బెంగళూరులో విధ్వంసం సృష్టించిన న్యూ ఫోర్డ్ మస్టాంగ్ జిటి సూపర్ కారు

Written By:

ఇండియాలో సూపర్ కార్ల ప్రమాదానికి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గత రాత్రి(16/06/17) బెంగళూరులో అప్పుడే రిజిస్ట్రేషన్ చేయించుకుని రోడ్డెక్కిన బ్రాండ్ న్యూ ఫోర్డ్ మస్టాంగ్ జిటి సూపర్ కారు తీవ్ర విధ్వంసం సృష్టించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఫోర్డ్ మస్టాంగ్ జిటి యాక్సిడెంట్‌

నూతన ఫోర్డ్ మస్టాంగ్ జిటి సూపర్ కారులో ట్రాఫిక్‌లో ఇతర వాహనాల మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కెటిఎమ్ డ్యూక్ బైకు మస్టాంగ్ మరియు డాట్సన్ గో కార్ల మధ్య ఇరుక్కుపోయింది. డాట్సన్ గో కారు ప్రక్కవైపు నుజ్జునుజ్జయిపోయింది. మస్టాంగ్‌ ముందు వైపు మొత్తం తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది.

ఫోర్డ్ మస్టాంగ్ జిటి యాక్సిడెంట్‌

అక్కడే ఉన్న జనం ప్రమాద ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం కలిగింది. అయితే ప్రమాద తీరును గమనిస్తే కెటిఎమ్ రైడర్‌ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ క్రాష్‌లో ఫోర్డ్ మస్టాంగ్ తప్పిదమని తెలిసింది.

విశ్లేషణ -

విశ్లేషణ -

ప్రమాదం జరిగిన రోజు భారీ వర్షం కురిసింది. సాధారణంగా ఫోర్డ్ మస్టాంగ్ అతి తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పవర్ ఉత్పత్తి చేస్తుంది. తద్వారా సెకన్లలోనే భారీ వేగాన్ని అందుకుంటుంది. కానీ రోడ్లు తడవడం కారణంతో ట్రాక్షన్ అదుపుకాలేకపోయి, ఇతర వాహనాల మీదకు దూసుకెళ్లి ఉండవచ్చు.

ఫోర్డ్ మస్టాంగ్ జిటి యాక్సిడెంట్‌

ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న వాహనాన్ని పరిశీలిస్తే, డాట్సన్ గో మరియు కెటిఎమ్ 390 డ్యూక్ రెండు కూడా ఒకే మార్గంలో జీబ్రా క్రాసింగ్ సూచించే గీతల వద్ద ఆగి ఉన్నాయి. కానీ వ్యతిరేక దిశలో మస్టాంగ్ దూసుకెళ్లి ఆ రెండింటిని ఢీకొట్టింది.

ఫోర్డ్ మస్టాంగ్ జిటి యాక్సిడెంట్‌

అంటే డ్యూక్ బైకు మరియు డాట్సన్ గో కారు డ్రైవర్ ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ కోసం వేచి ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధిక వేగంలో ఉన్నపుడు అదుపు ఇలా విధ్వంసాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. ఈ ప్రమదానికి సంభందించిన అప్‌డేట్స్ కోసం మాతో కలిసి ఉండండి. మస్టాంగ్ క్రాష్ క్రింది వీడియో ద్వారా వీక్షించగలరు...

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియాలో పవర్‌ఫుల్ కొనుగోలు చేసే అవకాశాలు భారీగా పెరిగాయి. ఇది ఇండియన్ ఆటోమోటివ్ సెక్టార్ విలువను పెంచుతున్నప్పటికీ, ప్రమాదాలను కూడా అంతే వేగంగా పెంచుతోంది. ఫోర్డ్ మస్టాంగ్ లోని పవర్ మరియు టార్క్ అమెరికా మరియు యూరప్ దేశాల్లోనే కాదు, ఇండియాలో కూడా భారీ ప్రమాదలను సృష్టిస్తోంది.

ఫోర్డ్ మస్టాంగ్ జిటి యాక్సిడెంట్‌

ఇలాంటి కార్లను కొనుగులు చేయడానికి మరియు విక్రయించడానికి ఎలాంటి సమస్యల్లేవు. అయితే వాటిని డ్రైవ్ చేయడానికి ఇండియన్ రోడ్లు ఇంకా సిద్దంగా లేవు. కాబట్టి ఎంతటి ఖరీదైన మరియు శక్తివంతమైన కార్లను కొనుగోలు చేసినా లిమిటెడ్ స్పీడ్‌తోనే డ్రైవ్ చేయాలి.

English summary
Read In Telugu Brand New Ford Mustang GT Crashes In Bangalore — Devastating Damage Caught On Camera
Story first published: Saturday, June 17, 2017, 12:55 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark