సముద్ర వంతెన మీద అత్యంత సుందరమైన రన్‌వే నిర్మిస్తున్న భారత్

Written By:

భారత ప్రభుత్వం సముద్ర వంతెన తొలి రన్‌వే నిర్మించడానికి సిద్దమైంది. లక్షద్వీప్ దీవుల్లోని అగత్తి ఐలాండ్‌లో ఉన్న అత్యంత సుందరమైన రన్‌వే స్థానంలో భారతదేశపు తొలి సముద్ర వంతెన రన్‌వేను భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ నిర్మించనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
భారతదేశపు తొలి సముద్ర వంతెన రన్‌వే

భారత దేశపు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటయిన లక్షద్వీప్ దీవుల సముదాయంలోని అగత్తి ద్వీపఖండములో ఉన్న విమానాశ్రయంలో కాంక్రీట్‌తో విశాలమైన వంతెనను నిర్మించి దాని మీద రన్‌వే నిర్మించడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) అనుమతులు పొందింది.

Recommended Video - Watch Now!
High Mileage Cars In India - DriveSpark
భారతదేశపు తొలి సముద్ర వంతెన రన్‌వే

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తమ అగత్తి దీవిలో ఉన్న లక్షద్వీప్ రన్‌వే పొడగించాలనే నిర్ణయానికి సానుకూల అనుమతులు లభించాయి. AAI మేరకు, అగత్తి విమానాశ్రయానికి అనుకుని ఉన్న మరికొన్ని చిన్న చిన్న దీవులను కలుపుతూ సముద్రం మీద పెద్ద వంతెన నిర్మించనుంది.

భారతదేశపు తొలి సముద్ర వంతెన రన్‌వే

భారీ విమానాలు రాకపోకలు సాగించడానికి, వివిధ రకాల విమానయాన సేవలతో పాటు ఇతర విమానాల పార్కింగ్ మరియు అత్యవసర సేవలకు ఉపయోగించుకునేలా పొడవాటి రన్‌వే ను ఈ వంతెన మీద నిర్మించనున్నారు.

భారతదేశపు తొలి సముద్ర వంతెన రన్‌వే

పర్యావరణ సంబంధిత ఆందోళనల కారణంగా అక్కడున్న చిన్న చిన్న ద్వీపాలని కలిపేయాలని తీసుకున్న నిర్ణయాన్ని మార్చడం జరిగింది. అయితే, పర్యావరణానికి హాని కలగకుండా ద్వీపాల్లోని సముద్రం తీరంలో కాంక్రీట్ పిల్లర్లు నిర్మించి వాటి ఆధారంగా రన్ వే పొడవును కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

భారతదేశపు తొలి సముద్ర వంతెన రన్‌వే

ఈ మొత్తం ప్రాజెక్టుకు సుమారుగా రూ. 1,500 కోట్ల రుపాయలను కేంద్రం ఖర్చు చేయనుంది. ఈ రన్‌వే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటిఆర్-72 మరియు ఈ శ్రేణి విమానాలను మాత్రమే రన్‌వే మీద అనుమతించనున్నారు.

Trending On DriveSpark Telugu:

ఇండియాలో ఉన్న ఆరు అందమైన ఎయిర్‌పోర్ట్‌లు

ఇండియాలో అత్యంత పొడవైన రన్‌వేలు ఉన్న 10 విమానాశ్రయాలు

ఈ రన్‍‌వే మీద కేవలం ఎనిమిది పైలట్లు మాత్రమే విమానాలు ల్యాండింగ్ చేయగలరు

భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు

భారతదేశపు తొలి సముద్ర వంతెన రన్‌వే

ఒక్కో విమానంలో 50 మంది ప్రయాణికులు ఒక్కో ప్రయాణికుడికి 15 కిలోల లగేజ్ మాత్రమే ఈ రన్‌వే అనుమతిస్తుంది. విమానల ల్యాండింగ్ మరియు టేకాఫ్ వంటి అంశాల భద్రత దృష్ట్యా AAI ఈ నిర్ణయం తీసుకుంది.

భారతదేశపు తొలి సముద్ర వంతెన రన్‌వే

కొత్తగా అభివృద్ది చేస్తున్న ఈ ఎయిర్‌పోర్ట్‌లో సరసమైన ఛార్జీలు మాత్రమే ఉండనున్నాయి. భారతదేశపు మొదటి సముద్ర వంతెన రన్‌వే గల విమానాశ్రయంగా అగత్తి ఎయిర్‌పోర్ట్ మొదటి స్థానంలో నిలవనుంది.

భారతదేశపు తొలి సముద్ర వంతెన రన్‌వే

ముంబాయ్ మరియు కుల్లు ప్రాంతాల్లో ఉన్న జూహు ఎయిర్ ‌పోర్ట్‌లో కూడా సముద్ర వంతెన మీద రన్‌వే నిర్మించాలని భావించినప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో లక్షద్వీప్ దీవుల్లోని అగత్తి విమానాశ్రయంలో సముద్ర వంతెన రన్‌వేను నిర్మించడానికి కేంద్రం సిద్దమైంది.

Picture credit: Lakshadweep NIC

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: India Will Soon Have Its First Runway On A 'Sea Bridge' At Lakshadweep's Agatti Airport
Story first published: Thursday, December 28, 2017, 19:08 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark