అండమాన్ నికోబార్ దీవుల్లో రైల్వే లైన్ విస్తరణ: ఇండియన్ రైల్వే

Written By:

అండమాన్ నికోబార్ దీవుల సమూహం భారత దేశం యొక్క కేంద్ర పాలిత ప్రాంతము. ఈ దీవులు బంగాళా ఖాతానికి దక్షిణంగా హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. అండమాన్ మరియు నికోబార్ దీవులు సముద్రం మీద రెండు విడి భాగాలుగా ఉంటాయి. ఈ కేంద్ర పాలిత ప్రాంతం యొక్క రాజధాని పోర్ట్ బ్లెయిర్.

అండమాన్ నికోబార్ దీవుల గురించి ప్రధాన విశయాలు తెలుసుకున్నాం కదా... ఈ అందమైన దీవుల్లో రైల్వే మార్గాన్ని విస్తరించడానికి ఇండియన్ రైల్వే సిద్దంగా ఉంది. దీని గురించి పూర్తి వివరాలు నేటి కథనంలో....

అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతంలోని రెండు ప్రధాన నగరాలైన పోర్ట్ బ్లెయిర్ మరియు డిగ్లిపూర్ మధ్య సుమారుగా 240 కిలోమీటర్ల మేర బ్రాడ్ గేజ్ రైల్వే నిర్మాణానికి ఇండియన్ రైల్వే సిద్దంగా ఉంది.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా భారత దేశం యొక్క రైల్వే మ్యాపులో అండమాన్ నికోబార్ ద్వీపసమూహాన్ని చేర్చనుంది. అండమాన్ ద్వీపసమూహంలో అత్యంత పొడవైన ఈ మార్గంలో రైల్వే లైన్ ప్రాజెక్ట్‌కు అనుమతులు పొందేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ సిద్దమవుతోంది.

అండమాన్ నికోబార్ దీవుల్లోని దక్షిణ భూబాగంలో ఉన్న రాజదాని నగరం నుండి ఉత్తర దీవుల్లో ఉన్న మరో పెద్ద నగరం డిగ్లిపూర్ మధ్య బస్సు మార్గం యొక్క పొడవు 350కిలోమీటర్లుగా ఉంది.

ఈ మార్గంలో ప్రయాణ సమయం సుమారుగా 14 గంటలు. ఇక ఈ రెండు నగరాలను మధ్య నౌకా ప్రయాణానికి 24 గంటలు పడుతుంది.

కేంద్ర మంత్రి వర్గంలోని అంతర్గత సర్వే రిపోర్ట్ నివేదిక ప్రకారం, ఈ రైల్వే లైన్ నిర్మాణానికి అయ్యే ఖర్చు సుమారుగా రూ. 2,413.68 కోట్లుగా ఉండనుందని అంచనా. ఈ మొత్తం పెట్టుబడి మీద వడ్డీ శాతం -9.46 శాతం ఉంటున్నట్లు రిపోర్ట్ చెబుతోంది.

అయ్యే ఖర్చును ప్రక్కన పెడితే అండమాన్ నికోబార్ దీవుల్లో వ్యూహాత్మక ప్రాముఖ్యత మరియు విభిన్నత్వానికి ప్రదాన్యతనిస్తూ ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఎంతో ఆసక్తిగా ఉంది.

ఇది పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్న ప్రదేశం కావడం మరియు భారత దేశపు ప్రధాన భూ బాగానికి దూరంగా, ఇండియన్ రైల్వే నిర్మించే ఈ ప్రాజెక్ట్ ఒక కళగా చెప్పుకోవచ్చు. మంత్రిత్వ శాఖ ప్రణాళికలు మరియు ఆర్థిక శాఖలోని ప్రధాన సభ్యులు ఈ ప్రాజెక్ట్‌కు అంగీకారం తెలిపారు.

అండమాన్ నీకోబార్ దీవులకు 50 శాతం ఖర్చుతో ఇండియన్ రైల్వే నిర్మించనుంది. అయితే మిగతా భారాన్ని ఆ ప్రాంత పాలనా వ్యవస్థ భరించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏడాది 4.5 లక్షల మంది పర్యాటకుల తాకిడి ఉన్న ఈ ప్రాంతానికి భవిష్యత్తులో ఈ సంఖ్య 6 లక్షలకు పెరిగే అవకాశం ఉంది.

ఈ అంశం గురించి అండమాన్ నికోబార్ గవర్నర్ జగదీష్ ముఖి మాట్లాడుతూ, నిర్వహణ నష్టాన్ని పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు అభిప్రయాన్ని వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్న ప్రదేశాలు రోస్ అండ్ స్మిత్ ఐల్యాండ్స్, అయితే ప్రపంచ దేశాల నుండి పోర్ట్ బ్లెయిర్‌కు అక్కడి నుండి డిగ్లిపూర్ చేరుకోవడం చాలా ప్రయాసలతో కూడుకున్నది.

పర్యాటకులకు ఈ రెండు ప్రాంతాల మద్య రవాణా మెరుగుపరచం ద్వారా అండమాన్ నికోబార్ ఆర్థికంగా మంచి ప్రగతిని సాధించే అవకాశం ఉంది. అయితే ఇందుకు ప్రస్తుతం నిర్మించ తలపెట్టిన రైల్వే లైన్ పాత్ర ప్రధానం అని చెప్పాలి.

మీకు 'రోరో రైల్' గురించి తెలుసా?
రోరో రైల్.. ఈ పేరే కొత్తగా ఉంది కదూ. కానీ ఇది 18 ఏళ్ల పాత పేరు. అవును కొంకణ్ రైల్వే ఈ విశిష్టమైన రోరో రైల్ సేవలను ప్రారంభించి ఈ ఏడాది జనవరితో సరిగ్గా 18 ఏళ్లు పూర్తయ్యాయి. రోరో అంటే రోల్-ఆన్ రోల్-ఆఫ్ అని అర్థం. ఇదొక రవాణా రైలు.

 

Read more on: #రైలు #rail
English summary
Indian Railways Plans Introduce Rail Service Andaman Nicobar Islands
Story first published: Tuesday, February 7, 2017, 15:58 [IST]
Please Wait while comments are loading...

Latest Photos