హైదరాబాద్‌లో మూడు పల్టీలు కొట్టిన కారు: వీడియో!

Written By:

భాగ్య నగరంలో మరో ఘోర ప్రమాదం జరిగింది, అతి వేగానికి ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బలి కాగా మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు నడుపుతున్న బీటెక్ విద్యార్థి సీట్ బెల్ట్ ధరించలేదు, మిగతా ఇద్దరూ సీట్ బెల్ట్ ధరించారు. మితి మీరిన వేగంతో కారు అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టింది.

హైదరాబాద్‌లో మూడు పల్టీలు కొట్టిన కారు

బంజారా హిల్స్ లోని రద్దీతో కూడిన ఓ రోడ్డు మీద మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టి అవతలి రోడ్డు మీద మూడు పల్టీలు కొట్టి తలక్రిందులుగా పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న విద్యార్థి తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

హైదరాబాద్‌లో మూడు పల్టీలు కొట్టిన కారు

హైదరాబాద్‌లో ఫస్‌హత్ అలీ తన ఇద్దరు మిత్రులతో హ్యుందాయ్ ఐ20 కారులో కాలేజీకి బయలుదేరాడు. బంజారాహిల్స్‌ లోని ఓ రద్దీ రోడ్డులో అతి వేగంతో ముందున్న వాహనాన్ని అధిగమించబోయాడు, అయితే వెంటనే వచ్చిన మలుపులో అధిక వేగాన్ని అదుపు చేయలేకపోయాడు.

హైదరాబాద్‌లో మూడు పల్టీలు కొట్టిన కారు

స్పీడ్ కంట్రోల్ చేసే విషయంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని మూడు పల్టీలు కొట్టి తలక్రిందులుగా ఆగిపోయింది. క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న అలీ స్పాట్‌లో మరణించగా, ఇదే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మిత్రులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఫస్‌హత్ అలీ సీట్ బెల్ట్ ధరించకపోవడంతో తీవ్రగాయాలపాలయ్యాడు, అయితే మిగతా ఇద్దరూ సీట్ బెల్ట్ ధరించారు దీంతో చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రమాద దృశ్యాన్ని వీడియోలో వీక్షించగలరు.

హైదరాబాద్‌లో మూడు పల్టీలు కొట్టిన కారు

ప్రమాద సమయంలో సీట్ బెల్ట్‌లు ప్రాణాలు రక్షిస్తాయనడానికి మరో నిదర్శనంగా దీనిని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇకమీదటైనా సీట్ బెల్ట్ ధరించి వాహనాలను నడపండి...

English summary
Read in Telugu: High Speed Driving Clainms One Life in Hyderabad two Other Injured. For More Details...
Story first published: Saturday, July 15, 2017, 15:37 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark