చిన్న తప్పిదం 11 మంది మృతి: టైర్ల వలన జరిగే ప్రమాదాలను ఇలా నివారించండి.

By Anil

విశాఖ పట్నం జిల్లా నక్కపల్లి సమీపంలోని వెదురుపాలెం వద్ద గల జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమదం జరిగింది. ఎవరి ప్రమేయ లేకుండా జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 11 మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఒక చిన్న కారణంతో 11 మంది రెప్పపాటు సమయంలో శివైక్యం చెందారు.

కారణం: వేగంగా వెళుతున్న కారు ఉన్నట్లుండి పేళడం వలన ఈ ఘోరం జరిగింది. వేసవి కాలంలో తరచుగా జరగే ప్రమాదాలలో ఎక్కువ కారణం ఇలా టైర్లు పేళడం - అందు కోసం టైర్లు పేళడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, చిట్కాలు తెలుగు డ్రైవ్‌స్పార్క్ క్రింది కథనం ద్వారా అందిస్తోంది. క్రింద గల స్లైడర్లను చదవండి వాహనం నడుపుతున్నపుడు వీటిని పాటించి సురక్షింతంగా గమ్యస్థానాలను చేరుకోండి.

ఘోరం

ఘోరం

ఒక ప్రమాదం జరిగే తప్ప వాటికి చెందిన కారణాలు నెమరు వేసుకోము. ప్రమాదం జరిగిన తరువాత వాటి గురించి తలుచుకుని భాదపడతాము. అయితే టైర్లను ఏ మాత్రము పరీక్షించుకోకుండా టాటా సఫారిలో బెంగళూరు నుండి ఊటీ ప్రయాణమయిన ఆరుగురిలో ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు.

Image Source: The Covai Post

టైర్లు పేళడానికి ఉన్న అవకాశాలు

టైర్లు పేళడానికి ఉన్న అవకాశాలు

ఎండాకాలంలో తారు రోడ్లు విపరీతమైన వేడిని కలగి ఉంటాయి. అంతే కాకుండా ఎండా కాలంలో ఈ వేడి ద్వారా టైర్లు ఎంతో సులభంగా వేడెక్కిపోతాయి. ఈ కారణాల వలన టైర్లు ఎక్కువగా పేళుతాయి. మరి మీరు ఈ వేసవి కాలంలో టూర్‌కు వెళ్లాలనుకుంటున్నారా ? అయితే మీరు తప్పకుండా తరువాత స్లైడర్ల ద్వారా లభించే సమాచారాన్ని చదవాల్సిందే.

Image Source: The Covai Post

సరైన పరిమాణంలో గాలిని నింపండి

సరైన పరిమాణంలో గాలిని నింపండి

వేసవి కాలంలో మీ వాహనాలకు నిర్దేశించిన పరిమాణంలో గాలిని నింపండి. అలా సరైన పరిమాణంలో గాలిని నింపకపోతే, టైర్లు కాస్త రోడ్డుకు అత్తుక్కుని ప్రయాణిస్తాయి. తద్వారా ఎక్కువ వేడిగా ఉన్న రోడ్డు ఎక్కువ పరిమాణంలో టైర్లకు చేరుతుంది. అందువలన టైర్లు పగిలిపోవడం మరియు పేళిపోవడం వటివి జరుగుతాయి.

 వీల్ బ్యాలెన్స్ మరియు అలైన్‌మెంట్

వీల్ బ్యాలెన్స్ మరియు అలైన్‌మెంట్

టైర్లు అధికంగా అరిగిపోయి ఉన్నప్పుడు మరియు సరిగా ఫిట్ చేయనపుడు మీ కారులోని చక్రాలకు వీల్ బ్యాలెన్సింగ్ చేయించుకోవాలి. ఈ సమస్య వలన వాహనం యొక్క సస్పెన్షన్ మరియు స్టీరింగ్ మీద అధిక ఒత్తిడి పడుతుంది. తద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ఆస్కారముంది. వేసవి కాలంలో అయితే ఇది మరింత భయంకరంగా ఉంటుంది. కాబట్టి ప్రయాణానికి ముందుగా ఈ అంశం పరంగా మీ టైర్లను చెక్ చేసుకోండి.

 సరైన కొతలలో ఉన్నాయా ...?

సరైన కొతలలో ఉన్నాయా ...?

చాలా వరకు కార్ల తయారీ సంస్థలు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుని వారి వాహనాలకు టైర్లను డిజైన్ చేస్తారు. వాటికి సరియైన కొలతలలో టైర్లను అందిస్తారు. అయితే చాలా మంది తమ ఎస్‌యువి వాహనాలకు ఇతర టైర్లను వాడుతారు. టైర్లు యొక్క కొలతలు పెరిగినా లేదా తగ్గినా ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా వరకు ఇతర టైర్ల వినియోగానికి దూరంగా ఉండండి.

 టైర్లను ఇలా చెక్ చేసుకోండి

టైర్లను ఇలా చెక్ చేసుకోండి

దూర ప్రాంత ప్రయాణానికి అంటే చాలా మంది తమ కార్లకు 10 రోజులు ముందుగానే పూర్తి స్థాయిలో సర్వీసింగ్ చేయిస్తారు. అయితే ఎంతో ముఖ్యమైన టైర్ల గురించి మరిచిపోతుంటారు. అయితే మీ కారు టైర్లు ఫ్లాట్‌గా ఉంటే చాలా వరకు అరిగిపోయాయని అర్థం కాబట్టి వెంటనే కొత్త టైర్లతో పాత వాటిని మార్చివేయడం మంచిది. అంతే కాకుండా అదనంగా ఏర్పాటు చేసుకున్న టైరును కూడా ఇదే తరహాలో చెక్ చేసుకోవడం మంది. ప్రాణాల కన్నా డబ్బు విలువైనది కాదు కాబట్టి కొత్త టైర్లను తీసుకోండి.

 టైర్లు మార్చే పద్దతి

టైర్లు మార్చే పద్దతి

చాలా మంది టైర్లను మార్చే ప్రక్రియలో ఒకే విధమైన తప్పులు చేస్తుంటారు. అందులో ముఖ్యంగా ఒకటి లేదా రెండు టైర్లను మాత్రమే మార్చడం. దీని వలన రెండు మంచివి మరియు రెండు అరిగిపోయినవి ఉండటం వలన మైలేజ్ రాకపోవడం, పేళడం మరియు భారీ స్థాయిలో ప్రమాదాలు సంభవించడం జరుగుతుంటాయి. కాబట్టి నాలుగు టైర్లను ఒకే సారి మార్చడం ఎంతో ఉత్తమం. మీరు వేసుకున్న జోళ్లలో ఒకటి అరిగిపోతే దానిని మాత్రమే కొంటారా లేక జతను కొంటారా ? దీనిని మించిన ఉదాహరణ మరొకటి ఉండదు.

బ్రాండెడ్ టైర్లను

బ్రాండెడ్ టైర్లను

చాలా మంది టైర్ల ధరలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన బ్రతుకు బండిని నడిపే చక్రాలను తక్కువ ధరతో నాణ్యతారాహిత్య టైర్లను కొనుగోలు చేయడం ఎంత వరకు సబబు మీరే నిర్ణయించుకోండి. మంచి కంపెనీకి చెందిన అధిక కాలం మన్నే టైర్లను కొనుగోలు చేయడం వలన వాటి జీవితంతో పాటు మన జీవిత కాలం కూడా పెరుగుతుంది.

అన్ని విధాలా సరిపోతేనే...!

అన్ని విధాలా సరిపోతేనే...!

చక్కటి టైర్లు, వాటికి కావాల్సిన పరిమాణంలో గాలి మరియు ఎటువంటి సమస్య లేని టైర్లు ఉన్నాయి అని మీరు నమ్మినపుడు మీ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఇలా చేస్తే మీతో పాటు మీ కుటుంబం కూడా ఎంతో సురక్షితంగా ఉంటుంది.

 అధిక వేగంతో నడపడం

అధిక వేగంతో నడపడం

ఇండియన్ మార్కెట్లో గల ఒక్కో కారుకి ఒక్కో విధమైన వేగపు పరిమితులను కలిగి ఉన్నాయి. కారణం వాటి టైర్లకు చెందిన కొలతలు. మీరు అధిక వేగంతో మీ కారును నడిపినపుడు టైర్లు, వేగం ద్వారా ఉద్భవించే వేడికి లోనవుతాయి ఆ వేడి వలన ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వేసవి కాలంలో నిర్ణీత వేగంలో వాహనాలను నడపడం ఎంతో ఉత్తమం.

విశ్రాంతి

విశ్రాంతి

ఎండా కాలంలో ఎక్కువ సేపు పని చేస్తే కాసేపు విశ్రాంతిని ఎలా కోరుకుంటామో. అలాగే ఎక్కువ సేపు వేసవిలో పరుగులు పెట్టే కార్లకు కూడా విశ్రాంతి ఇవ్వాలి. ప్రతి రెండు గంటలకొకసారి 10 నిమిషాల పాటు కారును ఆపడం మంచిది. తద్వారా టైర్లు మరియు ఇంజన్ యొక్క వేడిని తగ్గించిన వాళ్లమవుతాము.

 నైట్రోజన్ గ్యాస్ నింపండి

నైట్రోజన్ గ్యాస్ నింపండి

టైర్లలో గాలిని నింపుతున్నారా ? వీలైతే నైట్రోజన్ గాలిని నింపండి. ఎందుకంటే వేసవికాలంలో టైర్లకు నైట్రోజన్ గాలి ఎంతో ఉపశమనంగా ఉటుంది.

కొత్త టైర్లు

కొత్త టైర్లు

ప్రతి ఏడాది వేసవి కాలంలో టైర్లకు చెందిన మెయిటెనెన్స్ చేయడం బరువుగా ఉంటే కొత్త టైర్లను మార్చేసుకోండి. తద్వారా, ఏదో జరుగుతుందనే భయం లేకుండా హై వేల మీద అత్యంత వేగంతో అతి తక్కువ కాలంలో మీ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోగలరు.

 మరిన్ని కథనాల కోసం......
  • ట్యూబ్ లెస్ టైర్ల యొక్క ప్రయోజనాలు మరియు ప్రతి కూలతలు: నిపుణుల మాటల్లో...
  • వేసవి కాలంలో ఎండవేడిమి నుండి మీ కారును రక్షించుకోవడానికి శక్తివంతమైన చిట్కాలు
  • సమ్మర్‌లో రైడింగ్ చేస్తున్నారా ? అయితే ఇవి పాటించండి

Most Read Articles

English summary
Tyre Explosion Leads To Accident; Here Are Tips To Avoid Such Mishaps Read now in telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X