మారుతి 800 ఇంజన్‌తో ఆల్ వీల్ డ్రైవ్ మోటార్ సైకిల్ నిర్మించిన 20 ఏళ్ల కుర్రాడు
ఓ కారు మొత్తాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి అందులో నుండి సేకరించిన విడి భాగాలతో ఇలా 800సీసీ ఇంజన్‌తో, ఇంజన్ పవర్ ఫ్రంట్ మరియు రియర్ వీల్‌కు అదేలా బైకును రూపొందించాడు.
గుజరాత్‌కు చెందిన ఓ 20 ఏళ్ల కుర్రాడు తన సొంత పరిజ్ఞానంతో ఓ బైకును రూపొందించాడు. ఆ బైకులో ఆల్ వీల్ డ్రైవ్, 4-స్పీడ్ గేర్‌బాక్స్, 800సీసీ ఇంజన్ ఉన్నాయి. ఏంటి కారుకు ఉండాల్సిన స్పెసిఫికేషన్స్ బైకులో ఉన్నాయని ఆశ్చర్యపోయారా...?

మీరు చదివింది అక్షరాలా నిజమే... ఎందుకంటే ఓ కారు మొత్తాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి అందులో నుండి సేకరించిన విడి భాగాలతో ఇలా 800సీసీ ఇంజన్‌తో, ఇంజన్ పవర్ ఫ్రంట్ మరియు రియర్ వీల్‌కు అదేలా బైకును రూపొందించాడు.
Recommended Video


1983 కాలంలో మారుతి 800 కారు ఇండియన్స్‌కు పరిచయం అయ్యింది. అప్పటి నుండి మారుతి 800 కారు ఆధారంగా ఎన్నో మోడిఫైడ్ కార్లు మరియు మోడిఫైడ్ బైకులు ప్రాణం పోసుకున్నాయి. ఎలాంటి రూపంలోకైనా మార్చేయడానికి మారుతి 800 ఎంతో అనువైనది. దీని అధారంగా వచ్చిన మరో అద్భుత సృష్టే ఈ బైక్.

గుజరాత్‌కు చెందిన రుజ్బే అనే 20 ఏళ్ల విద్యార్థి మారుతి 800 కారు నుండి ట్రాన్స్‌మిషన్ సిస్టమ్, ఇంజన్ మరియు ఇతర విడి భాగాలు సేకరించి హమ్మర్‌హెడ్ 800 అనే మోడిఫైడ్ బైకును నిర్మించాడు.

బైకు మధ్యలో 796సీసీ కెపాసిటి గల మారుతి పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ ముందు మరియు వెనుక చక్రానికి వేరు వేరు ప్రొపెల్లర్ షాఫ్ట్ ద్వారా సరఫరా అవుతుంది. అంటే, సాధారణ బైకుల్లో ఇంజన్ పవర్ రియర్ వీల్‌కు మాత్రమే అందితే, ఇందులో రెండు చక్రాలకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

ప్రొపెల్లర్ షాఫ్ట్ నుండి వీల్‌కు పవర్ ఎలా వెళుతుందనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఇందులో సాధారణ బైకుల తరహాలో చైనా ద్వారా కాకుండా ఇంజన్ నుండి చక్రం వరకు చిన్న పరిమాణంలో ఒక షాఫ్ట్ ఉంటుంది(బస్సులు మరియు లారీల్లో క్రింది వైపు ఇంజన్ నుండి డిఫరెన్షియల్ వరకు ఉండే షాఫ్ట్ తరహా), ఇదే పవర్‌ను చక్రాలకు సరఫరా చేస్తుంది.

ఈ బైకులో ఉన్న ఇంజన్, గేర్‌బాక్స్ మరియు డ్రైవ్ సిస్టమ్ బరువును తట్టుకునేలా డైమండ్ స్పేస్ ఫ్రేమ్ మీద హమ్మర్‌హెడ్ 800 బైకును నిర్మించాడు. డైమండ్ ఆకృతిలో ఉన్న ఫ్రేమ్ కావడంతో ఎక్కువ కాలం మన్నుతుంది.
Trending On DriveSopark Telugu:

హమ్మర్‌హెడ్ 800 బైకులోని 4-స్పీడ్ గేర్‌బాక్స్‌లో రివర్స్ గేర్ కూడా ఉంది. సస్పెన్షన్ కోసం రెండు వైపులా డబుల్ స్వింగ్ ఆర్మ్స్, అంతే కాకుండా బ్లూటూత్ కనెక్టివిటి మరియు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 3 ఇన్ 1 ఆడియో సిస్టమ్ ఉంది.

ఈ బైకును నిర్మించిన రుజ్బే ప్రస్తుతం ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అభ్యసిస్తున్నాడు. మరియు తను సృష్టించిన బైకు మీద పేటెంట్ హక్కులు కూడా పొందాడు.
Trending DriveSpark Telugu YouTube Videos
Source: Rushlane


Click it and Unblock the Notifications








