బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారుతో దుబాయ్ పోలీసుల గస్తీ!

By Ravi

ప్రపంచంలో ఎక్కడ ఏ సూపర్ కార్ విడుదలైనా అది దుబాయ్ పోలీసుల కార్ కలెక్షన్‌లోకి వచ్చి చేరాల్సిందేనేమో. ఇటీవలే రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును తమ కలెక్షన్‌లోకి చేర్చుకున్న దుబాయ్ పోలీసులు తాజాగా బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారును కూడా తమ లగ్జరీ/సూపర్ కార్ కలెక్షన్‌లోకి చేర్చుకున్నారు.

దుబాయ్ పోలీసుల వద్ద ఇప్పటికే ఫెరారీ, బుగాటి, ఆస్టన్ మార్టిన్, బిఎమ్‌డబ్ల్యూ, బెంట్లీ, మెర్సిడెస్ బెంజ్, కొయినిగ్‌సెగ్ వన్:1, బార్బస్, టొయోటా ల్యాండ్ క్రూజర్, లెక్సస్, మెక్ లారెన్, షెవర్లే కమారో, లాంబోర్గినీ, హమ్మర్ వంటి లగ్జరీ మరియు సూపర్ కార్ కంపెనీలకు చెందిన సూపర్‌కార్లు, వేగవంతమైన కార్లు, స్పోర్ట్స్ కార్లతో పాటుగా పలు సూపర్‌బైక్‌లు కూడా ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారుకి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకోండి..!

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారులో ఓ పెట్రోల్ ఇంజన్, ఓ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇందులోని 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పవర్‌ను డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్ రియర్ యాక్సిల్ (వెనుక చక్రాల)‌కు చేరవేస్తుంది. అలాగే, ఇందులో అమర్చిన 125 హార్స్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ ఫ్రంట్ యాక్సిల్ (ముందు చక్రాల)కు పవర్‌ను చేరవేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు

ఈ కారులోని పెట్రోల్ ఇంజన్ ఇంజన్ 231 హెచ్‌పిల శక్తిని, ఎలక్ట్రిక్ మోటార్ 131 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కలిసి మొత్తం గరిష్టంగా 362 హెచ్‌పిల శక్తిని, 550 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు కేవలం 4.4 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు కాబట్టి, ఈ కారును పూర్తిగా పెట్రోల్ ఇంజన్‌తో కానీ లేదా పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో కానీ లేదా రెండింటిని కలిపి ఒకేసారిగా కానీ ఉపయోగించి డ్రైవ్ చేయవచ్చు. బిఎమ్‌డబ్ల్యూ తమ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారును పూర్తిగా కార్బన్ ఫైబర్ బాడీతో తయారు చేసింది. దీని మొత్తం బరువు 1490 కిలోలు.

Most Read Articles

English summary
The Dubai police force have fast supercars like Ferrari's, exclusive and limited edition cars like the Aston Martin One-77, superfast road legal car like the Bugatti Veyron, and the latest addition-the BMW i8.
Story first published: Thursday, March 12, 2015, 12:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X