2021 లో ట్రాఫిక్ ఉల్లంఘించిన వాహనాల జాబితా.. పూర్తి వివరాలు

భారతదేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, ట్రాఫిక్ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతోంది. ట్రాఫిక్ పెరిగిపోవడంతో వాహన వినియోగదారుల చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్ నిబంధనలను మెరుగుపరుస్తూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం జరుగుతున్న రోడ్డుప్రమాదాల సంఖ్యను తగ్గించడమే.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

ట్రాఫిక్ రూల్స్ కొత్తగా ఎన్ని వచ్చినా, కఠినమైన నిబంధనలను ఎన్ని అమలు చేసినా ఇప్పటికి కూడా జరిగే రోడ్డు ప్రమాదాలను నిలువరుంచలేకపోతున్నారు. దీనికి కారణం వాహన వినియోగదారులు ట్రాఫిక్ నియమాలను విస్మరిస్తున్నారు. 2021 లో ఢిల్లీ పోలీసులు ఏకంగా 4 లక్షల కార్లకు మరియు 5 లక్షల బైకులకు వివిధ కారణాల వల్ల జరిమానాలు విధించారు. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

4 లక్షల కార్లు & 5 లక్షల టూవీలర్స్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాయి.. ఇది 2021 రిపోర్ట్

నివేదికల ప్రకారం ఢిల్లీ పోలీసులు గత సంవత్సరం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన దాదాపు 4 లక్షల కార్లకు మరియు 5 లక్షల బైకులకు జరిమానా విధించినట్లు తెలిసింది. ఇందులో రాంగ్ పార్కింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ వంటివి ఉన్నాయి.

4 లక్షల కార్లు & 5 లక్షల టూవీలర్స్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాయి.. ఇది 2021 రిపోర్ట్

ఢిల్లీ రోడ్ క్రాష్ ఫెటాలిటీస్ రిపోర్ట్ 2021 ప్రకారం, 1,44,734 కార్లు మరియు 1,54,506 మోటార్‌సైకిళ్లు & స్కూటర్లు రాంగ్ పార్కింగ్ లో ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో 10,696 కార్లు మరియు 11,373 బైక్‌లు & స్కూటర్‌లు 'ప్రమాదకరమైన డ్రైవింగ్' (డెంజరస్ డ్రైవింగ్) కేటగిరీ కింద విచారించారు.

4 లక్షల కార్లు & 5 లక్షల టూవీలర్స్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాయి.. ఇది 2021 రిపోర్ట్

మొత్తమ్ మీద 2021 వ సంవత్సరంలో 3,96,028 కార్లు, 5,16,018 మోటార్‌సైకిళ్లు & స్కూటర్లపై వివిధ నేరాలకు పాల్పడిన కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే దేశంలో వాహన వినియోగదారుల ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది.

4 లక్షల కార్లు & 5 లక్షల టూవీలర్స్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాయి.. ఇది 2021 రిపోర్ట్

ఢిల్లీ పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, వాహనాలను మొత్తం 48 రకాల నేరాల కింద నమోదు చేసి జరిమానా విధించారు. ఐతే కాకూండా వీరిపైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. వివిధ నేరాలకు సంబంధించి 2021 సంవత్సరంలో 1,05,318 లైట్ గూడ్స్ వెహికల్స్ (ఎల్‌జివి) కి జరిమానా విధించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

4 లక్షల కార్లు & 5 లక్షల టూవీలర్స్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాయి.. ఇది 2021 రిపోర్ట్

కేవలం కార్లు మరియు బైకులు & స్కూటర్లు మాత్రమే కాకుండా 2021లో తప్పుడు పార్కింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్ మరియు పర్మిట్ ఉల్లంఘన కారణంగా 76 స్కూల్ బస్సులు మరియు 97 స్కూల్ క్యాబ్‌లపై కూడా పోలీసులు జరిమానాలు విధించారు. ఇందులో భాగంగానే 1,995 డీటీసీ బస్సులపై తప్పుడు పార్కింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్ మరియు లేన్ ఉల్లంఘన నేరాల కింద జరిమానా విధించారు. మొత్తం మీద 2021 లో పోలీసులు 59,233 ట్యాక్సీలకు కూడా జరిమానా విధించారు.

4 లక్షల కార్లు & 5 లక్షల టూవీలర్స్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాయి.. ఇది 2021 రిపోర్ట్

ఇదిలా ఉండగా ఇప్పుడు కేవలం కార్లు ముందు ఉన్న ప్రయాణికులకు మాత్రమే కాకుండా, వెనుక ఉన్న ప్రయాణికులకు కూడా సీట్ బెల్ట్ తప్పనిసరి అని కొత్త నిభందనలు చెబుతున్నాయి. ఈ కారణంగానే, ఈ నెల ప్రారంభంలో, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సీటు బెల్ట్ ధరించని 17 మందికి జరిమానా విధించారు. ఇందులో ఒక్కొక్కరికి రూ. 1,000 జరిమానా విధించారు.

4 లక్షల కార్లు & 5 లక్షల టూవీలర్స్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాయి.. ఇది 2021 రిపోర్ట్

ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సెంట్రల్ ఢిల్లీలోని బరాఖంబా రోడ్డు నుంచి కన్నాట్ ప్లేస్ వరకు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పట్టుబడినవారికి సెక్షన్ 194బి కింద జరిమానా విధించారు. రానున్న రోజులో ఈ నియమం మరింత కఠినతరం కానుంది. కావున వాహనం వినియోగదారులు తప్పకుండా ఈ నియమం పాటించాలి.

4 లక్షల కార్లు & 5 లక్షల టూవీలర్స్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాయి.. ఇది 2021 రిపోర్ట్

రోడ్డు ప్రమాదాలలో మరణించేవారు సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో రోడ్డు మరియు రవాణా మంత్రిత్వ శాఖ కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఒక్క 2020 సంవత్సరంలో మొత్తం 1,20,806 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

4 లక్షల కార్లు & 5 లక్షల టూవీలర్స్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాయి.. ఇది 2021 రిపోర్ట్

2020 లో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువమంది యువత ఉండటం గమనార్హం. జరిగుతున్న రోడ్డు ప్రమాదాలలో 35.9 శాతం జాతీయ రహదారులపై జరుగుతుండగా 25 శాతం రాష్ట్ర రహదారులపైన జరుగుతున్నాయి. మిగిలిన 39.1 శాతం ప్రమాదాలు ఇతర రోడ్లమీద జరుగుతున్నాయి.

4 లక్షల కార్లు & 5 లక్షల టూవీలర్స్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాయి.. ఇది 2021 రిపోర్ట్

నిజానికి రోడ్డు ప్రమాదాలలో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు యువకులే ఎక్కువ మరణిస్తున్నారు. ఇందులో కూడా 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వారు 70 శాతం మంది ఉన్నారు. 60 సంవత్సరాలలోపు ఉన్నవారు 87.4 శాతం మంది ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ మరియు ఇరత కారణాలు ఉన్నాయి. ఇందులో ఓవర్ స్పీడ్ వల్ల 69.3 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. కాగా సక్రమంగా డ్రైవ్ చేయకపోవడం వల్ల 5.6 శాతం మంది మరణిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పొతే రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య దాదాపు ఎక్కువగానే ఉంటుంది.

Most Read Articles

English summary
Delhi police fined 4 lakh cars and 5 lakh bikes in 2021 details
Story first published: Wednesday, September 21, 2022, 16:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X