మద్యం తాగి వెహికల్స్ ఎందుకు నడపకూడదు తెలిపే వీడియో.. మీరూ చూడండి

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అందరికి తెలుసు. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏటా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి 'డ్రంక్ అండ్ డ్రైవ్'. అయితే ఇప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ప్రజలకు ఒక అవగాహన తీసుకురావడానికి హైదరాబాద్ నగర పోలీసులు ఒక వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

మద్యం తాగి వెహికల్స్ ఎందుకు నడపకూడదు తెలిపే వీడియో.. మీరూ చూడండి

ఈ వీడియోలో మద్యం తాగి వాహనం నడిపితే ఏవిధంగా ఉంటుంది. అది రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగిస్తుంది. దీని వల్ల కలిగే నష్టాలు ఏంటి అనే విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది.

మద్యం తాగి వెహికల్స్ ఎందుకు నడపకూడదు తెలిపే వీడియో.. మీరూ చూడండి

ఈ వీడియో మీరు గమనించినట్లతే, ఒక వ్యక్తి బైక్ మీద మధ్య తాగి డ్రైవ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వ్యక్తి హెల్మెట్ కలిగి ఉన్నప్పటికీ దాన్ని ధరించకుండా బైక్ కి తగిలించుకున్నాడు. ఇతడు ఆలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత కింద పడిపోతాడు.

మద్యం తాగి వెహికల్స్ ఎందుకు నడపకూడదు తెలిపే వీడియో.. మీరూ చూడండి

ఆ సమయంలో అటుగా వెళ్తున్న మరో వ్యక్తి తన బైక్ పక్కకు ఆపి పడిపోయిన వ్యక్తిని మరియు బైక్ ని పైకి లేపుతాడు. తర్వాత మద్యం తాగిన వ్యక్తి మళ్ళీ బైక్ ఎక్కి స్టార్ట్ చేసి మళ్ళీ ముందుకు వెళతాడు. అయితే అప్పుడు కూడా హెల్మెట్ ధరించలేదు, తన వద్ద వున్న హెల్మెట్ మిర్రర్ కి తగిలించాడు.

మద్యం తాగి వెహికల్స్ ఎందుకు నడపకూడదు తెలిపే వీడియో.. మీరూ చూడండి

రోడ్డుపై వెళ్తున్న అతడు తనకు ఇష్టం వచ్చిన రీతిలో బైక్ డ్రైవ్ చేస్తున్నాడు, ఈ కారణంగానే వెనుక ఎక్కువ ట్రాఫిక్ ఏర్పడింది. ఆ వ్యక్తిని దాటి ముందుకు వెళ్లాలంటే కూడా దారి వదలకుండా అటు ఇటూ వెళ్తున్నాడు. చివరగా ఒక వైట్ మారుతి విటారా బ్రెజ్జా డ్రైవర్ అతన్ని అధిగమించాలని నిర్ణయించుకుంటాడు. కానీ అది వీలుపడలేదు. అయితే అతడు చివరికి రోడ్డు మధ్యలో పడిపోతాడు. ఈ వీడియో చూస్తుంటే నిజంగా నవ్వు వస్తుంది.

మద్యం తాగి వెహికల్స్ ఎందుకు నడపకూడదు తెలిపే వీడియో.. మీరూ చూడండి

ఇక్కడ వీడియో చూసి మనం నవ్వుకోవచ్చు, కానీ ఇది ఆ వ్యక్తి ప్రాణానికే ప్రమాదం. ఒక వేళా వెనుక ఏదైనా వాహనం అధిక వేగంతో వచ్చి ఢీ కొంటే జరిగే ప్రమాదాన్ని మనం ఊహించవచ్చు. ఇది మద్యం తాగి ప్రయాణించేవారందరికి ఒక గుణపాఠం కావాలి. కావున వీలైనంత వరకు మద్యం వాహనాన్ని ముట్టుకోకపోవడం చాలా ఉత్తమం.

మద్య తాగి డ్రైవ్ చేస్తే పోలీసులు వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారు. సాధారణంగా మద్యపానం చేసే వ్యక్తి యొక్క ఏకాగ్రత నశిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనదారుడు చుట్టూ గమనిస్తూ వాహనాన్ని డ్రైవ్ చేయవలసి వుంటుంది. మద్యం తాగి వాహనాన్ని డ్రైవ్ హెస్తే డ్రైవింగ్ మీద ద్రుష్టి పెట్టలేరు. కావున ప్రమాదం జరుగుతుంది.

మద్యం తాగి వెహికల్స్ ఎందుకు నడపకూడదు తెలిపే వీడియో.. మీరూ చూడండి

ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను తగ్గింహడానికి తెలంగాణ ప్రభుత్వం, తాగి డ్రైవింగ్ చేసే వారి యొక్క లైసెన్స్ రద్దు చేయడం ప్రారంభించింది. అంతే కాదు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఏకంగా వారిని జైలుకి కూడా పంపుతారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు మద్యం సేవిచకుండా డ్రైవ్ చేయాలి. లేకుంటే ఈ కఠినమైన శిక్షలు అనుభించాల్సి ఉంటుంది.

Most Read Articles

English summary
Hyderabad Police Releases Video Explaining Why You Should Not Drink & Drive. Read in Telugu.
Story first published: Saturday, July 17, 2021, 20:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X