పాక్ అంతం తద్యం అంటున్న ఇండియా-రష్యా భారీ ఒప్పందం

చాటు మాటున నక్కి ఉంటూ భారతీయ సైన్యం మీదకు దాడులకు పాల్పడుతున్న పాక్ ముష్కరులను మట్టుబెట్టేందుకు భారత్ మరియు రష్యా మరో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

By Anil

రెండు అతి పెద్ద దేశాలు అన్ని రంగాల పరంగా పరస్పర ఒప్పందాల కుదుర్చుకుంటూ ప్రంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. భారత్ మరియు రష్యా దేశాల యొక్క దౌత్య సంభందాలు నానాటికీ మెరుగుపడుతూనే ఉన్నాయి. ఎంతగా అంటే ఈ రెండు అతి పెద్ద దేశాలు ఉగ్రవాద నిర్మూలన కోసం కలిసి మెలసి ముందుకు సాగుతున్నాయి.

భారత్ రష్యా యుద్ద ట్యాంకుల ఒప్పందం

ఈ తరుణంలో ఉగ్రవాదానికి ఉగ్గుపాలు పోసి పోషిస్తున్న పాక్ మరియు చైనాతో తీవ్ర ముప్పును ఎదుర్కుంటున్న భారత్‌కు యుద్ద వాహనాల సరఫరాలో కీలక భూమికను పోషిస్తోంది రష్యా. శక్తివంతమైన యుద్ద ట్యాంకుల సరఫరాలో ఇరు దేశాలు పరస్పరం ఒప్పందానికి సుముఖంగా ఉన్నాయి.

భారత్ రష్యా యుద్ద ట్యాంకుల ఒప్పందం

ఇండియన్ ఆర్మీ రష్యా నుండి అత్యాధునిక టి-90 యుద్ద ట్యాంకులను సుమారుగా 464 సంఖ్యలో కొనుగోలు చేయడానికి సుముఖంగా ఉంది.

భారత్ రష్యా యుద్ద ట్యాంకుల ఒప్పందం

పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత్ సైనిక ధళాలకు వీటిని సరఫరా చేసే సదాలోచనలో ఉన్నారు ఆర్మీ అధికారులు.

భారత్ రష్యా యుద్ద ట్యాంకుల ఒప్పందం

సుమారుగా 13,448 కోట్లు రుపాయల విలువైన ఈ ఒప్పందంలో భాగంగా మేకిన్ ఇండియా అంశం ద్వారా చెన్నైలోని అవడి హెవీ వెహికల్ ఫ్యాక్టరీ యొక్క సమగ్రతకు ప్రాధాన్యతను కల్పిస్తున్నారు.

భారత్ రష్యా యుద్ద ట్యాంకుల ఒప్పందం

మన సైనికులు చీకటిలో కూడా థర్మల్ శక్తి ద్వారా శత్రువులను గుర్తించి వారి మీద దాడులు నిర్వహించే విధంగా టి-90 యుద్ద ట్యాంకర్లను అభివృద్ది చేస్తున్నారు. వీటిని పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పది సైనిక ధళాలకు సరఫరా చేయనుంది ఆర్మీ.

భారత్ రష్యా యుద్ద ట్యాంకుల ఒప్పందం

పాకిస్తాన్‌తో భూ భాగపు సరిహద్దు గల జమ్మూలోని ఉత్తర దిశ నుండి గుజరాత్‌లోని పశ్చిమ పార్శ్వం వరకు ఉన్న నియంత్రణ రేఖ వద్ద గస్తీ కాస్తున్న సైనిక ధళాల యొక్క బలాన్ని పెంచడానికి అధునాతన యుద్ద ట్యాంకర్లను అందివ్వనున్నారు.

భారత్ రష్యా యుద్ద ట్యాంకుల ఒప్పందం

ప్రస్తుతం ఈ ఒప్పందానికి సంభందించిన ప్రతిపాదనలు భారతదేశ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మరియు ఆర్మీలో ఆయుధ సామాగ్రిని చేకూర్చే కౌన్సిల్ చేత ఆమోదం పొందాల్సి ఉంది.

భారత్ రష్యా యుద్ద ట్యాంకుల ఒప్పందం

ఇప్పటి భారత్ సైన్యంలో ఉన్న సుమారుగా 18 సైనిక ధళాల వద్ద కొన్ని టి-90 యుద్ద ట్యాంకులు ఉన్నాయి. ఈ ధళాలు పాకిస్తాన్‌తో గరిష్ట ముప్పును ఎదుర్కొంటున్న రాజస్థాన్ మరియు పంజాబ్ సరిహద్దుల్లో ఉన్నాయి.

భారత్ రష్యా యుద్ద ట్యాంకుల ఒప్పందం

ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆమోదానికి సిద్దంగా ఉన్న ఒప్పందం ద్వారా అత్యాధునిక శ్రేణి యుద్ద ట్యాంకుల సేరణే ముఖ్యం లక్ష్యం అని తెలిసింది. భారత సైన్యం వద్ద ఉన్న మొత్తం యుద్ద ట్యాంకర్ల కంటే ఇవి అత్యంత శక్తివంతమైనవిగా తెలుస్తోంది.

భారత్ రష్యా యుద్ద ట్యాంకుల ఒప్పందం

ఇప్పటికే ఇండియన్ ఆర్మీ వద్ద 4000 యుద్ద ట్యాంకులు ఉన్నాయి. వీటితో పగలు మరియు రాత్రుల్లో దాడులను ఎదుర్కుంటోంది.

భారత్ రష్యా యుద్ద ట్యాంకుల ఒప్పందం

ఈ అధునాతన టి-90 యుద్ద ట్యాంకర్లలో అత్యాధునిక మిస్సైల్ ఫైరింగ్ వ్యవస్థ, దాడులు నిర్విహించిన తరువాత చెలరేగే మంటలు మరియు ధుమ్ము, ధూళి కణాలలో కూడా శత్రువులను థర్మల్ శక్తి ద్వారా వీక్షించే పరిజ్ఞానం కలదు.

భారత్ రష్యా యుద్ద ట్యాంకుల ఒప్పందం

భారతీయు సైన్యంలోకి ప్రవేశిస్తున్న ఈ టి-90 యుద్ద ట్యాంకర్లు అత్యంత శక్తివంతమైనవి ఇవి ప్రస్తుకతం సైన్యం వద్ద ఉన్న టి-72 మరియు టి-55 ట్యాంకర్ల స్థానాలను భర్తీ చేయనున్నాయి.

భారత్ రష్యా యుద్ద ట్యాంకుల ఒప్పందం

ప్రస్తుతం ఇండియా వద్ద 850 టి-90 యుద్ద ట్యాంకర్లు ఉన్నట్లు సమాచారం, 2020 నాటికి వీటి సంఖ్యను 1,657 కు పెంచాలని అధికారులు భావిస్తున్నారు.

భారత్ రష్యా యుద్ద ట్యాంకుల ఒప్పందం

భారత్ మరియు రష్యా సైనిక సహకారాల్లో సుమారుగా 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. మిలిటరీ హార్డ్‌వేర్ కోసం న్యూ ఢిల్లీ ఎక్కువగా మాస్కో మీద ఆధారపడుతోంది. సుమారుగా 70 శాతం సాంకేతికను మాస్కో నుండి మన సైన్యానికి అందిస్తున్నాము. గత కొన్నేళ్ల నుండి అమెరికా మరియు యూరప్ దేశాల మీద ఆధారపడినప్పటికీ వాటిని నుండి ఎప్పటికప్పుడు వీడిపోతూనే ఉంది భారత రక్షణ రంగం.

భారత్ రష్యా యుద్ద ట్యాంకుల ఒప్పందం

  • ఇండియన్ మిలిటరీలో ఉన్న వీటిని వినియోగిస్తే పాక్ అంతమే
  • యుద్దానికి సిద్దమైన ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్ మరియు నేవీ

Most Read Articles

English summary
Read In Telugu: Indian Army To Buy 464 T-90 Battle Tanks Worth US$ 2B
Story first published: Wednesday, November 2, 2016, 13:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X