భేష్.. సామాన్యుడి ఆవిష్కరణకు ఫిదా అయిపోయిన 'ఆనంద్ మహీంద్రా' - ఇంతకీ అదేమిటో తెలుసా

సోషల్ మీడియావైలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ఇందులో ఒక స్కూటర్ మిద్దె పైకి బరువులను తీసుకెళ్లడానికి సహాయపడుతుంది.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ లేటెస్ట్ వీడియోలో ఒక పాత బజాజ్ చేతక్ కనిపిస్తుంది. అయితే ఈ స్కూటర్ ని ఒక కార్మికుడు తనకు తగిన విధంగా మాడిఫైడ్ చేసుకున్నాడు. ఈ మోడిఫైడ్ బజాజ్ చేతక్ ఇప్పుడు చాలా మంది దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇది నిజంగానే అద్భుతమైన ఆవిష్కరణ, దీనిని తయారు చేసిన వ్యక్తి యొక్క తెలివిని ఎవరైనా తప్పకుండా ప్రశంసించాల్సిందే.

సామాన్యుడి ఆవిష్కరణకు ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా

నిజానికి ప్రస్తుతం గృహ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ నిర్మాణాలకు లిఫ్ట్ వంటి పరికరాలు అవసరమవుతాయి. ఇవి కొంత ఎక్కువ ఖరీదైనవి కావడం వల్ల అందరూ వీటిని కొనుగోలు చేయడానికి సాహసించే అవకాశం ఉండదు. కానీ అలంటి పరికరాలు అవసరమైనప్పుడు కొంత మంది వ్యక్తులకు అద్భుతమైన ఆలోచనలు పుట్టుకొస్తాయి. అలాంటి ఆలోచనల నుంచే ఈ మోడిఫైడ్ బజాజ్ చేతక్ పరికరం పుట్టుకొచ్చింది.

ఈ వీడియోలో కనిపించే పాత బజాజ్ చేతక్ స్కూటర్ యొక్క వెనుక చక్రం తొలగించి దానికి ఒక ఇనుప రాడ్డుని అమర్చారు. దానికి మరో చివర తాడును చుట్టుకోవడానికి మరియు వదలడానికి అనుకూలంగా ఉండే మరో పరికరం కూడా ఉంది. ఈ స్కూటర్ ని స్టార్ట్ చేసినప్పుడు అది బరువులను పైకి తీసుకెళుతుంది. ఈ సంఘటన మొత్తం ఈ వీడియోలో చూడవచ్చు. ఇలాంటి ఆవిష్కరణలు బహుశా మనదేశానికి మాత్రమే పరిమితం.

ఈ వీడియోని ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ.. అందుకే వాటిని పవర్ ట్రెయిన్లు అని అంటున్నాం. వాహన ఇంజన్ల శక్తిని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. వీటి ధరను మరింత తగ్గించినట్టయితే ఈ స్కూటర్ తో మరింత మెరుగ్గా ఉంటుంది' అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ సంఘటన శ్రీశైలం ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ వీడియోలో శ్రేశైలం అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

భారతదేశంలో చదువుకున్న వారికి మాత్రమే కాకుండా చదువు లేని వారు కూడా గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో భాగంగానే ఇలాంటి గొప్ప అవస్కరణలు పుట్టుకొస్తాయి. అలంటి ఆవిష్కరణలు చేసేవారిని ప్రోత్సహించాలి, వారికి మనవంతు సలహాలు మరియు సహాయాలను అందించడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఇలాంటి మరింత మంది ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయి. వారి ప్రతిభ వల్ల పుట్టుకొచ్చిన ఈ ఆవిష్కరణలు సమాజానికి తప్పకుండా తెలియాలి.

ఇదిలా ఉండగా ఇటీవల ఆనంద్ మహీంద్రా 'మదర్ ఆఫ్ ఇన్వెన్షన్' అంటూ ఒక పోస్ట్ షేర్ చేశారు. ఇందులో ఒక ఎలక్ట్రిక్ టూ వీలర్ ఆరు మంది ప్రయాణించడానికి అనుకూలంగా తయారైంది. ఈ వెహికల్ సాయంతో ఒకేసారి ఆరు మంది వ్యక్తులు సులభంగా ప్రయాణించవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వెహికల్ తయారీకి రూ.12,000 ఖర్చు అయినట్లు, ఒక ఛార్జ్ తో ఏకంగా 150కిమీ ప్రయాణిస్తుందని తెలిసింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతదేశంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తనకు ఆసక్తిని కలిగించే వీడియోలను మరియు పోస్టులను షేర్ చేస్తూ వాటిపై స్పందిస్తూ ఉంటారు. ఇటీవల ఆయన షేర్ చేసిన బజాజ్ చేతక్ పోస్టు మీద చాలా మంది తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడంతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు, బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Construction workers turn old bajaj scooter into electric pulley anand mahindra shares video
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X