చరిత్రలో ఈరోజు: లాంబోర్గినీ ఫౌండర్ 'ఫెరుషియో' బర్త్‌డే

By Ravi

కాల గర్భంలో కలిసిపోయిన ఎన్నో అద్భుతాలను మన ముందుకు తీసుకువచ్చేదే చరిత్ర. సింపుల్‌గా 'గతాన్ని' మనం చరిత్ర అని చెప్పుకోవచ్చు. అలాంటి చరిత్రలో ఎందరో మహానుభావులు, కళాకారు, మేధావులు, విశేషాలు, వింతలు, సంస్కృతులు ఇలా ఎన్నో అంశాలున్నాయి. ఈనాటి మన 'చరిత్రలో ఈరోజు' అనే శీర్షికలో లాంబోర్గినీ సంస్థ గురించి, ఆ సంస్థను స్థాపించిన వ్యక్తి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం రండి.

లాంబోర్గీనీ సంస్థ యజమాని పేరు ఫెరుషియో లాంబోర్గినీ (Ferrucio Lamborghini). ఈయన ఏప్రిల్ 28, 1916వ తేదీన జన్మించారు. అంటే 98 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున అన్నమాట. ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న అందమైన మరియు అత్యంత ఖరీదైన లాంబోర్గినీ కార్ల వెనుక ఓ పెద్ద రివేంజ్ స్టోరీనే ఉంది. అదేంటంటే...

ఫెరుషియో లాంబోర్గినీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మిగిలిపోయిన మిలటరీ వాహనాల నుంచి ట్రాక్టర్లను తయారు చేసే కంపెనీ ప్రారంభించాడు. ఆ తర్వాత ఎయిర్-కండిషనింగ్, హీటింగ్ సిస్టమ్‌లను తయారు చేయటం ప్రారంభించాడు. ఫెరుషియో చేసిన ఈ వ్యాపారాలు అనూహ్యంగా విజయాన్ని సాధించడంతో ఆయనకు ఎనలేని సంపద వచ్చి చేరింది.

ఫెరుషియో ధనవంతుడు కావటంతో అనేక సూపర్ కార్లను కొనుగోలు చేశాడు, వాటిలో ఫెరారీ 250జిటి కూడా ఒకటి. ఈ ఫెరారీ కారులో క్లచ్ సమస్య ఉండేది, ఇది ఫెరుషియోని ముప్పు తిప్పలు పెట్టేది. అతను ఇదే విషయాన్ని ఎన్జో ఫెరారీ (ఫెరారీ వ్యవస్థాపకుడు) దృష్టికి తీసుకువెళ్లగా, ఫెరుషియో ఓ ట్రాక్టర్ తయారీదారుడని, సమస్య కారుతో కాదు, డ్రైవర్‌తోనని ఎన్జో ఫెరారీ హేళన చేశాడట.

ఈ విషయంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఫెరుషియో లాంబోర్గినీ, ఫెరారీ సంస్థ మీద కోపంతో తానే స్వతగాహా కార్ల తయారీని ప్రారంభించాలని తలచాడు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు, 1963లో ఆటోమొబిలి లాంబోర్గినీ అనే సంస్థను శాంటా అగటా బొలోగ్‌నెసెలో స్థాపించాడు. అదే సంవత్సరంలో లాంబోర్గినీ 350 జిటివి అనే తొలి స్పోర్ట్స్ కారును కూడా విడుదల చేశారు.

లాంబోర్గినీ లోగో కోసం దున్నపోతు (బుల్)ను ఎంచుకున్నారు. ఆ తర్వాత అనేక ఫైటింగ్ బుల్స్ నుంచి స్ఫూర్తి లాంబోర్గినీ కార్లకు పేర్లను పెట్టారు (ఇప్పటికీ ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు). మియురా, కౌంట్‌నాచ్ వంటి అనేక దిగ్గజ కార్లను లాంబోర్గినీ తయారు చేసింది. కానీ, 1973లో ఏర్పడిన చమురు మాంద్యం కారణంగా, ఫెరుషియో లాంబోర్గినీ కంపెనీలో పూర్తి వాటాను అమ్మేశాడు.

చమురు మాంద్యం కారణంగా అప్పట్లో చాలా మంది కార్ ప్రియులు తమ హై-పెర్ఫార్మెన్స్ కార్లకు స్వస్తి చెప్పి, ఆర్థికంగా తక్కువ బడ్జెట్‌లో ఉండి మరియు ఎక్కువ మైలేజీనిచ్చే వాహనాల వైపుకు మళ్లారు. లాంబోర్గినీ సంస్థను 1990 చివరి దశకంలో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ హస్థగతం చేసుకోవడానికి ముందు ఇది అనేక చేతులు మారింది. లాంబోర్గినీ ఫెరుషియో ఫిబ్రవరి 28, 1993లో తన 76వ ఏట కాలం చేశారు. లాంబోర్గినీ ఉత్పత్తి చేసిన కొన్ని లెజండరీ కార్లను, మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ ఫొటో ఫీచర్‌లో చూడండి.

లాంబోర్గినీ మోడళ్ల చరిత్ర

తర్వాతి స్లైడ్‌లలో లాంబోర్గినీ మోడళ్లు మరియు వాటి చరిత్రను చదవండి.

లోంబోర్గినీ మియురా

లోంబోర్గినీ మియురా

ఈ గార్జియస్ లోంబోర్గినీ మియురా కారును 1996 నుంచి 1973 మధ్య కాలంలో ఉత్పత్తి చేశారు. అప్పట్లో ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే కారుగా ఉండేది. హై-పెర్ఫార్మెన్స్, మిడ్-ఇంజన్డ్, టూ-సీటర్ స్పోర్ట్స్ కార్ల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టుంది ఈ మోడలే.

మార్సెల్లో-గాండిని డిజైన్ ఈ కారును 1996 జెనీవా ఆటో షోలో ప్రదర్శించినప్పుడు, దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. ఏడేళ్ల పాటు ఉత్పత్తిలో కొనసాగిన ఈ కారు సుమారు 740 యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది.

లాంబోర్గినీ ఎస్పడా

లాంబోర్గినీ ఎస్పడా

లాంబోర్గినీ ఎస్పడా కారును తొలిసారిగా 1967 జెనీవా ఆటో షోలో ప్రదర్శించారు, ఆ తర్వాతి ఇది ఉత్పత్తి దశకు చేరుకున్నప్పుడు మొత్తం 1217 కార్లను మాత్రమే తయారు చేశారు. అయినప్పటికీ, ఆ రోజుల్లో అత్యంత సక్సెస్‌ఫుల్ మోడల్‌గా ఉండేది. లాంబోర్గినీ ఎస్పడా పేరులో ఎస్పడా అంటే పోర్చుగీసు భాషలో కత్తి అని అర్థం, బుల్‌ఫైటర్లు దున్నపోతులను చంపేందుకు ఉపయోగించే కత్తిగా దీనిని రెఫర్ చేసే వాళ్లు.

ఈ కారును మార్సెల్లో గాండినీనే డిజైన్ చేశారు. ఇదొక 4-సీటర్ కారు. ఇందులో 4.0 లీటర్, 325 బిహెచ్‌పి, వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. అప్పట్లోనే ఇది మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కూడా లభ్యమయ్యేది. అప్పట్లో ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తొలుతగా అందుబాటులో ఉన్న వాటిల్లో ఒకటి, ఎది ఎక్కువ టార్క్‌ను అందించేందుకు సహకరించేంది.

లాంబోర్గినీ ఉర్రాకో

లాంబోర్గినీ ఉర్రాకో

ఫెరుషియో లాంబోర్గినీ 1960లో కాంపాక్ట్ సూపర్ కారును నిర్మించాలన్న ప్రతిష్టాత్మ కలకు నిదర్శనమే ఈ లాంబోర్గినీ ఉర్రాకో. అప్పట్లో ఫెరారీ డినో 246 జిటి, పోర్షే 911 వంటి కార్లకు పోటీనిచ్చేలా దీనిని తయారు చేశారు. అయితే, ఇది ఫెరారీ డినో 246 జిటి మోడల్‌కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ పోర్షే 911 పోటీ ముందు నిలబడలేకపోయింది.

అందుకే, ఆటోమొబిలి లాంబోర్గినీ ఆశించిన రీతిలో ఇది అమ్మడుపోలేకపోయింది. అంతేకాకుండా, ఈ కారు కోసం రెండేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉండటం, ఇంటీరియర్స్ బాగోలేవని విమర్శలు రావటం కూడా దీని వైఫల్యానికి కారణం అయ్యాయి.

లాంబోర్గినీ కౌంటాచ్

లాంబోర్గినీ కౌంటాచ్

ఒక్క లుక్‌లోనే చెప్పేయొచ్చు ఈ లాంబోర్గినీ కౌంటాచ్ 1980లో ఎందుకు అల్టిమేట్ పోస్టర్-కారుగా ఉండేదోనని. అప్పట్లో ఇలాంటి కారును ఎవ్వరూ చూడలేదు. సిజర్ డోర్స్, యాంగ్యులర్ స్టైలింగ్‌తో ఇది ధనవంతుల తొలి ఎంపికగా ఉండేది.

ఈ కారులో 455 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 5.2 లీటర్, వి-12 ఇంజన్‌ను ఉపయోగించారు. దీనిని తొలిసారిగా 1971లో జరిగిన జెనీవా ఆటో షోలో ప్రదర్శనకు ఉంచారు. ఈ కారను 1974 నుంచి 1990 మధ్య కాలం వరకు ఉత్పత్తి చేశారు. ఆ సమయంలో ఇవి 1840 యూనిట్లు అమ్ముడుపోయాయి.

లాంబోర్గినీ హాల్పుహ్

లాంబోర్గినీ హాల్పుహ్

లాంబోర్గినీ జల్పా ('హాల్-పుహ్' అని పలకాలి) కారును లాంబోర్గినీ సిల్‌హౌటె కారును (సిల్‌హౌటెను ఉర్రాకో సిల్‌హౌటె ఆధారంగా చేసుకొని తయారు చేస్తే, ఉర్రాకో సిల్‌హౌటెను ఉర్రాకో 1973 మోడల్ ఆధారంగా చేసుకొని తయారు చేశారు) ఆధారంగా చేసుకొని తయారు చేశారు.

లాంబోర్గినీ హాల్పుహ్ 7.3 సెకండ్ల వ్యవధిలో గరిష్టంగా గంటకు 60 మైళ్ల వేగాన్ని అందుకుంటూ, అప్పట్లో స్టార్ పెర్ఫార్మెర్‌గా ఉండేది. దీని గరిష్ట వేగం గంటకు 161 మైళ్లు. లాంబోర్గినీ మోస్ట్ సక్సెస్‌ఫుల్ వి-8 మోడల్‌గా ఇది నిలిచింది. దీని జీవిత కాలంలో మొత్తం 420 కార్లు తయారయ్యాయి.

లాంబోర్గినీ ఎల్ఎమ్002

లాంబోర్గినీ ఎల్ఎమ్002

లాంబోర్గినీ ఇటీవల ఆవిష్కరించిన యూరస్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌కు ముందు ఎలాంటి ఎస్‌యూవీని తయారు చేయలేదు. కానీ, అప్పట్లో 'రాంబో లాంబో' అనే తొలి ఫోర్-వీల్ డ్రైవ్ మోడల్‌ను మాత్రం తయారు చేసింది. లాంబోర్గినీ 1977లో ఉత్పత్తి చేసిన చీతా ప్రోటోటైప్‌ను ఆధారంగా చేసుకొని ఎల్ఎమ్002ను తయారు చేశారు. అమెరికా మిలిటరీకి విక్రయించాలనే ఉద్దేశ్యంతో దీనిని తయారు చేశారు.

ఒరిజినల్ కారులో వెనుకవైపు ఉంజన్ ఉంటే, ఈ కారులో అనేక సార్లు టెస్ట్ చేసి, మోడిఫై చేసిన తర్వాత ముందు వైపు ఇంజన్‌ను అమర్చారు. పెద్ద పీరెల్లీ టైర్లు, యాంగ్యులర్ స్టైలింగ్, ట్యూబ్లర్ బంపర్స్, లాంబోర్గీనీ కౌంటాచ్ వి12 ఇంజన్‌తో దీనిని తయారు చేశారు. కానీ ఇది పూర్తిస్థాయిలో ఉత్పత్తి దశకు చేరుకోలేక, కాన్సెప్ట్‌గానే మిగిలిపోయింది.

Picture credit: Wiki Commons - Detectandpreserve

లాంబోర్గినీ డయాబ్లో

లాంబోర్గినీ డయాబ్లో

లాంబోర్గినీ డయాబ్లో కారును 1990 మరియు 2001 మధ్య కాలంలో ఉత్పత్తి చేశారు. అప్పట్లో గరిష్టంగా గంటకు 200 మైళ్లకు పైగా వేగాన్ని అందుకునేలా తయారు చేసిన తొలి లాంబోర్గినీ కారు ఇది. డయాబ్లో అంటే స్పానిష్‌లో దెయ్యం అని అర్థం.

లాంబోర్గీనీలో అనేక కార్లను డిజైన్ చేసిన మార్సెలో గాండినీనే ఈ డయాబ్లో కారును కూ డిజైన్ చేయాల్సిందిగా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. అయితే, 1987లో ఈ కంపెనీ క్రైస్లర్ హస్తగతం చేసుకున్న తర్వాత, కొత్త యాజమాన్యం ఆ కారు డిజైన్ పట్ల సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత డిజైన్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసి తయారు చేశారు. అప్పట్లో ఇది కూడా మంచి సక్సెస్‌ఫుల్ కారుగా నిలిచింది. ఏకంగా 2989 యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది.

లాంబోర్గినీ ముర్సిలాగో

లాంబోర్గినీ ముర్సిలాగో

ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన ఆడి బ్రాండ్ లాంబోర్గినీని హస్తగతం చేసుకున్న మొట్టమొదటి సారిగా సరికొత్త డిజైన్‌తో తయారు చేసిన కారు ఈ ముర్సిలాగో. ఇదొక టూ-సీటర్ కారు. ఆల్-వీల్ డ్రైవ్ సూపర్ కూపే. మిడ్-మౌంట్ వి-12 ఇంజన్, 572 హార్స్ పవర్ ఈ కారు ప్రత్యేకతలు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మోడ్రన్ డిజైన్, హై ఏరోడైనమిక్ అండ్ కూలింగ్ ఎఫీషియెన్సీ వంటి ఫీచర్లు దీని సొంతం.

లాంబోర్గినీ గల్లార్డో

లాంబోర్గినీ గల్లార్డో

లాంబోర్గినీ చరిత్రలో అత్యంత సక్సెస్‌ఫుల్ కార్లలో గల్లార్డో కూడా ఒకటి. దాదాపు 14,022కు పైగా లాంబోర్గినీ గల్లార్డో కార్లు అమ్ముడుపోయాయి. మొదటి తరం గల్లార్డో కారులో 5.0 లీటర్, వి10 ఇంజన్‌ను ఉపయోగించేవారు. ఇది రెగ్యులర్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ మరియు అడ్వాన్స్డ్ 6-స్పీడ్ ఎలక్ట్రో-హైడ్రాలికల్లీ-కంట్రోల్డ్ ప్యాడల్ షిఫ్ట్ లేదా ఈ-గేర్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమయ్యేది.

లాంబోర్గినీ గల్లార్డో కారును 2003 నుంచి 2014 మధ్య కాలంలో ఉత్పత్తి చేశారు. 2006లో స్పైడర్ అనే కొత్త వేరియంట్‌ను ఇందులో విడుదల చేశారు. ఈ వేరియంట్ యొక్క సాఫ్ట్ టాప్ పూర్‌ను పూర్తిగా తొలగించుకొని, కన్వర్టిబల్ మాదిరిగా మార్చుకోవచ్చు.

లాంబోర్గినీ అవెంటేడర్

లాంబోర్గినీ అవెంటేడర్

అవెంటేడర్‌ను తొలిసారిగా 2011లో జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించారు. పదేళ్ల ముర్సిలాగో కారును రీప్లేస్ చేందుకు అవెంటేడర్‌ను పరిచయం చేశారు. లిమిటెడ్ ఎడిషన్ రెవెన్టన్ మరియు ఎస్టాక్ కాన్సెప్ట్‌ల నుంచి స్ఫూర్తి పొంది దీని బైడీ లైన్స్‌ను డిజైన్ చేశారు.

లాంబోర్గినీ అవెంటేడర్ కారులో పవర్‌ఫుల్ 6.5 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 690 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2.9 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 350 కి.మీ.
చివరి మాట

చివరి మాట

అప్పట్లో తయారైన ఈ లాంబోర్గినీ కార్లలో ఈఎస్‌పి, ఏబిఎస్ లేదా మోడ్రన్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వంటి అధునాతన అసిస్టెన్స్ ఫీచర్లు ఉండేవి కావు. అయినప్పటికీ, వీటి క్రేజ్ మాత్రం ఇప్పటికీ అలానే నిలిచిపోయింది. నేటి ఆధునిక యువతరం ఈ పురాతన లాంబోర్గినీ కార్లను మెచ్చకపోవచ్చేమో కానీ, అప్పటి రోజులను పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఇవి మనకు గొప్పగానే కనిపిస్తాయి.

మీరేమంటారు..?

మీరేమంటారు..?

ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే, ఈ కథనాన్ని మీ మిత్రులతో పంచుకోగలరు.

Most Read Articles

English summary
As a car lover and wealthy entrepreneur, Lamborghini owned a number of sports cars, with the Ferrari 250 GT being one of them. At a certain point, Lamborghini became frustrated with problems he had with the clutch in his Ferrari. He then went to visit Enzo Ferrari.
Story first published: Monday, April 28, 2014, 20:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X