ఇండియన్ ఆర్మీలో చేరనున్న కళ్యాణి ఎమ్4 వాహనాలు, పూర్తి వివరాలు

భారతదేశానికి రక్షణ కవచం మన భారత సైనికదళం. భారతదేశం యొక్క పటిష్టమైన భద్రతలో చాలా పాత్రవహిస్తున్న సైనికదళం మరింత పటిష్టం కావడానికి తగిన ఆయుధ బలాలు కూడా అవసరం. ఇప్పటికే చాలా బలమైన ఆయుధాలు ఉన్నప్పటికీ, ఇటీవల భారత రక్షణ మంత్రిత్వ శాఖ కొత్త సాయుధ వాహనాల కోసం భారత్ ఫోర్జ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఇండియన్ ఆర్మీలో చేరనున్న కళ్యాణి ఎమ్4 వాహనాలు

భారత రక్షణ మంత్రిత్వ శాఖ, భారత్ ఫోర్జ్‌తో కళ్యాణి ఎమ్4 సాయుధ వాహనాలకు రూ. 177.95 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. భారత ప్రభుత్వ ఈ ఒప్పందం స్వావలంబన భారత ప్రచారాన్ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన ప్రయత్నంగా పరిగణించబడుతుంది. భారత్ ఫోర్జ్‌ పూణేకు చెందిన మల్టినేషనల్ కంపెనీ,

ఇండియన్ ఆర్మీలో చేరనున్న కళ్యాణి ఎమ్4 వాహనాలు

ఈ‌ కంపెనీ డిఫెన్స్, పెట్రోలియం, మైనింగ్, రైలు, మెరైన్, ఏరోస్పేస్ వంటి అనేక రంగాలకు కావలసిన వాటిని అందిస్తుంది. కళ్యాణి ఎమ్4 భారత సైన్యం కోసం భారత్ ఫోర్జ్ తయారు చేసిన ప్రత్యేక సాయుధ వాహనం, దీనిని యుద్ధం మరియు విపత్తు సమయాల్లో ఉపయోగించవచ్చు. ఈ వాహనం భారత సైన్యం యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది.

MOST READ:కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

ఇండియన్ ఆర్మీలో చేరనున్న కళ్యాణి ఎమ్4 వాహనాలు

కల్యాణి ఎమ్4 ల్యాండ్‌మైన్స్, గ్రెనేడ్లు, తుపాకులు మొదలైనవాటి నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇందులో 8 మంది ఆర్మీ సిబ్బంది ఏ ప్రదేశానికయినా సులభంగా ప్రయాణించడానికి అనుకూలంగా తయారుచేయబడింది. ఈ వాహనం సురక్షితమైన, శక్తివంతమైన మరియు చాలా వేగవంతమైన వాహనం.

ఇండియన్ ఆర్మీలో చేరనున్న కళ్యాణి ఎమ్4 వాహనాలు

కల్యాణి ఎమ్4 వాహనంలోని ఇంజిన్ 465 బిహెచ్‌పి పవర్ మరియు 1627 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ గణాంకాల ప్రకారం ఇది సైన్యం ఉపయోగించే అనేక వాహనాల కంటే ఇది శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది.

MOST READ:ఈ బస్సులు కేవలం మహిళలకు మాత్రమే.. టికెట్ కూడా 5 రూపాయలే.. ఎక్కడో తెలుసా?

ఇండియన్ ఆర్మీలో చేరనున్న కళ్యాణి ఎమ్4 వాహనాలు

కల్యాణి ఎమ్4 మొత్తం బరువు 16 టన్నులు, కానీ ఇది 2.6 టన్నుల బరువును మోయగలదు. ఇంత భారీగా ఉన్నప్పటికీ, దాని గరిష్ట వేగం గంటకు 140 కిలోమీటర్లు. కల్యాణి ఎమ్4 అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇవి సాధారణ సాయుధ వాహనాలకంటే కొంత భిన్నంగా ఉంటుంది.

ఇండియన్ ఆర్మీలో చేరనున్న కళ్యాణి ఎమ్4 వాహనాలు

ఈ కళ్యాణి ఎమ్4 వాహనంలో పటిష్టమైన టైర్లు అమర్చబడి ఉంటాయి. వీటిపై కాల్చినప్పటికీ అవి పంక్చర్ అయ్యే అవకాశం లేదు. ఈ వాహనాన్ని ఒక మీటర్ లోతైన నీటిలో కూడా సులభంగా డ్రైవ్ చేయవచ్చు. కొన్ని కఠినమైన మార్గాలలో డ్రైవ్ చేయడానికి కూడా అనుకూలంగా తయారుచేయబడింది.

MOST READ:హైదరాబాద్‌ నగరంలో 40 మందికి పైగా వాహనదారులు అరెస్ట్.. కారణం ఇదే

ఇండియన్ ఆర్మీలో చేరనున్న కళ్యాణి ఎమ్4 వాహనాలు

కళ్యాణి ఎమ్ 4 యొక్క డ్రైవర్ క్యాబిన్ చాలా ఆధునిక పరికరాలతో తయారై ఉంటుంది. దీని లోపల ఒక పెద్ద స్క్రీన్ వ్యవస్థాపించబడింది, ఇందులో ఉన్న కెమెరా ద్వారా బయట జరుగుతున్న కార్యకలాపాలను గమనించవచ్చు. ఇందులో జిపిఎస్ ట్రాకింగ్ కూడా వ్యవస్థాపించబడింది. అంతే కాకుండా మెరుగైన బ్రేకింగ్ సిస్టం కోసం ఇందులో, డిస్క్ బ్రేక్‌లతో అమర్చబడి ఉంటాయి. ఇంధన ట్యాంక్ నిండినప్పుడు కల్యాణి ఎమ్4 వాహనం దాదాపు 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

Source: Punekarnews

Most Read Articles

English summary
Indian Army Orders Kalyani M4. Read in Telugu.
Story first published: Monday, March 22, 2021, 9:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X