34 లక్షల విలువైన విజయ్ మాల్యా లగ్జరీ కార్లు రూ. 1.4 లక్షలకే!

Written By:

బ్యాంకు బకాయిలను ఎగ్గొట్టి దేశం విడిచి పరారైన విజయ్ మాల్యా ఆస్తులను బ్యాకులు ఒక్కొక్కటిగా వేలం వేస్తూ వస్తున్నాయి. అందులో భాగంగా మాల్యాకు చెందిన రెండు కార్లు వేలంలో రూ. 1.4 లక్షలకు అమ్ముడుపోయాయి. నిజానికి వీటి ధర రూ. 34 లక్షలు.

 విజయ్ మాల్యా కార్ల వేలం

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం బ్యాంకుల నుండి సుమారుగా 9 వేల కోట్ల రుపాయలను మాల్యా అప్పుగా తీసుకున్నాడు. బకాయిలను చెల్లించని లిక్కర్ కింగ్ మాల్యా దేశం విడిచి పారిపోయాడు.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
 విజయ్ మాల్యా కార్ల వేలం

అప్పులిచ్చిన బ్యాంకులు చేసేది లేక మాల్యాకు సంభందించిన దొరికిన ఆస్తులను దొరికినట్లుగా వేలం వస్తున్నాయి. అందులో భాగంగా మాల్యాకు చెందిన రెండు కార్లకు ఆన్‌లైన్ ద్వారా ముంబై నుండి వేలం నిర్వహించారు.

 విజయ్ మాల్యా కార్ల వేలం

ఈ వేలంలో హుబ్లీకి చెందిన హనుమంత రెడ్డి అనే వ్యాపారవేత్త అత్యంత చౌక ధరలతో సొంతం చేసుకున్నాడు. సుమారుగా రూ. 34 లక్షలు విలువ చేసే రెండు కార్లను కేవలం రూ. 1.4 లక్షలకే సొంతం చేసుకున్నాడు.

 విజయ్ మాల్యా కార్ల వేలం

విజయ్ మాల్యా పేరు మీద ఉన్న, మాల్యా వినియోగించిన హ్యుందాయ్ సొనాటా గోల్డ్ కారు మార్కెట్ అసలు ధర రూ. 13.15 లక్షలు మరియు హోండా అకార్డ్ కారు ధర రూ. 21 లక్షలుగా ఉండగా, హనుమంత రెడ్డి సొనాటా గోల్డ్‌ను రూ. 40 వేలకు మరియు అకార్డ్ కారును లక్ష రుపాయలకే కొనుగోలు చేశాడు.

 విజయ్ మాల్యా కార్ల వేలం

హనుమంత రెడ్డికి ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ కార్లను వేలం ద్వారా సొంతం చేసుకునే అలవాటు ఉంది. అందులో భాగంగా ముంబాయ్‌కు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ నిర్వహించిన వేలంలో మాల్యా వాడిన MH 01 DA 7227 మరియు MH 01 DA 1235 కార్లను సరసమైన ధరకు సొంతం చేసుకున్నాడు.

 విజయ్ మాల్యా కార్ల వేలం

ప్రస్తుతం రెండు కార్లు కూడా మంచి కండీషన్‌లో ఉన్నట్లు తెలిపాడు. హనుమంత్ రెడ్డి మాల్యా కార్లను డెలివరీ తీసుకున్న తర్వాతా అధిక ధరకు తమ విక్రయించాలని చాలా మంది డిమాండ్ చేయగా, అందుకు నిరాకరించానని తెలిపాడు.

 విజయ్ మాల్యా కార్ల వేలం

విజయ్ మాల్యాకు చెందిన రోల్స్ రాయిస్ కార్ల నుండి చిన్న చిన్న కార్ల వరకు మొత్తం 52 కార్లకు వేలం నిర్వహించినట్లు తెలిసింది. ఆస్తులతో పాటు వ్యక్తిగత విమానాన్ని కూడా వేలంలో విక్రయించేశారు.

విజయ్ మాల్యా కార్ల వేలం

ఇదంతా కూడా ప్రభుత్వం, రాజకీయ నాయకులు మరియు బ్యాంకులు కుమ్మక్కయ్యి విజయ్ మాల్యాకు కోటాను కోట్ల రుపాయల భారత ప్రజల సొమ్మును దోచిపెట్టి పరోక్షంగా లాభపడ్డాయని, మాల్యా ద్వారా జరిగిన నష్టాన్ని తన ఆస్తులకు వేలం ద్వారా తిరిగి పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు బ్యాంకులు నటిస్తున్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

English summary
Read In Telugu: Hubballi Businessman Buys Mallyas Cars In Auction

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark