స్విఫ్ట్ దెబ్బకు తలక్రిందులైన హోండా సిటి: వీడియో

Written By:

కేరళలోని రహదారి మీద ఎదురెదురుగా వచ్చిన మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు హోండా సిటి కార్లు రద్దీని దాటుకుంటూ ముందుకు వెళ్లే క్రమంలో ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్విఫ్ట్ స్వల్ప డ్యామేజ్‌తో బయటపడితే, హోండా సిటి సెడాన్ కారు మాత్రం రోడ్డు మీద తలక్రిందులైపోయింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మారుతి స్విఫ్ట్ హోండా సిటి ప్రమాదం

ఈ ప్రమాదం కేరళలోని కాలికట్ విమానాశ్రయానికి సమీపంలో మలప్పురంలోచోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు కార్లు అధిక వేగం వద్ద రద్దీని తప్పించే క్రమంలో ప్రమాదానికి గురయ్యాయి.

మారుతి స్విఫ్ట్ హోండా సిటి ప్రమాదం

ఇందులో మారుతి స్విప్ట్ ముందువైపున కుడి భాగం పాక్షికంగా దెబ్బతింది. అయితే హోండా సిటి సెడాన్ కారు అదే వేగంలో ఒక్కసారిగా తలక్రిందులైపోయి, ఆ తరువాత వేగం అందుపులోకి వచ్చింది.

మారుతి స్విఫ్ట్ హోండా సిటి ప్రమాదం

హోండా సిటి కారును అప్పుడే కొనుగోలు చేసినట్లు తెలిసింది, షోరూమ్ నుండి బయటికొచ్చిన దీనికి ఇంకా రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంది. ఇది నూతన ఎడిషన్ హోండా సిటి కారు.

మారుతి స్విఫ్ట్ హోండా సిటి ప్రమాదం

ఈ హోండా సిటి కారులో ఉన్న ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకున్నారు మరియు ప్రమాదం జరిగిన వెంటనే ముందు వైపు ఉన్న రెండు ఎయిర్ బ్యాగులు విచ్చుకున్నాయి. సిటి కారులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు.

మారుతి స్విఫ్ట్ హోండా సిటి ప్రమాదం

ప్రమాదానికి గురైన మారుతి స్విఫ్ట్ కారును పరిశీలిస్తే ఇందులో ఎయిర్ బ్యాగులు విచ్చుకోలేదు. అయితే డ్రైవర్ ఛాతి గట్టిగా స్టీరింగ్ వీల‌్‌కు తాకడం వలన ఛాతి నొప్పి వచ్చిందని తెలిపారు. అయితే ఇందులోని డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించడం విస్మరించాడు.

మారుతి స్విఫ్ట్ హోండా సిటి ప్రమాదం

ప్రస్తుతం ఉన్న భయంకరమైన ఇండియన్ రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు భద్రత పరంగా ముందు జాగ్రత్త చర్యలుగా సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి చేసుకోండి. మీ తప్పు లేకపోయినా ఇతరులు చేసే ప్రమాద ప్రభావం మీపై ఉండవచ్చు. కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోవడం మరువకండి.

ప్రమదం జరిగిన తరువాత, ఘటనా స్థలిలోని మారుత స్విఫ్ట్ మరియు హోండా సిటి కార్లను ఇక్కడున్న వీడియో ద్వారా వీక్షించగలరు.

మారుతి స్విఫ్ట్ హోండా సిటి ప్రమాదం

మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారును అతి త్వరలో న్యూ జనరేషన్ స్విఫ్ట్‌గా విడుదల చేయనుంది. దీనికి చెందిన మరిన్ని ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి...

 

English summary
Maruti Swift Crashes Into Honda City — A Speedy City Smashup
Story first published: Thursday, March 16, 2017, 11:22 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark