విమానాలలో రివర్స్ గేర్ ఉంటుందా..?
విమానాలలో రివర్స్ గేర్ ఉంటుందా...? డ్రైవింగ్ తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ ప్రశ్న సంధిస్తే వారి పరిస్తితి ఏమిటి? రివర్స్ గేర్ సంగతి అటుంచితే, అస్సలు గేర్ సిస్టమ్ ఉంటుందో ఉండదో అని సందిగ్ధంలోకి వెళ్లిపోతా
విమానాలలో రివర్స్ గేర్ ఉంటుందా...? డ్రైవింగ్ తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ ప్రశ్న సంధిస్తే వారి పరిస్తితి ఏమిటి? రివర్స్ గేర్ సంగతి అటుంచితే, అస్సలు గేర్ సిస్టమ్ ఉంటుందో ఉండదో అని సందిగ్ధంలోకి వెళ్లిపోతారు.

ఏదేమైనప్పటికీ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంటుంది. విమానాలలో రివర్స్ గేర్ ఉంటుందా....? అస్సలు గేర్ సిస్టమ్ ఉంటుందా...? ఉండదా....? వంటి ప్రశ్నలకు సమాధానం ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి.
Recommended Video


వీల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గేర్‌బాక్స్ ఉంటుంది. రన్ వే మీద విమానాలు అటు ఇటు కదులుతూ ఉంటాయి కాబట్టి రివర్స్ అండ్ ఫార్వర్డ్ గేర్లు ఉంటాయని పొరబడకండి. విమానాల్లో గేర్‌బాక్స్, ఫ్రంట్ గేర్ మరియు రివర్స్ గేర్ వంటివి అస్సలు ఉండవు.

విమాన రెక్కల క్రింద టుర్బో ప్రాప్ ఇంజన్స్ ఉంటాయి. వాటి మీద రివర్స్ డైరెక్షన్‌లో గాలి ప్రవాహాన్ని కలిగించి ఒత్తిడి తీసుకురావడం ద్వారా విమానాలు వెనక్కి కదులుతాయి.

థ్రోటిల్ ఆపరేట్ చేయడం ద్వారా జరిగే ఈ పద్దతిని బేటా రేంజ్ అంటారు. సాధారణంగా విమానాలు ముందుకు కదలాలంటే ఫార్వర్డ్ డైరెక్షన్ ఒత్తిడిని కలిగిస్తారు.

చాలా వరకు పాత కమర్షియల్ విమానాలలో జెట్ ఇంజన్ ఎగ్జాస్ట్ పైపు నుండి వెలువడే మండిన గాలిని విమానం ముందువైపు ద్వారా ఒత్తిడి కలిగించి విమానం వెనక్కి కదిలేలా చేస్తారు.

అయితే, ఈ పద్దతి చాలా ప్రమాదకరమైనది. ఇంజన్ నుండి వచ్చే గాలి చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడి గాలి మళ్లీ విమానం ప్రయోగించడంతో దహించుకుపోయే స్వభావం ఉన్న మెటీరియల్ ద్వారా అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇప్పట్లో ఈ పద్దతిలో వాడుకలో లేదు.

మరికొన్ని విమానయాన సంస్థలు విమానం వెనక్కి వెళ్లేందుకు వెనుక వైపున ట్రక్కు ద్వారా లాగిస్తారు. ఇది సాధ్యమేనంటారా అని అడిగితే, ఖచ్చితంగా సాధ్యమని చెప్పవచ్చు. ప్రస్తుతం చాలా ఈ పద్దతిని పాటిస్తున్నారు.
Trending DriveSpark Telugu YouTube Videos
Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here


Click it and Unblock the Notifications








