ఇండియాలో తొలి హెలికాఫ్టర్ ట్యాక్సీ సేవల ప్రారంభించనున్న బెంగళూరులో

Written By:

ప్రజా రవాణాలో అద్దె వాహనాలు ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటి వరకు టూ వీలర్లు మరియు కార్లను ట్యాక్సీలుగా వినియోగించుకున్న ఇండియన్స్ ఇక మీదట హెలికాఫ్టర్ ట్యాక్సీ సర్వీసులను కూడా వినియోగించుకోనున్నారు.

ఎలా సాధ్యం అనుకుంటున్నారా....?

బెంగళూరులో భారతదేశపు తొలి హెలికాఫ్టర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. దీని గురించిన పూర్తి వివరాలు నేటి కథనంలో...

హెలికాఫ్టర్ ట్యాక్సీ సేవలు

భారతదేశంలోనే తొలిసారిగా, బెంగళూరులో హెలికాఫ్టర్ ద్వారా ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. థంబీ ఏవియేషన్ సంస్థ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(BIAL) ఉమ్మడి భాగస్వామ్యంతో నవబంర్ 2017 నుండి పూర్తి స్థాయిలో హెలికాఫ్టర్ ట్యాక్సీ సర్వీసును ప్రారంభించనుంది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
హెలికాఫ్టర్ ట్యాక్సీ సేవలు

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నగరంలోని ఎలక్ట్రానిక్ సిటి వరకు హెలికాఫ్టర్ ట్యాక్సీ సర్వీసులను ప్రారంభించనున్నారు. 15 నిమిషాల ప్రయాణ సమయం ఉన్న ఈ రెండు స్టాపుల మధ్య టికెట్ ధరను ఇంకా నిర్ణయించలేదు.

హెలికాఫ్టర్ ట్యాక్సీ సేవలు

థంబీ ఏవియేషన్ సంస్థ హెలికాఫ్టర్ ట్యాక్సీ సర్వీసుల కోసం 13 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న బెల్-412 మరియు 5 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న బెల్-407 హెలికాఫ్టర్లను వినియోగించనున్నట్లు తెలిసింది.

హెలికాఫ్టర్ ట్యాక్సీ సేవలు

కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా వివిధ నగరా ఓపెన్ స్కై విధానం ద్వారా 5,000 అడుగుల ఎత్తు లోపు హెలికాఫ్టర్ ట్యాక్సీ సర్వీసులను కేంద్రం ప్రోత్సహిస్తోందని తెలిపాడు.

హెలికాఫ్టర్ ట్యాక్సీ సేవలు

ఇప్పటి వరకు బెంగళూరు నగర వ్యాప్తంగా మొత్తం 90 హెలీప్యాడ్‌లు ఉన్నాయి. ఇందులో అపార్ట్‌మెంట్ రూఫ్ మీద నిర్మించిన, వినియోగంలో లేని హెలీప్యాడ్‌లు కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ నిర్వహించడానికి ప్రభుత్వం ఇప్పుడు పేపర్ పనుల్లో ఉంది. అనుమతలన్నీ లభించిన వెంటనే హెలికాఫ్టర్ సేవలు ప్రారంభం కానున్నాయి.

హెలికాఫ్టర్ ట్యాక్సీ సేవలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశపు సాప్ట్‌వేర్ రాజధానిగా విలసిల్లుతున్న బెంగళూరు ట్రాఫిక్ కోరల్లో చిక్కుకుంది. నగరానికి ఒక వైపు నుండి మరో వైపుకు ప్రయాణించడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే హెలికాఫ్టర్ ట్యాక్సీ అద్దెలను మధ్యస్థంగా ఉంచితే, ఎక్కువ మంది ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Bangalore To Have India’s First Helicopter Taxi Service
Story first published: Monday, August 7, 2017, 13:52 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark