వీడియో: ఫార్చ్యూనర్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఢీ - ముగ్గురు దుర్మరణం

Written By:

కొన్ని కోట్ల వాహనాలతో బిజి బిజీగా తిరిగే ఇండియన్ రోడ్ల మీద ప్రతి రోజూ కొన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఒకే కారణంతో ఎక్కువ ప్రమాదాలు సంభవించడం మనం గమనిస్తుంటాం. అందులో ఒకటి టైర్ల పేళుడు. ఎంత పెద్ద వాహనాలైనా టైర్లు పేలితే భారీ ప్రమాదం తప్పదు...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఫార్చ్యూనర్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఢీ

అందుకు ఉదాహరణ, పంజాబ్‌లో అమృత్‌సర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఫార్చ్యూనర్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలు ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు.

ఫార్చ్యూనర్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఢీ

రోడ్డుకు ఆవలివైపు ఎదురుగా వస్తున్న టయోటా ఫార్చ్యూనర్ టైరు పేళడంతో అదుపు తప్పి డివైడర్ దాటుకుని వ్యతిరేక దిశలో ఉన్న రోడ్డు మీదకు దూసుకొచ్చి మహీంద్రా ఎక్స్‌యూవీ500 వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఫార్చ్యూనర్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఢీ

రెండు రోడ్లను వేరు చేస్తూ మధ్యలో గుబురుగా చెట్లు ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ వెహికల్‌ ముందుకు ఫార్చ్యూనర్ షడన్‌దా దూసుకురావడంతో స్పందించి బ్రేకులు వేసే సమయం కూడా లేకపోవడాన్ని వీడియోలో గమనించవచ్చు. బ్రేకులు ప్రెస్ చేసి ఉంటే ఎక్స్‌యూవీ రియర్ లైట్లు వెలిగేవి.

ఫార్చ్యూనర్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఢీ

ఇక్కడ విషాదం ఏమిటంటే మరణించిన ముగ్గురు కూడా ఎక్స్‌యూవీ500లో ఉన్నవారే అని తెలిసింది. ప్రమాదానికి కారణమైన ఫార్చ్యూనర్ వాహనంలో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. అతనికి కూడా తీవ్రగాయాలయ్యాయి. వీరితో పాటు మరో ఐదు మంది ఈ ఘటనలో గాయపడ్డారు.

ఫార్చ్యూనర్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఢీ

ఈ ఘోరమైన ప్రమదాం జాతీయ రహదారి 01 మీద జరిగింది. ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డు మీద ఎక్స్‌యూవీ500తో పాటు కొన్ని టూ వీలర్ల కూడా ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదానికి కారణం టైరు పేళడమే అని తెలిసినా, టైరు ఎలా పేళిందో తెలియరాలేదు.

ఫార్చ్యూనర్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఢీ

ఫార్చ్యూనర్ డ్రైవర్ మత్తులో ఉన్నట్లు గుర్తించానని ఎక్స్‌యూవీ 500లో ప్రయాణించిన షీతల్ అరోరా పోలీసులకు వివరించాడు. అయితే, పోలీసులు దీనిని ధృవీకరించలేదు. కానీ అజాగ్రత్తతో నడిపి ప్రమాదానికి కారణమయ్యాడనే కారణంతో డ్రైవర్ మీద పోలీసులు కేసు నమోదు చేసారు.

నిజానికి టైర్ల ప్రేళుడు వేసవిలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఇండియన్ రోడ్ల మీద వాతావరణ పరిస్థితులకు సంబంధం లేకుండా టైర్లు పేళిపోతున్నాయి. ఫార్చ్యూనర్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500తో ఢీకొనడాన్ని వీడియోలో వీక్షించగలరు...

English summary
Read In Telugu Video: Toyota Fortuner And Mahindra XUV 500 Head-On Collision Leaves Three Dead
Story first published: Friday, June 16, 2017, 17:31 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark