సైరస్ మిస్త్రీ మరణంపై ఫోరెన్సిక్ రిపోర్ట్ : యాక్సిడెంట్ తర్వాత రెండు ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకోలేదు

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంపై ఫోరెన్సిక్ బృందం తమ నివేదికను సమర్పించింది. సెప్టెంబర్ 4, 2022వ తేదీన అహ్మదాబాద్ -ముంబై జాతీయ రహదారిపై జరిగిన ఘోర కారు ప్రమాదంలో సైరస్ మిస్త్రీతో పాటుగా వెనుక సీటులో కూర్చుని ప్రయాణిస్తున్న జహంగీర్ పాండోల్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసినదే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఫోరెన్సిక్ బృందం ప్రమాదానికి గల కారణాలను అధ్యయనం చేసింది.

సైరస్ మిస్త్రీ మరణంపై ఫోరెన్సిక్ రిపోర్ట్ : యాక్సిడెంట్ తర్వాత రెండు ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకోలేదు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన మరియు సురక్షితమైన వాహనాలలో ఒకటైన జిఎల్‌సి ఎస్‌యూవీ, ఈ ప్రమాదంలో తీవ్రంగా డ్యామేజ్ అయింది. ఈ కారు ముందు వైపు నుండి డివైడర్‌ను గుద్దుకోవడంతో తీవ్రంగా డ్యామేజ్ అయింది. అయితే, ప్రమాద సమయంలో ఈ కారు ముందు సీట్లలో కూర్చున్న అనాహిత పండోల్ మరియు ఆమె భర్త డారియస్ పండోల్ సీట్ బెల్టులు ధరించి ఉండటం మరియు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ విచ్చుకోవడంతో వారు చిన్నపాటి గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.

సైరస్ మిస్త్రీ మరణంపై ఫోరెన్సిక్ రిపోర్ట్ : యాక్సిడెంట్ తర్వాత రెండు ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకోలేదు

అయితే, ఆ సమయంలో వెనుక సీటులో కూర్చున్న సైరస్ మిస్త్రీ మరియు డారియస్ పండోల్ సోదరుడు జహంగీర్ పండోల్ మాత్రం సీట్ బెల్టులు ధరించలేదు. అతివేగం మరియు సీట్ బెల్టులు ధరించని కారణంగానే వారిద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాధమికంగా తేల్చినప్పటికీ, ఫోరెన్సిక్ నివేదికలో మాత్రం కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఫోరెన్సిక్ నివేదికలో వెనుక సీటులో ఉన్నవారు సీట్‌బెల్ట్‌లు ధరించకపోవడం మరియు ఎస్‌యూవీలో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటే, వాటిలో రెండు ఓపెన్ కాకపోవడం వంటి విషయాలను నివేదించారు.

సైరస్ మిస్త్రీ మరణంపై ఫోరెన్సిక్ రిపోర్ట్ : యాక్సిడెంట్ తర్వాత రెండు ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకోలేదు

సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంపై ఫోరెన్సిక్ దర్యాప్తులో అహ్మదాబాద్-ముంబై హైవేపై ఓవర్ స్పీడ్, తప్పు ఓవర్‌టేకింగ్ మరియు తగినంత సూచికలు లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణమని తేలింది. అయితే, ఈ క్రాష్ వెనుక ఉన్న సంభావ్య కారణాలలో డ్రైవర్ అలసటగా ఉండటం కూడా ఒక కారణం కావచ్చనే విషయాన్ని ఫోరెన్సిక్ బృందం తోసిపుచ్చింది.

సైరస్ మిస్త్రీ మరణంపై ఫోరెన్సిక్ రిపోర్ట్ : యాక్సిడెంట్ తర్వాత రెండు ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకోలేదు

అతివేగం, ఎడమవైపు నుండి ఓవర్‌టేక్ చేయడం, లేన్‌ను మార్చడం, సీటు బెల్ట్ ధరించకపోవడం మరియు ఏడు ఎయిర్‌బ్యాగ్‌లలో రెండు విచ్చుకోకపోవడం వంటి కారణాల వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. ప్రమాదం జరిగే సమయంలో మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కారు గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని, క్రాష్ జరిగిన సమయంలో ఇంపాక్ట్ స్పీడ్ గంటకు 89 కిలోమీటర్లుగా ఉందని నివేదించారు.

సైరస్ మిస్త్రీ మరణంపై ఫోరెన్సిక్ రిపోర్ట్ : యాక్సిడెంట్ తర్వాత రెండు ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకోలేదు

ఇది భారీ వాహనాలు ప్రయాణించే రహదారి కావడంతో హైవే యొక్క ఈ స్ట్రెచ్‌లో వేగ పరిమితి కేవలం గంటకు 40 కిలోమీటర్లు మాత్రమే సిఫార్సు చేయబడిందని ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు జామెట్రీని మార్చాలని విచారణ కమిటీ సూచించింది. ఇందులో సివిల్ ఇంజనీరింగ్ సంబంధిత లోపాల ఆధారంగా కొన్ని మెరుగుదలలను కూడా సిఫార్సు చేసింది.

సైరస్ మిస్త్రీ మరణంపై ఫోరెన్సిక్ రిపోర్ట్ : యాక్సిడెంట్ తర్వాత రెండు ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకోలేదు

ఈ విషయంపై యూనియన్ రోడ్డు రవాణా కార్యదర్శి గిరిధర్ అరమనే మాట్లాడుతూ, "ఈ రోడ్డు రోజుకు దాదాపు 1.6 లక్షల ప్యాసింజర్ కార్ యూనిట్ల (పిసియులు) లోడ్‌ను కలిగి ఉంది, అందువల్ల వెడల్పు చేయడానికి ఎటువంటి అవకాశం లేదు మరియు సైట్ కూడా పెద్ద మార్పులను చేయడానికి అనుమతించదు. ఒక్క లేన్‌ను మూసివేసినా ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. ఈ మార్గంలో ట్రాఫిక్ పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా వడోదర మరియు ముంబై మధ్య గ్రీన్‌ఫీల్డ్ స్ట్రెచ్‌ను నిర్మిస్తున్నాము. అది అమలులోకి వచ్చిన తర్వాత, ఈ స్ట్రెచ్‌లో ట్రాఫిక్ తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నామని" చెప్పారు.

సైరస్ మిస్త్రీ మరణంపై ఫోరెన్సిక్ రిపోర్ట్ : యాక్సిడెంట్ తర్వాత రెండు ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకోలేదు

ఫోరెన్సిక్ నివేదికపై, అరమనే మాట్లాడుతూ, "విచారణలో, ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. ఈ రోడ్డు మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం హైవే పెట్రోలింగ్ విస్తృతం చేయాలి. రాష్ట్రాలతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో, హైవే పెట్రోలింగ్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేయాలని కూడా మేము వారిని కోరాము" అని అన్నారు.

సైరస్ మిస్త్రీ మరణంపై ఫోరెన్సిక్ రిపోర్ట్ : యాక్సిడెంట్ తర్వాత రెండు ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకోలేదు

ఇక మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యూవీలోని ఎయిర్‌బ్యాగ్‌ల విషయానికొస్తే, యాక్సిడెంట్ తర్వాత డ్రైవర్ వైపు ముందు, మోకాలి మరియు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకున్నప్పటికీ ఎడమ వైపున ఉన్న ఫ్రంట్ కర్టెన్ మరియు వెనుక కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు ఎంగేజ్ కాలేదని విచారణలో తేలింది.

సైరస్ మిస్త్రీ మరణంపై ఫోరెన్సిక్ రిపోర్ట్ : యాక్సిడెంట్ తర్వాత రెండు ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకోలేదు

సెప్టెంబర్ 4, 2022వ తేదీన సైరస్ మిస్త్రీ గుజరాత్‌లోని ఉద్వాడ నుంచి ముంబైకి బయలుదేరారు. కారులో ఆయనతో పాటుగా జహంగీర్ పండోల్ (వెనుక సీటులో ప్రయాణీకుడు), అనహిత పండోల్ (డ్రైవింగ్ సీటులో ఉన్నవారు), డారియస్ పండోల్‌ (ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో ఉన్నవారు)తో కలిసి ప్రయాణిస్తుండగా ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెనుక సీటులో కూర్చున్న సైరస్ మిస్త్రీ మరియు జహంగీర్ పండోల్ ఇద్దరూ మరణించగా, అనాహిత పండోల్ మరియు ఆమె భర్త డారియస్ పండోల్ తీవ్రంగా గాయపడ్డారు. వెనుక సీట్లలో కూర్చున్న సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోలే ఇద్దరూ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని అధికారులు తెలిపారు.

Most Read Articles

English summary
Forensic report on cyrus mistry car accident reveals not all airbags deployed during the crash
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X