Just In
Don't Miss
- News
కృష్ణాబోర్డుపై జగన్‌కు షాకిచ్చిన కేసీఆర్- విశాఖకు తరలింపుపై అభ్యంతరం- బోర్డుకు లేఖ
- Movies
అఖిల్‌కు భారీ షాకిచ్చిన మోనాల్: తన అసలు లవర్ పేరు చెప్పి ఎమోషనల్.. మొత్తం రివీల్ చేసింది!
- Lifestyle
ప్రతి రాశిచక్రం వారి చింతలను ఎలా నిర్వహించాలో తెలుసా? భాదల నుండి ఇలా భయటపడాలి
- Sports
Brisbane Test: పాపం శుభమన్ గిల్.. తృటిలో సెంచరీ మిస్!!
- Finance
మారుతీ సుజుకీ కార్ల ధరల షాక్, కార్లపై రూ.34,000 వరకు పెంపు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి
ఇటీవల కాలంలో విమాన ప్రయాణం చాలా సాధారణమైనది మారినప్పటికీ, చాలా మంది సాధారణ ప్రజలకు ఇందులో ప్రయాణఇంచాలని జీవితకాల ఆశయం. ఇందులో కొంతమంది ప్రీమియం విమానంలో వెళ్లాలని కలలుకంటున్నారు. సాధారణంగా ప్రీమియం విమానాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

ప్రీమియం విమానం చాలా లగ్జారీగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రీమియం విమానం ఒక స్టార్ హోటల్ లాంటిది. పెద్ద వ్యాపారవేత్తలు మరియు లక్షాధికారులు తమ ప్రయాణాలకు ప్రీమియం విమానాలను ఎంచుకుంటారు.

ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఎమిరేట్స్ తన ప్రీమియం ఎ 380 విమానాల ఫోటోలను ఇటీవల విడుదల చేసింది. ప్రపంచంలోని చాలామంది గొప్ప వ్యాపారవేత్తలను మరియు ధనికులను ఆకర్షించడానికి ఈ ఫోటోలు విడుదల చేయబడ్డాయి. ఈ విమానంలో అన్ని ప్రీమియం సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

ఈ విమానంలో సౌకర్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ విమానం యొక్క ప్రతి సీటుకు ప్రత్యేక టీవీ స్క్రీన్‌తో సహా అనేక లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. ఈ విమానంలో మొత్తం 56 సీట్లు ఉన్నాయి. ఈ విమానంలో కొన్ని స్పెషల్ రైళ్లలో మాదిరిగా ప్రైవేట్ రూమ్ మరియు కెప్టెన్ సీటు కూడా ఉన్నాయి.

ఈ విమానంలో ప్రయాణీకులు ప్రశాంతంగా మరియు ఒంటరిగా కూడా వుండే అవకాశం ఉంది. ఈ విమానంలో స్పెషల్ టాయిలెట్ మరియు వాష్‌బేసిన్ ఉన్నాయి. ఈ విమానానికి లగ్జరీ స్టార్ హోటళ్లలో అందించబడే మినీ బార్స్ కూడా అందించబడతాయి.
MOST READ:నడిరోడ్డుపై జరిగిన ఈ సంఘటన చూస్తే ఒళ్ళు ఝల్లుమంటుంది.. కావాలంటే ఈ వీడియో చూడండి

ప్రయాణీకులను అతిథులుగా వ్యవహరించడానికి ఎయిర్ హోస్టెస్‌లను నియమిస్తారు. అదనంగా ప్రతి సీటులో ఆహారాన్ని నిల్వ చేయడానికి ఒక టేబుల్ కూడా అందించబడుతుంది.

ప్రైవేట్ సీట్ల కోసం ప్రత్యేకమైన టేబుల్ మరియు టీవీ సెట్ సౌకర్యం కల్పించారు. ఇందులో ఉన్న 13.3 ఇంచెస్ టీవీ స్క్రీన్ ప్రయాణికులకు మ్యూజిక్, సినిమాలు మరియు వార్తలతో సహా పలు రకాల వినోద ఎంపికలను ఆస్వాదించడానికి అనుకూలంగా ఉంటుంది.
MOST READ:దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

ఇందులో ప్రతి సీటుకి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్స్, ఎసి కంట్రోల్ మరియు ల్యాప్‌టాప్‌లను ఛార్జ్ చేయడానికి ప్లగ్ పాయింట్లు అందించబడతాయి. ఈ విమానంలోని సీట్లను 6 విధాలుగా సర్దుబాటు చేయవచ్చని చెబుతున్నారు. ఈ విమానంలో లెదర్ బ్లాంకెట్ కూడా అందించబడుతుంది. ఈ సీట్లు తల, చేయి మరియు లెగ్ రెస్ట్ కోసం ప్రత్యేక స్పాంజ్లు మరియు దిండ్లు అందిస్తాయి.

ఈ విమానంలో ప్రయాణించేవారు ఖచ్చితంగా ఒక స్టార్ హాటల్ అనుభవాన్ని పొందటం ఖాయం. ఇప్పుడు విడుదలైన ఫోటోలను గమనించినట్లయితే జీవితంలో ఒక్కసారైనా ఈ విమానంలో ప్రయాణించాలని అనిపిస్తుంది. నిజంగానే ఈ విమానం ఒక ఇంద్రభవనం లాగా కనిపిస్తుంది.
MOST READ:ఒకటి, రెండు కాదు ఏకంగా 80 పోర్స్చే కార్లను కలిగి ఉన్న 80 ఏళ్ళ వ్యక్తి ; పూర్తి వివరాలు