన్ కంట్రీ తొలి సోలార్ పవర్ జాతీయ రహదారిని ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించింది. చైనాలోని షాండాగ్ ప్రావిన్స్ రాజధాని జినాన్ నగరంలో కిలోమీటరు పొడవైన సోలార్ జాతీయ రహదారిని పూర్తి స్థాయిలో రాకపోకలకు అనుమతించి పరీక్షించింది.

సోలార్ రహదా

ఫ్యూచర్ రవాణాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వైర్ లెస్ ఛార్జింగ్‌కు ఈ సోలార్ రహదారులు ఊతమివ్వనున్నాయి. సోలార్ పవర్ రహదారుల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌తో ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ రోడ్డు మీదఇప్పుడు పూర్తి స్థాయిలో రాకపోకలకు అనుమతిచ్చారు.

Recommended Video - Watch Now!
Watch Now | Indian Navy's MiG-29K Crashed In Goa Airport | Full Details - DriveSpark
సోలార్ రహదా

కాంతి ప్రసరణ ద్వారా విద్యుత్ తయారయ్యే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ప్రపంచపు తొలి రోడ్డు ఇదే. దీనిని చైనాలోని జినాన్ ఎక్స్‌ప్రెస్‌వే మీద కిలోమీటరు మేర నిర్మించారు.

సోలార్ రహదా

ఈ రోడ్డు మీద పడిన కాంతి శక్తి విద్యుత్ శక్తి రూపంలోకి మారుతుంది. ఈ రోడ్డు మూడు సంవత్సరాల పాటు నిరంతరం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే, మూడు లేయర్లలో ఉన్న ఈ రోడ్డు అడుగు భాగంలో ఇన్సులేటెడ్ లేయర్, మధ్యలో కాంతి ప్రసరణ(ఫోటో వోల్టాయిక్) ఫలకలు మరియు పై భాగంలో పారదర్శకపు కాంక్రీట్ లేయర్ ఉంటుంది.

సోలార్ రహదా

5,784 చదరపు అడుగుల మేర ఈ ప్యానళ్లను పరిచారు. వీటి మొత్తం సామర్థ్యం 800కిలోవాట్లుగా ఉంది. సోలార్ ఫోటో వోల్టాయిక్ ఆధారంతో పవర్ ఉత్పత్తి చేసే ఈ మార్గాలను ఎక్కువగా ఫోటోవోల్టాయిక్ ఉపరితల రహదారులు ఉంటాయి.

సోలార్ రహదా

భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇదొక ప్రధాన వనరు కానుంది. ఈ రోడ్డు మీద ఉన్న పారదర్శక పదార్థం సూర్యరశ్మి చర్య జరిపి కాంతిని ఉత్పత్తి చేస్తుంది. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్తును జాతీయ రహదారుల వెంబడి ఉన్న లైట్లను, రహదారి గుర్తులు, నిఘా కెమెరాలు, సొరంగ మార్గాలు మరియు టోల్ గేట్ కేంద్రాలలో ఉపయోగించుకోనున్నారు.

సోలార్ రహదా

రహదారి మీద ఫోటోవోల్టాయిక్ ప్యానళ్లను ఏర్పాటు చేసి విద్యుత్త్ ఉత్పత్తి చేసే ఇలాంటి ప్రాజెక్ట్ ద్వారా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే ప్రత్యేక మరియు అదనపు నిర్మాణాల అవసరం తగ్గిపోతుందని ఈ గ్రూప్ చైర్మెన్ జూ చున్‌ఫు పేర్కొన్నాడు.

Trending On DriveSpark Telugu:

భారత రహదారుల గురించి షాకింగ్ నిజాలు

భారత్‌లోకెల్లా అత్యంత భయంకరమైన రహదారులు

సముద్రం మీద ఉన్న ఈ రోడ్డు రోజుకు రెండు సార్లు మునిగి తేలుతుంది

సోలార్ రహదా

ఫ్యూచర్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు వైర్ లెస్ ఛార్జింగ్ కల్పించడం, రోడ్ల మీద పేరుకుపోయే మంచును కరిగించడం మరియు ఇంటర్నెట్ సేవలను విస్తరించడంలో ఈ ప్యానళ్లు కీలకం కానున్నాయి.

సోలార్ రహదా

సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో చైనా ఇప్పటికే ఆధిక్యంలో ఉంది. దీనికి తోడు పెట్రోల్ మరియు డీజల్ కార్ల స్థానాని ఎలక్ట్రిక్ కార్లు భర్తీ చేయనుండటంతో ఛార్జింగ్ అవసరాలకు కావాల్సిన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి కొత్త మార్గాలను చైనా అన్వేషిస్తోంది. అందులో భాగంగానే ఈ సోలార్ ఫోటో వోల్టాయిక్ పవర్ రహదారిని నిర్మించిందని చెప్పవచ్చు.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Picture credit: China Xinhua News

English summary
Read In Telugu: China tests its first solar-powered highway that can charge electric cars

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark