భారత్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ వెనకున్న సవాళ్లు మరియు ప్రభుత్వ కార్యచరణ

భారత్ రైల్వే రూపు రేఖలు మార్చనున్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్

By Anil

రైల్వే సామ్రాజ్యంలో బుల్లెట్ రైళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం బుల్లెట్ రైళ్లను వినియోగిస్తున్న దేశాల్లో గంటకు 320కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే బుల్లెట్ రైళ్లు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుండి ఇండియన్ రైల్వేలోకి బుల్లెట్ రైళ్ల రాక ఒక అందని ద్రాక్షగా ఉండేది.

అయితే ఎన్‌డిఏ ప్రభుత్వం పాలనలోకి వచ్చాక, దేశానికి నాలుగు దిక్కుల్లో ఉన్న ఢిల్లీ, కలకత్తా, చెన్నై మరియు ముంబాయ్‌ నగరాలను కలుపుతూ చతుర్భుజాకారంలో బుల్లెట్ రైలు మార్గాన్ని నిర్మిస్తామని ప్రమాణం చేసింది. దీనికి అనుగుణంగా కార్యచరణ సిద్దమవుతోంది.

Recommended Video

Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
భారత్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్

భారత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్

ఇండియాలో హై స్పీడ్ రైల్వే నెట్‌వర్క్ ఏర్పాటుకు జపాన్ ప్రధాని షింజో అబే సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పునాది రాయి వేయనున్నారు. గంటకు 320కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే తొలి బుల్లెట్ రైలు సర్వీసును అహ్మదాబాద్ మరియు ముంబాయ్‌ల మధ్య ప్రారంభించి. ఆ తరువాత ఢిల్లీకి అనుసంధానం చేయనున్నారు.

భారత్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్

నిర్మాణం ఎప్పటి నుండి మొదలవుతుంది ?

ముందుగా భావించిన ప్రాంతాల మధ్య బుల్లెట్ రైలు మార్గాన్ని నిర్మించడానికి ఇప్పటికే పలు దఫాలుగా ఎన్నో అధ్యయనాలు జరిగాయి. అయితే ఇరు దేశ ప్రధానులు ఈ ప్రాజెక్టుకు వచ్చే సెప్టెంబర్‌లో పునాది రాయి వేయడానికి సిద్దమయ్యారు.

భారత్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్

2018 నుండి నిర్మాణ పనులు ప్రారంభించి 2023 నాటికి తొలి విడుదల బుల్లెట్ రైలు మార్గాన్ని పూర్తి స్థాయిలో నిర్మించనున్నారు. మరియు అదే ఏడాది ముంబాయ్-అహ్మదాబాద్ ప్రాంతాల మధ్య బుల్లెట్ రైలు సేవలను ప్రారంభించాలని నిర్ణయించారు.

భారత్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్

ముంబాయ్ అహ్మదాబాద్ ప్రాంతాల మధ్య బుల్లెట్ నిర్మాణానికి సుమారుగా 15బిలియన్ అమెరికన్ డాలర్ల బడ్జెట్ అవసరం అని ప్రతిపాదించడం జరిగింది. ఇందులో 81 శాతం నిధులను జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ స్వల్ప వడ్డీ రేటుతో దీర్ఘకాలిక రుణాన్ని అందివ్వడానికి వచ్చింది. ఈ మొత్తం నిధులతో ఇండియన్ రైల్వే సహకారంతో బుల్లెట్ రైలు సామ్రాజ్యాన్ని నిర్మించనున్నారు.

భారత్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్

బుల్లెట్ రైలు ఎంత ప్రయాణాన్ని సమయాన్ని తగ్గిస్తుంది?

ప్రస్తుతం అహ్మదాబాద్ నుండి ముంబాయ్ ఇండియన్ రైల్వేలోని ఎక్స్‌ప్రెస్ రైళ్లో ప్రయాణ సమయం 7 గంటలుగా ఉంది. అయితే ఈ కారిడార్‌లో బుల్లెట్ రైలు సేవలు ప్రారంభమైతే, కేవలం రెండు గంటల్లోపే గమ్యస్థాన్ని చేరుకోవచ్చు. సుమారుగా ఐదు గంటల వరకు ప్రయాణ సమయం తగ్గిపోనుంది.

భారత్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్

సముద్ర మార్గంలో ప్రయాణించనున్న బుల్లెట్ రైలు

ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా...? నిజమే భారత ప్రభుత్వం ప్రతిపాదించిన తొలివిడుత బుల్లెట్ రైలు మార్గంలో సుమారుగా ఏడు కిలోమీటర్ల మేర రైలు సముద్ర గర్బంలో ప్రయాణించనుంది.

భారత్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్

బుల్లెట్ రైలు కారిడార్‌ను ఎవరు నిర్మిస్తారు ?

ముంబాయ్ నుండి అహ్మదాబాద్ మధ్య ఉన్న 450కిలోమీటర్ల దూరాన్ని భారతీయ కాంట్రాక్టర్లు నిర్మిస్తారు. అయితే ఇందులో ఉన్న 52 కిలోమీటర్ల దూరాన్ని జపాన్ నిర్మాణ సంస్థలు నిర్మించనున్నాయి. సముద్ర గర్భంలో బుల్లెట్ రైలు మార్గాన్ని నిర్మించే సాంకేతికత పరిజ్ఞానం భారత నిర్మాణ సంస్థల వద్ద లేకపోవడంతో జపాన్ సంస్థలకు అప్పగించనుంది.

భారత్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్

బుల్లెట్ రైలు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

జపాన్ అభివృద్ది చేసిన ఇ5 సిరీస్ షింకెన్‌సన్ బుల్లెట్ రైలు ఇండియన్ రైల్వేలో పరుగులు పెట్టనున్న తొలి బుల్లెట్ రైలు. ఈ రైలు మొత్తం పది భోగీలను కలిగి ఉండనుంది. వీటిలో మొత్తం 731 సీట్లు ఉండగా, వీటిలో 698 సీట్లు స్టాండర్డ్ క్లాస్ మరియు 55 సీట్లు బిజెన్ క్లాస్ సీట్లుగా ఉంటాయి.

భారత్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్

ఈ రైలును జపాన్‌లో పరీక్షిస్తున్నపుడు గరిష్టంగా గంటకు 400కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అయితే ప్రయాణికుల మరియు పర్యావరణ శ్రేయస్సు కోసం దీని గరిష్ట వేగాన్ని 320కిలోమీటర్లకే పరిమితం చేసారు.

భారత్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్

షింకెన్‍‌సన్ బుల్లెట్ రైలుకు ముందువైపు పొడవాటి ముక్కు ఉంటుంది. దీని పొడవు సుమారుగా 15 మీటర్లుగా ఉంది. మలుపుల్లో మరియు టన్నెల్ వద్ద రైలు ముందు భాగం ప్రమాదానికి గురికావడాన్ని మరియు గాలితో కలిగే ఘర్షణను ఎదుర్కోవడానికి ఇలా పొడవాటి ముక్కును ముందువైపు అందివ్వడం జరిగింది.

భారత్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్

రైలులో అత్యంత వివేకవంతమైన సస్పెన్షన్ సిస్టమ్ కలదు. అత్యధిక వేగం వద్ద వచ్చే కుదుపులను పూర్తి స్థాయిలో తగ్గించి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కారణంగా రైలు ఒకవైపు వాలడాన్ని టిల్ట్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా నివారిస్తుంది.

భారత్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్

జపాన్‌లోని స్టాండర్డ్ బుల్లెట్ రైళ్ల ఇంటీరియర్‌లో లగ్జరీ లెథర్ సీట్లు, ఉన్ని కార్పెట్లు, డార్క్ వుడ్ మరియు మెటాలిక్ ఇంటీరియర్ ఎలిమెంట్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.

భారత్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్

ఎలక్ట్రిక్ పవర్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సీట్లు, చీకట్లో చదువుకునేందుకు ప్రత్యేక లైట్లు కూడా ఇందులో ఉన్నాయి. మడపడానికి వీలున్న డైనింగ్ టేబులు, కాక్‌టెయిల్ ట్రే వంటి సకల సదుపాయాలు ఈ బుల్లెట్ రైళ్లలో ఉన్నాయి.

Most Read Articles

Read more on: #రైలు #rail
English summary
Read In Telugu: Interesting Details About Shinkansen Bullet Train
Story first published: Tuesday, August 8, 2017, 18:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X