ఈ విమానంలో న్యూ యార్క్ - లండన్ ప్రయాణం 3.5 గంటలు మాత్రమే

విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కుతోందనడానికి మరో ఉదాహరణ ఈ అతి చిన్న కాంకోర్డ్ తరహాలో ఉండే విమనానం. ఇందులో న్యూ యార్క్ నుండి లండన్ ప్రయాణం కేవలం 3.5 గంటలు మాత్రమే.

By Anil

విమానయాన రంగంలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవలాను చాలా కంపెనీలు తహతహలాడుతుంటాయి. అందులో ఒకటి ఏరోస్పేస్ కంపెనీ బూమ్. విమాన ప్రయాణాలు అధిక ప్రాముఖ్యతను సంతరించుకుంటున్న తరుణంలో నూతన ఆవిష్కరణలకు ఒక్కో సంస్థ ఒక్కో కొత్త ఉత్పత్తితో ప్రపంచ ప్రదర్శనకు సిద్దమైపోతుంటాయి. అయితే ఈ సారి స్పేస్ ప్రొడక్ట్స్ తయారీ సంస్థ బూమ్ భవిష్యత్తు యొక్క సబ్ స్కేల్ సూపర్ సోనిక్ ప్యాసింజర్ ప్లేన్‌ను ఆవిష్కరించింది.

కేవలం మూడున్నర గంటల్లో న్యూయార్క్ నుండి లండన్‌ను చేరుకునే సామర్థ్యం గల ఈ విమానం గురించి పూర్తి వివరాలు....

సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్

సబ్ స్కేల్‌లో ఎక్స్‌బి-1 విభాగానికి చెందిన సూపర్ సోనిక్ ప్యాసింజర్ ఎయిర్ లైనర్ ప్రొటోటైప్‌ను ఏరో స్పేస్ ఉత్పత్తుల తయారీ సంస్థ బూమ్ తయారు చేసింది. దీనికి బేబి బూమ్ అనే పేరును కూడా ఖరారు చేశారు.

సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్

ఈ మిని కంకోర్డ్‌గా చెప్పుకునే ఈ ప్రోటోటైప్ సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్ విమానంలో గరిష్టంగా 45 మంది వరకు ప్రయాణించవచ్చు.

సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్

వర్జిన్ గెలాక్టిక్ టైకూన్ అనే కంపెనీ 10 యూనిట్ల మిని కంకోర్డ్ సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్ విమానాలు కావాలని బూమ్ సంస్థకు ఆర్డర్ కూడా ఇచ్చింది.

సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్

ఈ సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్ విమానం గంటకు 2335 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించలగదు. అంటే కాంకోర్డ్ విమానం కన్నా దీని వేగం 160 కిలోమీటర్లు ఎక్కువగా ఉంది. అంటే న్యూయార్క్ నుండి లండన్‌కు ఈ విమానంలో మూడున్నర కాలవ్యవధిలో చేరుకోవచ్చు.

సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్

ఈ ఎక్స్‌వి-1 విమానం సాంకేతికంగా ఫ్యూచర్ బూమ్ ఎయిర్ లైనర్ లో 1/3 వ శాతం పరిమాణంలో ఉంటుంది. అందుకే దీనిని సబ్-స్కేల్ ప్యాసింజర్ జెట్ అంటారు.

సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్

అభివృద్ది దశలో ఉన్న ఈ విమానాన్ని డెన్వర్ లో ఉన్న సెంటినియల్ ఎయిర్ పోర్ట్‌లో ప్రోటోటైప్ ను ప్రదర్శించారు. దీని కంటే ముందు, దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న ఎడ్వర్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద స్పేస్ షిప్ సంస్థ వర్జిన్ గెలాక్టిక్ సమక్షంలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు.

సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్

వర్జిన్ గ్రూప్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్ మాట్లాడుతూ, అత్యంత వేగవంతమైన విమానల ఉత్పత్తికి మేము ఎల్లప్పుడూ సిద్దమే మరియు అలాంటి ఉత్పత్తుల తయారీలో నిరంతరం బూమ్ ఏరో స్పేస్ సంస్థతో కలిసి పనిచేస్తాం అని తెలిపాడు.

సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్

ఇక బూమ్ ఏరో స్పేస్ ఉత్పత్తుల తయారీ సంస్థ మరియు అమెజాన్ ఎక్జ్సిక్యూటివ్ అండ్ సిఇఒ బ్లేక్ స్కోల్ మాట్లాడుతూ, విమానయాన రంగం అత్యంత వేగవంతమైన సాంకేతికతను కలిగి ఉన్నాయి, అయినప్పటీ 1960 ల కాలంలో విమానాలు ప్రయాణించిన అదే వేగంతో ఇప్పటికీ ప్రయాణిస్తున్నాయని తెలిపాడు. అందుకోసం ఈ సూపర్ సోనిక్ ప్యాసింజర్ ప్లేన్‌ని రూపొందించినట్లు ఆయన తెలిపాడు.

సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్

కంకోర్డ్ సంస్థ వద్ద ఈ పరిమాణంలో ఉన్నటువంటి సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్‌ల తయారీ సాంకేతిక పరిజ్ఞానం లేదు. కాబట్టి తక్కువ ప్రయాణికులతో గరిష్ట వేగంతో, గరిష్ట దూరం ప్రయాణించే విమానాలు ఇప్పుడు బూమ్ వద్ద ఉన్నట్లు తెలిపాడు.

సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్

2017 నాటికి పూర్తి స్థాయిలో విడుదల కానున్న ఈ భవిష్యత్ సూపర్ సోనిర్ ప్యాసింజర్ జెట్ విమానాలను, విమానయాన సంస్థలకు అందుబాటులోకి రానున్నాయి.

ఈ విమానం యొక్క సాంకేతిక వివరాలు

ఈ విమానం యొక్క సాంకేతిక వివరాలు

మిని కాంకోర్డ్ విమాంగా పేరొందిన సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్ విమానం బేబీ బూమ్ యొక్క పొడవు 68 అడుగులు, రెక్కల పొడవు 17 అడుగులు మరియు గరిష్టంగా మోయగలిగే బరువు 13,500 కిలోలుగా ఉంది.

సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్

ఇంజన్ పరంగా జనరల్ ఎలక్ట్రిక్ జె85-21 అను మూడు ఇంజన్‌లు కలవు.

వేగం

వేగం

దీని వేగం మ్యాక్ 2.2 గా ఉంది. అంటే గంటకు 1,451 మైళ్లు లేదా గంటకు 2,335 కిలోమీటర్లు.

సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్

  • కేవలం రెండే గంటల్లో ప్రపంచంలోని ఏ మూలకైనా చేరుకోగలదు
  • 4:30 గంటల్లో ముంబాయ్ నుండి న్యూయార్క్ నగరాన్ని చేరుకోండిలా !
  • ప్రపంచంలో అత్యంత ఖరీదైన యుద్ధ విమానం

Most Read Articles

English summary
Futuristic Supersonic Passenger Airliner Unveiled
Story first published: Thursday, November 17, 2016, 12:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X