తన ఖరీదైన కారుతో ఫోటోలకు ఫోజులిచ్చిన శిఖర్ ధావన్.. ఆ కారు ఖరీదెంతో తెలుసా?

క్రికెట్ స్టేడియంలో అనేక సార్లు తన సత్తా చాటిన ఇండియన్ బ్యాట్స్‌మెన్స్ 'శిఖర్ ధావన్' గురించి దాదాపు అందరికి తెలుసు. అయితే 'శిఖర్ ధావన్' ఇతర క్రికెటర్స్ మాదిరిగానే ఖరీదైన లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. కాగా ఇతని వద్ద ఉన్న బిఎండబ్ల్యు ఎమ్8 కూపే గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఖరీదైన కారు పక్కన ఫోటోలకు ఫోజులిచ్చిన శిఖర్ ధావన్

శిఖర్ ధావన్ గ్యారేజిలో ఉన్న ప్రముఖ జర్మన్ లగ్జరీ కారు 'BMW M8 కూపే' చాలా రోజులకు ముందే కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. BMW M8 కూపే అనేది భారతదేశంలో కంపెనీ విక్రయిస్తున్న అత్యంత శక్తివంతమైన కార్లలో ఒకటి. ఇది అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన పరికరాలను కలిగి ఉంటుంది.

ఖరీదైన కారు పక్కన ఫోటోలకు ఫోజులిచ్చిన శిఖర్ ధావన్

దేశీయ మార్కెట్లో BMW కంపెనీ తన M8 కూపే లగ్జరీ కారుని 2020 లో విడుదల చేసింది. ఇది అద్భుతమైన పర్ఫామెన్స్ అందించే విధంగా రూపొందించబడింది. కావున భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న BMW కూపే కార్లలో M8 ఉత్తమమైనది. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటు, యాంబియంట్ లైటింగ్, హర్మాన్ సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

ఖరీదైన కారు పక్కన ఫోటోలకు ఫోజులిచ్చిన శిఖర్ ధావన్

అంతే కాకుండా BMW M8 కూపేలో స్పోర్ట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆపిల్ కార్ ప్లే, BMW డిస్ప్లే కీ, పార్క్ అసిస్ట్ ప్లస్, హెడ్‌లైట్, టెయిల్ లైట్, డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఫాగ్ లైట్, ఎల్ఈడీ లైట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనం వినియోగదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటాయి.

ఖరీదైన కారు పక్కన ఫోటోలకు ఫోజులిచ్చిన శిఖర్ ధావన్

శిఖర్ ధావన్ కొనుగోలు చేసిన BMW M8 కూపే 2 డోర్స్ మాత్రమే కలిగి ఉంటుంది. అయినప్పటికీ ఇది విశాలంగా ఉంటుంది. ఈ లగ్జరీ కారు పొడవు 4,867 మిమీ, 1,907 మిమీ వెడల్పు, 1,362 మిమీ ఎత్తు మరియు వీల్‌బేస్ పొడవు 2827 మిమీ వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 130 మిమీ కాగా.. BMW M8 కూపే బరువు 1960 కేజీల వరకు ఉంటుంది. దాదాపు 2 వేల కేజీల బరువున్నప్పటికీ BMW M8 కూపే మంచి పనితీరుని అందిస్తుంది.

ఖరీదైన కారు పక్కన ఫోటోలకు ఫోజులిచ్చిన శిఖర్ ధావన్

BMW M8 కూపేలో 4.4 లీటర్ వి8 ట్విన్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 592 బిహెచ్‌పి పవర్ మరియు 750 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ స్టెప్ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ సిస్టం ఇంజిన్ శక్తిని కారు యొక్క నాలుగు చక్రాలకు ప్రసారం చేస్తుంది. ఈ కారు కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతమవుతుంది.

ఖరీదైన కారు పక్కన ఫోటోలకు ఫోజులిచ్చిన శిఖర్ ధావన్

మైలేజ్ విషయానికి వస్తే, ఇది లీటరుకు 9.52 కిమీ మైలేజీని అందిస్తుంది. ఇది ARAI సర్టిఫైడ్ మైలేజ్. BMW M8 కూపే 2-డోర్స్ మోడల్, కావున ఈ కారులో గరిష్టంగా నలుగురు వ్యక్తులు మాత్రమే ప్రయాణించవచ్చు. ఈ కారు 420 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంది. BMW M8 కూపేకి 68 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్ ఇవ్వబడింది. ఈ కారు ఒక ఫుల్ ట్యాంక్ తో దాదాపు 600 కిమీ వరకు ప్రయాణిస్తుంది.

ఖరీదైన కారు పక్కన ఫోటోలకు ఫోజులిచ్చిన శిఖర్ ధావన్

BMW M8 కూపేలోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో మొత్తం 6 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు సీట్ బెల్ట్ అలారం వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఈ లగ్జరీ కారు ధర సుమారు రూ. 2 కోట్లు వరకు ఉంటుంది.

ఖరీదైన కారు పక్కన ఫోటోలకు ఫోజులిచ్చిన శిఖర్ ధావన్

శిఖర్ ధావన్ BMW M8 కూపేతో పాటు Mercedes GL350, Audi కంపెనీ యొక్క Q7 ను కూడా కలిగి ఉన్నాడు. నిజానికి భారతీయ క్రికెటర్లలో చాలామంది ఒకటికంటే ఎక్కువ ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఒకటికంటే ఎక్కువ లగ్జరీ కార్లను కలిగిన క్రికెటర్ల జాబితాలో ఇప్పుడు శిఖర్ ధావన్ కూడా ఒకరుగా నిలిచారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Famous indian cricketer shikhar dhawan poses with bmw m8 coupe details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X