మీ కారు స్టీరింగ్ వీల్ షేక్ అవుతోందా? అయితే, కారణం ఏంటో తెలుసుకోండి!

మన కారుతో మన గమ్యాలను సురక్షితంగా చేరుకోవాలంటే, సదరు కారు విషయంలో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మనం మన కారుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, అది మన ప్రయాణాన్ని అంత సురక్షితం చేస్తుంది. కారు మెయింటినెన్స్, సర్వీస్ మరియు మరమ్మత్తుల విషయంలో అజాగ్రత్త వహిస్తే, ఆ తర్వాతి పరిణామాలకు భారీ మూల్యమే చెల్లించాల్సి రావచ్చు.

మీ కారు స్టీరింగ్ వీల్ షేక్ అవుతోందా? అయితే, కారణం ఏంటో తెలుసుకోండి!

నిరంతరం కదిలే మెకానికల్ భాగాలు కలిగిన కారులో ఎప్పుడైనా ఏ సమస్య అయినా రావచ్చు. ప్రత్యేకించి ఇంజన్, చక్రాలు మరియు స్టీరింగ్ వీల్ వంటి కదిలే భాగాల్లో వచ్చే సమస్యలను తాత్సారం చేయకూడదు. సాధారణంగా, కారుకి ఇంజన్ గుండె అయితే స్టీరింగ్ వీల్ మెదడు లాంటిది. ఈ స్టీరింగ్ సాయంతోనే మనం కారు కదలికలను నియంత్రించవచ్చు.

మీ కారు స్టీరింగ్ వీల్ షేక్ అవుతోందా? అయితే, కారణం ఏంటో తెలుసుకోండి!

అయితే, కొన్ని సందర్భాల్లో కారు స్టీరింగ్ వీల్ అప్రయత్నంగా వణుకుతున్నట్లుగా (స్టీరింగ్ వీల్ షేకింగ్) అనిపిస్తుంటుంది. కారు స్టీరింగ్ వీల్ వణుకడానికి సంబంధించి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మీ కారు స్టీరింగ్ వీల్ షేక్ అవుతోందా? అయితే, కారణం ఏంటో తెలుసుకోండి!

1. టైర్ల బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం

కారు స్టీరింగ్ వీల్ షేక్ అవ్వడానికి సదరు కారు టైర్లు కూడా కారణం కావచ్చు. నిజానికి ఇది చాలా సాధారణమైన కారణం. కారుని ఎక్కువగా గుంతలతో కూడిన రోడ్డుపై నడపడం వలన దాని టైర్లు బ్యాలెన్స్ తప్పిపోయి, ఆ ప్రభావాన్ని స్టీరింగ్ వీల్ మీదకి నెట్టి వేస్తాయి. ఫలితంగా కారు స్టీరింగ్ వీల్ వణుకుతున్నట్లుగా అనిపిస్తుంది.

మీ కారు స్టీరింగ్ వీల్ షేక్ అవుతోందా? అయితే, కారణం ఏంటో తెలుసుకోండి!

మీ కారు టైర్లు బ్యాలెన్స్ తప్పిపోయి ఉన్నట్లయితే, మీరు తక్కువ వేగంతో కారును నడుపుతున్నప్పుడు స్టీరింగ్ షేకింగ్‌ను తక్కువగా అనుభూతి చెందుతారు. కాని, అధిక వేగంతో అంటే సుమారు గంటకు 80 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో కారును నడుపుతున్నప్పుడు మీ కారు స్టీరింగ్ వీల్ వణుకుతున్నట్లుగా అనిపిస్తుంది.

మీ కారు స్టీరింగ్ వీల్ షేక్ అవుతోందా? అయితే, కారణం ఏంటో తెలుసుకోండి!

ఈ సమస్యను నివారించడానికి మీరు మొదటగా మీ కారు యొక్క అన్ని టైర్లు సరిగ్గా గాలితో నింపబడి ఉన్నాయో లేదా అని చెక్ చేసుకోవాలి. కారు యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ టైర్లలో తక్కువ గాలి ఉంటే, ఆ కారు బ్యాలెన్సింగ్ సరిగ్గా ఉండదు. టైర్లలో గాలి నింపిన తర్వాత కూడా ఈ సమస్య ఇలానే ఉన్నట్లయితే, మంచి టెక్నీషియన్‌తో టైర్ బ్యాలెన్సింగ్ చేయించుకోవడం అవసరం.

మీ కారు స్టీరింగ్ వీల్ షేక్ అవుతోందా? అయితే, కారణం ఏంటో తెలుసుకోండి!

2. బ్రేక్ రోటర్లతో సమస్య

మీరు మీ కారు యొక్క బ్రేక్‌ను నొక్కినప్పుడు దాని స్టీరింగ్ వీల్ వణుకుతున్నట్లు అనిపిస్తే, దాని బ్రేక్ రోటర్లు లోపభూయిష్టంగా ఉన్నాయని అర్థం. మరో మాటలో చెప్పాలంటే, బ్రేక్ రోటర్లు అరగడం మొదలుపెట్టాయని అర్థం. బ్రేక్ రోటర్లు ఎక్కువగా అరిగిపోవటం వలన అవి వాటి ఆకారాన్ని కోల్పోతాయి, ఫలితంగా ఆ ప్రభావం స్టీరింగ్ వీల్‌పై కనిపిస్తుంది. కాబట్టి, ఈ సమస్యను నివారించడానికి, మీరు మీ కారులోని లోపభూయిస్టమైన బ్రేక్ రోటర్లను త్వరగా మార్చుకోవాల్సి ఉంటుంది.

మీ కారు స్టీరింగ్ వీల్ షేక్ అవుతోందా? అయితే, కారణం ఏంటో తెలుసుకోండి!

ఒకవేళ, మీరు మీ కారులో ఇటీవలే కొత్త బ్రేక్‌లను ఇన్‌స్టాల్ చేసినట్లయితే, ఆ తర్వాత కూడా బ్రేక్‌లను అప్లయ్ చేసినప్పుడు మీరు స్టీరింగ్ వీల్ షేకింగ్ ఫీల్‌ను అనుభవిస్తున్నారు. అటువంటి సందర్భాల్లో ఇది తీవ్రమైన సమస్యకు సంకేతమని మీరు గుర్తించాలి. దీనికి ప్రధానం కారణం బ్రేక్ రోటర్లను సరిగ్గా అమర్చకపోవడమే. ఈ సమస్యను కూడా వెంటనే టెక్నీషియన్‌తో సరిచేయించుకోవాలి.

మీ కారు స్టీరింగ్ వీల్ షేక్ అవుతోందా? అయితే, కారణం ఏంటో తెలుసుకోండి!

3. అరిగిపోయిన సస్పెన్షన్ భాగాలు

టైర్ మరియు బ్రేక్ రోటర్స్ వంటి సమస్యలే కాకుండా అరిగిపోయిన సస్పెన్షన్లు మరియు అలైన్‌మెంట్ సమస్యలు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ వీల్ షేకింగ్‌కు కారణం అవుతుంటాయి. కొత్త వాహనాలతో పోలిస్తే, పాత వాహనాల్లో అరిగిపోయిన బాల్ జాయింట్ లేదా టై రాడ్ కారణంగా సదరు కారు యొక్క స్టీరింగ్ వీల్ షేక్ అవుతూ ఉంటుంది.

మీ కారు స్టీరింగ్ వీల్ షేక్ అవుతోందా? అయితే, కారణం ఏంటో తెలుసుకోండి!

సాధారణంగా, కారుని కొన్ని సంవత్సరాలు ఉపయోగించిన తర్వాత ఆ కారు యొక్క సస్పెన్షన్ యొక్క భాగాలు వదులుగా మారవచ్చు లేదా అందులోని భాగాలు అరిగిపోయి ఉండవచ్చు. ఈ సమస్యను గుర్తించడానికి, మీరు మీ కారును గంటకు 70 కిలోమీటర్ల లేదా అంతకంటే ఎక్కువ వేగంతో నడిపినప్పుడు, కారు లోపల మీరు తీవ్రమైన వైబ్రేషన్‌ను అనుభవించడం ప్రారంభిస్తారు. ఒకవేళ ఈ సమస్యను గుర్తించినట్లయితే, వెంటనే సస్పెన్షన్‌ను రీట్యూన్ చేసుకోవటం లేదా రీప్లేస్ చేసుకోవటం చేయాలి.

Most Read Articles

English summary
Do You Feel Like Your Car Steering Wheel Is Shaking? Lets Find Out What Causes! Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X