ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా పైలట్‌ అవని చతుర్వేది

Written By:

కుటుంబ బాధ్యతలు భర్త మరియు పిల్లల ఆలన పాలనా చూసుకోవడంలో స్త్రీమూర్తి జీవితం తలమునకలైపోతోంది. మది నిండా ఎన్నో ఆలోచనలు, ఆశలు, ఆశయాలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేని పరిస్థితుల్లో ఎందరో మహిళలు నాలుగు గోడల మధ్య జీవనానికి పరిమితమైపోయారు.

Recommended Video - Watch Now!
Largest Planes In The World

కానీ, ఇటీవల కాలంలో పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో మేటిగా రాణిస్తున్నారు. పుట్టినప్పటి నుండి పెళ్లి వరకు అడుగడుగునా ఎదురయ్యే అవాంతరాలను ఎదుర్కొని ముందడగు వేస్తూ మేలైన విజయాలు సాధిస్తున్నారు. మహిళలకు అసాధ్యం అనే అన్ని రంగాల్లో కూడా తమ ప్రాబల్యాన్ని చాటుకుంటున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మధ్యనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా పైలట్‌గా ఎంపికైన అవని చతుర్వేది గురించి ప్రత్యేక కథనం....

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా పైలట్‌ అవని చతుర్వేది

కొన్ని దశాబ్దాల పాటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో కేవలం పురుషులు మాత్రమే యుద్ద విమానాలకు పైలట్లుగా వ్యవహరించారు. అయితే, ఈ లింగ వివక్షతకు ముగింపు పలుకుతూ ఫిబ్రవరి 19 న అవని చతుర్వేది భారతదేశపు తొలి యుద్ద విమానాల పైలట్‌గా చరిత్ర పుటల్లోకి తొలి పేజీని లిఖించింది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా పైలట్‌ అవని చతుర్వేది

సరిగ్గా మూడు వారాల క్రితం భారత మహిళ అవని చతుర్వేది మిగ్ 21 బిసోన్ యుద్ద విమానాన్ని ఒటరిగా నడిపి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా పైలట్‌గా నిలిచింది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా పైలట్‌ అవని చతుర్వేది

మధ్యప్రదేశ్ లోని చిన్న పట్టణం నుండి వచ్చిన అవని చతుర్వేది యుద్ద విమాన పైలట్‌గా రాణించడమే కాకుండా భారతదేశంలో లింగ సమానత్వం చుట్టూ ఉన్న అనాగరిక ఆంక్షలను తొలగించడంలో విశేషంగా దోహదపడింది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా పైలట్‌ అవని చతుర్వేది

సరిగ్గా ఏడాదిన్నర క్రితం, జూన్ 2016లో, అవని చతుర్వేదితో సహా భావన కాంత్ మరియు మోహనా సింగ్ ముగ్గురూ భారతదేశపు తొలి మహిళా ఫైటర్ జెట్ పైలట్లుగా నిలిచి చరిత్రను తిరగరాశారు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా పైలట్‌ అవని చతుర్వేది

కొన్ని దశాబ్దాల పాటు, మహిళల ప్రెగ్నెన్సీ, మానసిక మరియు శారీరక సామర్థ్యం మరియు రుతుస్రావం వంటి అంశాల కారణంగా అధిక ఒత్తిడితో కూడిన పనులు మరియు సైనిక బలగాల్లో మహిళలు రాణించలేరనే ఒక ఏకాభిప్రాయం పురుషుల్లో ఉంది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా పైలట్‌ అవని చతుర్వేది

"యుద్ద మరియు సైనిక బలగాల్లో మరియు ఎక్కువ ఒత్తిడి గల పని ప్రదేశాల్లో పురుషులు మాత్రమే పని చేయగలరనే ఒక శాశ్వితమైన ధృడ నమ్మకం సహజ సిద్దంగా అందిరిలోను ఉంటుంది." ఈ కారణం చేతనే మహిళలు ఈ రంగాల్లో రాణించలేకపోతున్నారని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త మరియు చరిత్రకారిణి వ్రాసిన "ఉమెన్ ఇన్ ది ఆర్మీ", ఎకనామిక్ అండ్ పొలిటకల్ వీక్లీ ఆగష్టులో 2010లో ప్రచురితమైన అనే కథనంలో పేర్కొంది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా పైలట్‌ అవని చతుర్వేది

పురుషులు మాత్రమే ఈ వృత్తిలో రాణించగలరనే నమ్మకాన్ని అస్థిరపరిచేందుకు అవని చతుర్వేది చాలా కష్టపడింది. హైదరాబాదులోని దుండిగల్ సమీపంలో ఉన్న ట్రైనింగ్ అకాడమీలో కఠినమైన శిక్షణ తీసుకుంది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా పైలట్‌ అవని చతుర్వేది

అవని చతుర్వేది కుటుంబ సభ్యులు కూడా వెన్నుగా నిలిచారు. సమాజంలో లింగ వివక్షతను ప్రక్కనపెట్టి మొత్తానికి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా పైలట్‌ అవని చతుర్వేది

ఇప్పుడు, ఎంతో మంది అమ్మాయిలు పైటర్ పైలట్లు కావాలనుకుంటున్నారు. మొదట్లో అందరూ వాణిజ్య విమానాలకు పైలట్లుగా పనిచేయాలని భావిస్తారు. కానీ, ఇప్పుడు అవని చతుర్వేదిని ఆదర్శంగా తీసుకొన్ని ప్రతిష్టాత్మక ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌లో యుద్ద విమానాలకు పైలట్లుగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు.

English summary
Read In Telugu: Indias first female fighter pilot avani chaturvedi
Story first published: Thursday, March 8, 2018, 14:45 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark