చైనాలో నిజ విమాన రెస్టారెంట్: భారత్‌లో ఎక్కడుందో తెలుసా ?

By Anil

భోజన ప్రియులను ఆకర్షించడానికి రెస్టారెంట్ల నిర్వాహకులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. విభిన్నంగా ఉండటానికి ప్రత్యేకమైన వర్ణాలంకారాలతో రెస్టారెంట్లను తీర్చిదిద్దుతారు. ఏదో ఒక ప్రత్యేకతలను చూపడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో నుండి పుట్టుకొచ్చిందే ఈ విమాన రెస్టారెంట్.

విమానంలో రెస్టారెంట్

ఇక విమాన ప్రయాణం కలగా ఉన్న వారు ఇందులో విందారగించడం ద్వారా విమానంలో ప్రయాణించిన అనుభూతిని పొందుతారు. ఒక విధంగా చెప్పాలంటే అలాంటి వారి కల ఈ విమాన రెస్టారెంట్ ద్వారా తీరినట్లే

విమానంలో రెస్టారెంట్

విశ్వ విఖ్యాత విమానాల తయారీ సంస్థ బోయింగ్ రూపొందించిన 737 అనే విమానాన్ని చైనా దేశీయులు ఏకంగా రెస్టారెంట్‌గా మార్చేసారు.

విమానంలో రెస్టారెంట్

చైనా మొట్టమొదటి సారిగా ప్రారంభించిన ఈ విమాన రెస్టారెంట్లో విభిన్నమైన వంటకాలను ఆస్వాదించే అకాశం కల్పించారు. ఇంటీరియర్‌లో దీనిని పూర్తి స్థాయిలో రెస్టారెంట్‌గా డిజైన్ చేశారు.

విమానంలో రెస్టారెంట్

చైనాలోని హుబేయిు ప్రావిన్స్‌లోని వుహాన్ అనే ప్రాంతంలో లి యాంగ్ అనే వ్యాపారవేత్త ఈ బోయింగ్ 737 విమానాన్ని సుమారుగా 35 మిలియన్ల యువాన్‌(5.2 మిలియన్ డాలర్లు)లకు కొనుగోలు చేసి రెస్టారెంట్‌గా తీర్చిదిద్దాడు.

విమానంలో రెస్టారెంట్

విమానంలో ప్రయాణిస్తు భోజనం చేస్తున్నామనే అనుభూతిని కలిగించేందుకు ఈ విమాన రెస్టారెంట్‌లో పనిచేసే అమ్మాయిలకు ఎయిర్ హోస్టెస్ వస్త్రదారణ అందించారు.

విమానంలో రెస్టారెంట్

చైనాలోని హుబేయిు ప్రావిన్స్‌లోని వుహాన్ ప్రాంతంలో ఈ విమాన రెస్టారెంట్‌ని 2016 సెప్టెంబర్ 9 నుండి ప్రారంభించారు.

విమానంలో రెస్టారెంట్

విమాన రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న లి యాంగ్ మాట్లాడుతూ, ఇండోనేషియాకు చెందిన బొటావియా ఎయిర్‌లైన్స్‌లో కాలం చెల్లిన ఈ విమాన్ని కొనుగోలు చేసి రెస్టారెంట్‌గా మార్చినట్లు తెలిపాడు. ఇండోనేషియా నుండి చైనాకు తరలించడానికి సుమారుగా నాలుగు నెలల కాలం పట్టినట్లు తెలిసింది.

విమానంలో రెస్టారెంట్

చైనా యొక్క మొట్టమొదటి విమాన రెస్టారెంట్ లిలి ఎయిర్ వేస్‌కు చెందిన విమానంలో ఫోటో తీసుకుంటున్న మహిళ

విమానంలో రెస్టారెంట్

విమానంలో నుండి బాహ్య ప్రదేశం కనిపించే విధంగా డైనింగ్ టేబుల్‌ను అరేంజ్ చేసిన దృశ్యం.

విమానంలో రెస్టారెంట్

బోయింగ్ 737 విమానంలో రష్యాకు చెందిన ఆహార పదార్థాలను తయారు చేస్తున్న దృశ్యం.

విమానంలో రెస్టారెంట్

విమాన రెస్టారెంట్ వెలుపల కస్టమర్లను స్వాగతించేందుకు ఎయిర్ హోస్టస్ వస్త్రదారణలో ఉన్న రెస్టారెంట్ సిబ్బంది.

విమానంలో రెస్టారెంట్

రెస్టారెంట్‌గా రూపాంతరం చెందిన విమాన క్యాబిన్‌లో కూర్చున్న కస్టమర్లు.

విమానంలో రెస్టారెంట్

విమానంలో కస్టమర్లకు ఆహార పదార్థాలను సర్వ్ చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక గది.

విమానంలో రెస్టారెంట్

విమాన రెస్టారెంట్ లోని సిబ్బంది...

విమానంలో రెస్టారెంట్

చైనా మొదటి విమాన రెస్టారెంట్‌లో కస్టమర్లు.

.

  • కారు ఇన్సూరెన్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు... పూర్తిగా వినియోగదారుల లాభదాయకమైన ఈ విధానం గురించి పూర్తి వివరాలు...

Most Read Articles

English summary
Read In Telugu: China Unveils Its First Plane Restaurant
Story first published: Thursday, September 15, 2016, 13:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X