వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు బాబా రామ్ రహీం భయంకరమైన కార్ కలెక్షన్

Written By:

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బాబా రామ్ రహీం అలియాస్ డేరా బాబా కార్ కలెక్షన్. ప్రజల్లో మార్పులు తెచ్చేందుకు బాబాగా అవతరించిన వ్యక్తికి అసలు ఇన్ని కార్లు ఎందుకు...? ఎవరీ డేరా బాబా...? ఇతని వద్ద ఎలాంటి కార్లు ఉన్నాయి...? వంటి వివరాలు నేటి కథనంలో....

బాబా రామ్ రహీం కార్ కలెక్షన్

గుర్మీత్ రామ్ రహీం అలియాస్ డేరా బాబా.... దేశవ్యాప్తంగా పరిచయం అవసరం లేని పేరిది. దేవుడి మనిషిగా, గుర్మీత్ రామ్ రహీం తనను తాను దైవాంశ సంభూతుడుగా ప్రకటించుకుని డేరా బాబా పేరుతో డేరా సచ్ సౌధా ఆశ్రమానికి ఆధ్యాత్మిక గురువుగా అవతరించాడు.

బాబా రామ్ రహీం కార్ కలెక్షన్

15 ఏళ్ల క్రితం అత్యాచారం మరియు హత్య కేసులో సిబిఐ కోర్టు తాజాగా బాబా రామ్ రహీంను దోషిగా తేల్చింది. విచారణ, మరియు శిక్ష ఖరారు నేపథ్యంలో దేశవ్యాప్తంగా డేరా బాబా ఫేమస్ అయిపోయారు. అయితే, డేరా బాబా జీవన శైలి ఇతర ఆధ్యాత్మిక గురువులతో పోల్చితే చాలా వ్యత్యాసం ఉంటుంది.

బాబా రామ్ రహీం కార్ కలెక్షన్

ఆధునిక వస్త్రధారణ, నిత్య నూతన జీవన శైలిలో దర్శనమిచ్చే గుర్మీత్ సింగ్ రాజస్థాన్‌లో ఆగష్టు 15, 1967 న జన్మించాడు. చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండటంతో షా సత్నమ్ సింగ్ ద్వారా డేరా సచ్ సౌధా అధిపతిగా ఎదిగి బాబా రామ్ రహీంగా పేరు మార్చుకున్నాడు.

బాబా రామ్ రహీం కార్ కలెక్షన్

1990లో సత్నం సింగ్ రామ్ రహీంను వారసుడిగా ప్రకటించారు. ఆ తరువాత కాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా ఎదిగిన బాబ్ రామ్ రహీం మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అత్యాచారాలు మరియు హత్యలు చేసినట్లు కేసులు నమోదయ్యాయి.

బాబా రామ్ రహీం కార్ కలెక్షన్

వివాదాస్పద గురువుగా నిలిచిన డేరా బాబా జీవన శైలిలో విలక్షణమైన కార్లు కూడా ఉన్నాయి. అసలు ఓ బాబాకు ఇన్ని కార్లెందుకు అని ఆశ్చర్యం కలగక మానదు... డేరా బాబా వద్ద ఉన్న కార్ల గురించి చూద్దాం రండి.....

బాబా రామ్ రహీం కార్ కలెక్షన్

ఫ్యాషన్ ట్రెండుని ఏ మాత్రం మిస్సవకుండా ఫాలో అవుతుంటాడు డేరా బాబా. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ మరియు కార్ల కలెక్షన్‌లో ఫ్యాషన్ పట్ల మోజు ఏవిధంగా ఉందో స్పష్టంగా కనబడుతోంది. అయితే డేరా బాబా ఉపయోగించే కార్లన్నీ మోడిఫైడ్ కార్లే.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బాబా రామ్ రహీం కార్ కలెక్షన్

బుగట్టి వేరాను రూపంలో ఉన్న హోండా అకార్డ్ వి6. హోండా అకార్డ్ కారుకు డిజైన్ మరియు మెకానికల్‌గా మార్పులు చేయించి బుగట్టి వేరాన్ రూపంలోకి మోడిఫై చేయించుకున్నాడు.

బాబా రామ్ రహీం కార్ కలెక్షన్

హీరో హోండా కరిజ్మా... చూడటానికి మూడు చక్రాలు కారులా ఉంది, ఇదేం బండి అనుకుంటున్నారా... నిజానికి హీరో హోండా రూపొందించిన కరిజ్మా మోటార్ సైకిల్. కరిజ్మా బైకును ఆగ్రోజెట్టారు రూపంలోకి మోడిఫై చేయించాడు.

ఆగ్రోజెట్టార్ అనగా... వాహనాలు వెళ్లడానికి కుదరని ప్రాంతాలలో వైద్య సేవలందించడానికి ఇలాంటి వాహనాలను వినియోగించే వాటిని ఆగ్రోజెట్టార్ అంటారు.

బాబా రామ్ రహీం కార్ కలెక్షన్

దైవ దూతగా అవతరించిన డేరా బాబా తొలినాళ్ల కారు ఇది. హ్యుందాయ్ శాంట్రో కారును మెర్సిడెస్ సి-క్లాస్ నుండి సేకరించిన హెడ్ ల్యాంప్స్, విభిన్నమైన పెయింట్ స్కీమ్ మరియు తనలోని శృంగార భావాలకు దర్పంగా నిలిచే పెదువుల ఆకారంలో ఉన్న ఫ్రంట్ బంపర్ ఉన్నాయి.

బాబా రామ్ రహీం కార్ కలెక్షన్

మరో వింత వాహనం, ఇలాంటి కారును ఏ మార్కెట్లో ఇది వరకు చూసి ఉండరు కదూ... అవును కనీసం పిల్లలు ఆడుకునే బొమ్మ కార్లు కూడా ఇంత వింతగా ఉండవు. నిజానికి మారుతి జిప్సీ వాహనాన్నే ఇలా మార్చేశారు. జిప్సీ వాహనాలు వాడే వాళ్లు దీనిని చూస్తే భాదపడటం ఖాయం.

బాబా రామ్ రహీం కార్ కలెక్షన్

దీనిని కారు అంటారా....? బాక్సుకు పైపుకు క్రాస్ బ్రీడింగ్ అని చెప్పవచ్చు. బాబా రామ్ రహీం కార్ల జాబితాలో దీనికి స్థానం ఇచ్చాడు.

బాబా రామ్ రహీం కార్ కలెక్షన్

వంకాయ ఆకారంలో మోడిఫై చేసిన కారు....

బాబా రామ్ రహీం కార్ కలెక్షన్

చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మ కార్లను అసలైన కార్లుగా మోడిఫై చేయించుకుని వినియోగించే వాడు. తన జీవన శైలి మరే ఇతర బాబాలతో పోల్చినా ఎంతో విభిన్నంగా ఉంటుందడానికి ఈయన కార్ల కలెక్షన్ నిదర్శనమని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Gurmeet Ram Rahim Car Collection
Story first published: Tuesday, August 29, 2017, 13:46 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark