మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

గడచిన రెండు దశాబ్ధాల కాలంలో భారత ఆటోమొబైల్ మార్కెట్ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు మనదేశంలో కార్ కంపెనీలను మరియు అవి అందించే కార్లను వేళ్ల మీద లెక్కించేవాళ్లం. అలాంటిది ఇప్పుడు, దేశంలో అనేక కొత్త కార్ బ్రాండ్లు మరియు వాటి నుండి పదుల కొద్దీ కొత్త కార్లు మార్కెట్లో లభిస్తున్నాయి. మారుతున్న సమయంతో పాటుగా కార్లలో ఉపయోగించే సాంకేతికత కూడా చాలా మారిపోయింది. గతంలో ప్రీమియం లగ్జరీ కార్లకు మాత్రమే పరిమితమైన అనేక ఫీచర్లు, ఇప్పుడు సాధారణ ఎంట్రీ లెవల్ కార్లలో కూడా అందుబాటులోకి వచ్చాయి.

మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

కార్ మార్కెట్లో కంపెనీల మధ్య పెరిగిన పోటీ కారణంగా, ఇప్పుడు సరసమైన ధరకే అత్యుత్తమైన ఫీచర్లు లభిస్తాయి. ఒకప్పుడు కార్ అంటే, నాలుగు చక్రాలు మరియు ఒక స్టీరింగ్ వీల్ మాత్రమే. కానీ, నేటి ఆధునిక కార్లలో అనేక రకాల కంఫర్ట్, కన్వీనెన్స్ అండ్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తున్నాయి. టెక్నాలజీ అప్‌గ్రేడ్ కారణంగా, ఈ రోజుల్లో, హ్యాచ్‌బ్యాక్ యొక్క ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లు కూడా పుష్కలమైన ఫీచర్లు మరియు సాంకేతికతతో వస్తున్నాయి. కస్టమర్లు కూడా ధర ఎక్కువైనా పర్వాలేదు, కారులో ఫీచర్లు మాత్రం తక్కువ కాకూడదని కోరుకుంటున్నారు.

మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

ఒకవేళ మీరు ఇప్పటికీ మీ పాత కారును ఉపయోగిస్తుంటే, అందులో ఇలాంటి 5 ఫీచర్లు లేనట్లయితే, ఇక మీరు కూడా మీ కారును కొత్త మోడల్‌తో అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన సమయం వచ్చందని గుర్తుంచుకోండి. మరి, ప్రస్తుత కార్లలో ఉండాల్సిన ఆ ఐదు ముఖ్యమైన ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

1. ఎయిర్ బ్యాగ్స్ (Airbags)

ఒకప్పుడు కార్లోల ఎయిర్‌బ్యాగ్ అనేది ఓ ప్రీమియం యాడ్-ఆన్ సేఫ్టీ ఫీచర్. ఒక్కమాటలో చెప్పాలంటే, డబ్బున్న వారికి మాత్రమే అందుబాటులో ఉన్న సేఫ్టీ ఫీచర్. సాధారణ ఎంట్రీ లెవల్ కార్లలోని బేస్, మిడ్ వేరియంట్లు ఈ ఫీచర్‌తో లభించేవి కావు. అప్పట్లో ధరకు ప్రాధాన్యత ఇచ్చే కస్టమర్లు లేదా ఖరీదైన ఫీచర్లను భరించలేని వారు ఎయిర్‌బ్యాగ్స్ లేకపోయినా (అది ప్రమాదమని తెలిసినా) తక్కువ ధర వద్దనే ఎంట్రీ లెవల్ కార్లను కొనుగోలు చేసేవారు. మరోవైపు ఇలాంటి స్టాండర్ సేఫ్టీ ఫీచర్లపై తప్పనిసరి నిబంధలు కూడా అమలు లేకపోవడంతో కార్ కంపెనీలు కూడా వీటిపై అంత శ్రద్ధ చూపేవారు కాదు.

మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

అయితే, ఇటీవలి కాలంలో కార్లలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు (దానికి ముందు కేవలం డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్) మాత్రమే తప్పనిసరి చేయబడింది. అంటే, ఇప్పుడు కార్ కంపెనీలు తయారు చేసే ప్రతి మోడల్ మరియు దానిలోని ప్రతి వేరియంట్ కూడా తప్పనిసరిగా డ్రైవర్ మరియు ఫ్రంట్ కో-ప్యాసింజర్ కోసం తప్పనిసరిగా రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లను అందించాలి. ఇందులో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ స్టీరింగ్ వీల్‌లో అమర్చబడి ఉంటుంది. ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ డ్యాష్‌బోర్డులో అమర్చబడి ఉంటుంది.

మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

ఎయిర్‌బ్యాగ్ అనేది ప్రమాద సమయంలో సంజీవనిలా పనిచేస్తుంది. ముందు వైపు నుండి ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్స్ విచ్చుకొని ప్రయాణీకులకు ప్రాణాంతక గాయాల నుండి రక్షణ కల్పిస్తుంది. కారులోని క్రాష్ సెన్సార్లు ప్రమాదాన్ని గుర్తించి, ఎయిర్‌బ్యాగ్ సెన్సార్‌ను ట్రిగ్గర్ చేసినప్పుడు, అది సోడియం అజైడ్‌ను మండించి, ఎక్సోథర్మిక్ రసాయన ప్రతిచర్యకు కారణమవుతుంది. అంటే, ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థలో ఓ చిన్నపాటి బ్లాస్ట్ జరిగి, దాని నుండి వచ్చే గాలితో ఎయిర్‌బ్యాగ్‌లు కొన్ని సెకండ్లపాటు విచ్చుకుంటాయి.

మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

ప్రమాద సమయంలో ఇవి ప్రయాణీకుల తల, చాతీ భాగాల్లో కలిగే నష్టాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాయి. కొన్ని హై-ఎండ్ కార్లలో 6-10 వరకూ ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. ఇవి ప్రయాణీకులకు అన్ని వైపుల నుండి రక్షణ అందించేలా డిజైన్ చేయబడి ఉంటాయి. కాబట్టి, నేటి ఆధునిక కార్లతో పోలిస్తే, మీరు ఉపయోగించే పాత తరం కారులో ఇలాంటి ఎయిర్‌బ్యాగ్ ఫీచర్ లేనట్లయితే, వాటితో ఇది పోటీ పడటం కష్టమని గుర్తించుకోండి. ప్రమాదం జరిగినప్పుడు అయ్యయ్యో అనడం కన్నా, ముందుగానే మేల్కొని మీ కారును కొత్త ఆధునిక కార్లతో అప్‌గ్రేడ్ చేసుకోవడం మంచిది.

మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

2. ఈబిడితో కూడిన ఏబిఎస్ (ABS & EBD)

ఎయిర్‌బ్యాగ్స్ మాదిరిగానే ఈబిడితో కూడిన ఏబిఎస్ కూడా ఇప్పుడు అన్ని కార్లలో తప్పనిసరిగా ఉండాల్సిన సేఫ్టీ బ్రేకింగ్ ఫీచర్. ఇది అత్యవసర సమయాల్లో బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు కారుని సురక్షితంగా నిలుపదల చేయడంలో సహకరిస్తుంది. ఇందులో ఈబిడి అంటే ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూష్. అంటే ఇది ఎమర్జెన్సీ బ్రేక్ వేసినప్పుడు ఉద్భవించే శక్తిని నాలుగు చక్రాలకు ఎలక్ట్రానిక్‌గా బదిలీ చేస్తుంది. అలాగే, ఇందులో ఏబిఎస్ అంటే, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్. అంటే, ఇది బ్రేక్ వేసినప్పుడు చక్రాలు దొర్లడాన్ని పూర్తిగా నిలిపివేయకుండా, కొన్ని సెకండ్ల పాటు రోలింగ్ ఉండి, కారుని పూర్తిగా నిలుపుదల చేయడంలో సహకరిస్తుంది.

మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

సాధారణ బ్రేకింగ్ సిస్టమ్‌లో ఎమర్జెన్సీ బ్రేక్ వేసినప్పుడు చక్రాలు దొర్లడం ఆగిపోయి, అవి ఈడ్చుకుంటూ ముందుకు వెళ్తాయి. ఫలితంగా, ఎమెర్జెన్సీ సమయంలో బ్రేకింగ్ డిస్టెన్స్ చాలా తక్కువగా ఉండి, మనం ప్రయాణిస్తున్న అవతలి కారును లేదా వస్తువులను ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. అదే, ఏబిఎస్ ఉన్న కార్లలో అయితే, చక్రాలు లాక్ కావు కాబట్టి, అవి రోడ్డుపై ఈడ్చుకొని పోవు, ఫలితంగా స్టాపింగ్ డిస్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి, ఏబిఎస్ ఉన్న కార్లు ఎమెర్జెన్సీ బ్రేకింగ్ సమయంలో తక్కువ ప్రమాదాలకు గురవుతాయి.

మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

ఎయిర్‌బ్యాగ్స్ మాదిరిగానే, ఒకప్పుడు కార్లలో ఏబిఎస్ అనేది ఓ ఖరీదైన సేఫ్టీ ఫీచర్‌గా ఉండేది మరియు టాప్-ఎండ్ వేరియంట్లలో లేదా ఆప్షనల్‌గా ఇది లభించేంది. అయితే, ఇటీవలి కాలంలో కార్లలో (250సిసి దాటిన మోటార్‌సైకిళ్లలో కూడా) ఈ సేఫ్టీ ఫీచర్ తప్పనిసరి చేయబడింది. ఎమర్జెన్సీ బ్రేకింగ్ సమయంలో ఏబిఎస్ కారు ఆగినట్లుగా మీ పాత కారు (ఏబిఎస్ లేనిది) ఆగకపోవచ్చు. కాబట్టి, మీరు ఇప్పటికీ అలాంటి పాత కార్లను ఉపయోగిస్తుంటే, దానిని కొత్త మరియు మరింత సురక్షితమైన కారుతో భర్తీ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తించుకోండి.

మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

3. టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (TPMS)

టిపిఎమ్ఎస్ అంటే (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్). పేరుకు తగినట్లుగా ఈ వ్యవస్థ టైర్లలోని గాలిని మరియు వాటి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. ప్రతిరోజు మనం కారులో బయలుదేరే ముందు దాని టైర్లలో గాలిని మ్యాన్యువల్‌గా చెక్ చెస్తుంటాం. అయితే, ఇప్పుడు ఈ పనిని టిపిఎమ్ఎస్ చేస్తుంది. అంటే, ప్రతిసారి బాహ్య టైర్ ప్రెజర్ మానిటరింగ్ గేజ్‌ని ఉపయోగించి టైర్ ప్రెజర్‌ను పర్యవేక్షించడానికి బదులుగా, ఆ పనిని ఇది ఆటోమేటిక్‌గా చేసి, అవసరమైనప్పుడు గాలి నింపుకోమని యజమానులకు సూచిస్తుంది.

మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

డ్యాష్‌బోర్డ్ పై ఈ సింబల్ ఆన్ అయిందంటే, ఏదొ ఒక టైరులో సమస్య ఉందని గుర్తుంచుకోవాలి. కొన్ని అధునాతన కార్లలో జస్ట్ సింబల్‍‌కు బదులుగా ఏ టైరులో ఎంత గాలి ఉందనే విషయాన్ని కూడా ఇది డ్యాష్‌బోర్డులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‍‌పై ప్రదర్శింపజేస్తుంది మరియు టైరు పంక్చర్ అయినా ఇది సూచిస్తుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని కార్లలో టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా లభిస్తుంది. కావాలనుకుంటే, దీనిని బయటి మార్కెట్ నుండి కూడా యాక్ససరీగా కొనుగోలు చేయవచ్చు. కాబట్టి, మీ పాత కారులో ఇలాంటి లేటెస్ట్ ఫీచర్‌ను యాడ్-యాన్ యాక్ససరీగా జోడించుకోవచ్చు.

మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

4. ఆండ్రాయిడ్ ఆటో / యాపిల్ కార్‌ప్లే Android Auto / Apple CarPlay

స్మార్ట్‌ఫోన్లు చేతుల్లోకి వచ్చిన తర్వాత ప్రపంచ మొత్తం దానికి బానిసైపోయింది. ఇప్పుడు ఏ పనిచేయాలన్నా అన్నీ ఫోన్ ద్వారానే జరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో కార్లలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్లు పెద్ద చర్చనీయాంశంగా ఉన్నాయి. కార్ల తయారీదారులందరూ ఈ ఫీచర్ ని హైలైట్ చేసి, కొనుగోలుదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా ఒక దశాబ్దం వెనక్కి వెళితే, కేవలం ఖరీదైన ప్రీమియం లగ్జరీ కార్లలో మాత్రమే ఇలాంటి స్క్రీన్‌లతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ అందుబాటులో ఉండేది.

మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

అయితే, విపరీతంగా పెరిగిన పోటీ మరియు సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ పరికాల కారణంగా, ఇప్పుడు రెనాల్ట్ క్విడ్ స్పోర్ట్ వన్ వంటి ఎంట్రీ-లెవల్ కార్లలో కూడా ఇలాంటి ఫీచర్లు లభిస్తున్నాయి. ఈ ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్ కేవలం వినోద ప్రదర్శనకు మాత్రమే కాకుండా, వాటిని కస్టమర్ల స్మార్ట్‌ఫోన్లతో కనెక్ట్ చేసుకుని, వివిధ రకాల ఫీచర్లను మరియు యాప్స్‌ను యాక్సెస్ చేసుకునేందుకు వీలుగా ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి కనెక్టివిటీ ఫీచర్‌లు అందుబాటులోకి వచ్చాయి.

మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

వీటికి తోడు కార్ కంపెనీలే తమ స్వంత కనెక్టింగ్ టెక్నాలజీ ఫీచర్లను కూడా అందిస్తున్నాయి. ఈ కనెక్టివిటీ ఫీచర్ల సాయంతో యూజర్లు తమ చేతివేళ్ల నుండే కారులోని అనేక ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు మరియు కారు యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకోవచ్చు. కాల్స్, మెసేజెస్, వాట్సాప్, సోషల్ మీడియా, సంగీతం వంటి వాటుతో పాటుగా కారు యొక్క మైలేజ్, మిగిలిన ఇంధనంతో ప్రయాణించగల దూరం, ఇంజన్ డయాగ్నోస్టిక్స్ వంటి పలు ఇతర వివరాలను కూడా తెలుకోవచ్చు. వీటన్నింటికీ మించి గూగుల్ మ్యాప్స్ లేదా యాపిల్ మ్యాప్స్ సాయంతో సెంటర్ స్క్రీన్‌పై నావిగేషన్ ను కూడా పొందవచ్చు.

మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

5. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ (Automatic Cilmate Control)

ఒకప్పుడు కార్లలో టెంపరేచర్‌ను మనకు తగినట్లుగా కంట్రోల్ చేసుకోవాలంటే, డ్యాష్‌బోర్డులో ఉండే గుండ్రటి నాబ్‌లను అటూ ఇటూ తిప్పుతూ ఉండాలి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ పేరుకు తగినట్లుగానే బయటి వాతావరణాన్ని బట్టి కారులోని ఉష్ణోగ్రతలను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుండి. బయటి వాతారణం వేడిగా ఉంటే, కారు లోపలి వాతావరణాన్ని చల్లబరచడం లేదా బయటి వాతరణం మరీ చల్లగా ఉంటే కారు లోపలి వాతావరణాన్ని వేడిగా చేయడం చేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తిగా ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఇందుకోసం కారు విండ్‌షీల్డ్ భాగంలో కొన్ని సెన్సార్లు ఉంటాయి. ఇవి బయటి వాతవరణ పరిస్థితులను అనుసరించి కారు లోపల వాతావరణాన్ని నియంత్రిస్తాయి.

మీరు వాడే కారులో ఈ 5 ఫీచర్లు లేవా..? అయితే ఇక దానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని గుర్తించండి..!

ఇదండీ సంగతి.. ప్రస్తుతం కారును కొనుగోలు చేసేవారు తప్పనిరిగా గమనించాల్సిన ఫీచర్ల జాబితాలో ఈ ఐదు ఫీచర్లు కూడా చాలా ప్రధానమైనవే. వీటిలో మొదటి మూడు కారులో తప్పనిసరిగా ఉండాల్సిన భద్రతా ఫీచర్లు కాగా, మిగిలిన రెండూ మీకు కారులో మరింత కంఫర్ట్‌ను అందించే సౌకర్యవంతమైన ఫీచర్లు. మరి మీ పాత కారులో ఇలాంటి ఫీచర్లు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ లేనట్లయితే, ప్రస్తుతం పాత కార్ల స్క్రాపింగ్ పాలసీలో భాగంగా ప్రభుత్వం మరియు తయారీదారులు అందిస్తున్న ప్రోత్సాహకాలను క్యాష్ చేసుకొని, దాని స్థానంలో మరింత సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన కొత్త కారును కొనుగోలు చేయండి.

Most Read Articles

English summary
If your car is missing these 5 features then consider that its time for an upgrade
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X