ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్ నిర్మిస్తున్న ఇండియన్ రైల్వే

Written By:

దశాబ్దం పాటు ఇండియన్ రైల్వేలో ఎన్నో మార్పులు సంతరించుకుంటూ వచ్చాయి. కొత్త రైలు సర్వీసులను ప్రారంభించడం, రైళ్లలో ఫీచర్లను అందివ్వడం, అనేక ప్రాంతాలకు సేవలను విస్తరింపజేయడం, సురక్షితమైన మరియు వేగవంతమైన సర్వీసులను అందివ్వడంలో మంచి ఫలితాలను సాధించింది. వీటితో పాటు దేశ మొత్తం గర్వించదగ్గ ఓ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది ఇండియన్ రైల్వే.

ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్

ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్ నిర్మించడానికి ఇండియన్ రైల్వే సిద్దం అవుతోంది. ప్రస్తుతం ఈ రికార్డ్ చైనా రైల్వే ఖాతాలో ఉంది. బిలాస్‌పూర్-లేహ్-మనాలి మీదుగా హిమాలయాల్లో ఇండియన్ రైల్వే నిర్మించతలపెట్టిన రైల్వే లైన్ పూర్తయితే, చైనా నిర్మించిన టిబెట్ రైల్వే లైన్ రెండవ స్థానానికే పరిమితం.

ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్

జమ్మూ కాశ్మీర్‌లోని బిలాస్‍‌పూర్-మనాలి-లేస్ ప్రాంతాల మీదుగా సుమారుగా 498 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇందుకు రైల్వే లైన్ వెళ్లే ప్రాంతాలను గుర్తించేందుకు చివరి దశ సర్వే ఈ వారంలో ప్రారంభించనున్నారు.

ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్

3,300 మీటర్ల ఎత్తులో నిర్మించ తలపెట్టిన రైల్వే లైన్ పూర్తయితే, చైనా రైల్వే విభాగంలో ఉన్న క్వింఘాయ్-టిబెట్ రైల్వే లైన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైనుగా రికార్డుకెక్కనుంది.

ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్

ఈ రైల్వే లైను కోసం చివరి దశ స్థాన పరిశీలన పనులను జూన్ 27, 2017 న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు గారు ప్రారంభించనున్నారు. దీనికి సంభందించి ఇండియన్ రైల్వే ట్వీట్ చేసింది.

ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్

ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్ ప్రాజెక్ట్ కోసం 157.77 కోట్ల రుపాయల నిధుల అవసరం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ మొత్తం నిధులను రక్షణ మంత్రిత్వ శాఖ(Defence Ministry) కేటాయించనుంది.

ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్

హిమాలయాల్లో ప్రతిపాదిత రైల్వే లైన్ బిలాస్‌పూర్ నుండి సుందర్ నగర్ మండి, మనాలి, తండి, కేలాంగ్, కోక్సర్, దార్చా, ఉప్షి మరియు కారు వంటి ప్రాంతాలను కలుపుతూ లేహ్ వరకు విస్తరించనుంది.

ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్

ప్రస్తుతం ఈ రైల్వే లైన్ ప్రతిపాదిత ప్రాంతాలకు ఉన్న రోడ్డు మార్గం ఏడాదిలో ఐదు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. కొన్నిసందర్భాల్లో ఈ మార్గాల్లో రోడ్డు ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ రైల్వే లైన్ పూర్తయితే ఇక్కడి ప్రాంతాలను సురక్షితంగా అనుసంధానం చేయవచ్చు.

ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్

పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయడంలో కూడా ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది. పైన తెలిపిన ప్రాంతాల్లో ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే కాకుండా రక్షణ రంగానికి కూడా అనేక సహాయ సహకారాలు అందనున్నాయి.

ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్

ఈ రైల్వే లైను పూర్తి స్థాయిలో ప్రారంభమైతే దేశంలోని వివిధ ప్రధాన నగరాల నుండి లేహ్ వరకు ప్రత్యేక రైళ్లను నడిపి, ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్‌ను ప్రధాన పర్యాటక ప్రాంతాలతో అనుసంధానం చేయనున్నారు.

ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్

భారత రక్షణ దళాలకు ఆయుధ సరఫరా మరియు సరిహద్దులో సైనికుల అవసరాలను తీర్చేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నిధులతో ఈ రైల్వే లైన్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించడం దేశం మొత్తం గర్వించదగ్గ అంశం. దీనికి ఇండియన్ రైల్వే కూడా సహాయ సహకారాలు అందివ్వనుంది.

Read more on: #రైలు #rail
English summary
Read In Telugu Indian Railway Commences World's Highest Rail Track To Leh
Story first published: Tuesday, June 27, 2017, 19:02 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark